MS Dhoni Twitter Issue : ఫ్యాన్స్‌ ఆగ్రహంతో వెనక్కు తగ్గిన ట్విట్టర్..! టిక్ మార్క్ అప్‌డేట్ చేసిన కంపెనీ..

|

Aug 06, 2021 | 5:46 PM

MS Dhoni Twitter Issue : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గత రెండు రోజులుగా ట్విట్టర్ ఖాతాకు సంబంధించిన ఇష్యూతో వార్తల్లో నిలిచారు. ధోనీ ఖాతాకు

MS Dhoni Twitter Issue : ఫ్యాన్స్‌ ఆగ్రహంతో వెనక్కు తగ్గిన ట్విట్టర్..! టిక్ మార్క్ అప్‌డేట్ చేసిన కంపెనీ..
Ms Dhoni Twitter Issue
Follow us on

MS Dhoni Twitter Issue : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గత రెండు రోజులుగా ట్విట్టర్ ఖాతాకు సంబంధించిన ఇష్యూతో వార్తల్లో నిలిచారు. ధోనీ ఖాతాకు ట్విట్టర్ బ్లూ టిక్‌ను తీసివేసింది. అయితే ట్విట్టర్ ఇలా ఎందుకు చేసిందో వివరణ మాత్రం ఇవ్వలేదు. కొంతమంది అతను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేనందున ఈ చర్య తీసుకుందని మొదటగా భావించారు. అయితే ట్విట్టర్ చేసిన ఈ పనికి ధోని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా కేంద్రంగా విపరీతంగా ట్రోల్ చేశారు. ట్విట్టర్ ధోనిని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తుందని ఆరోపించారు. వివరణ లేకుండా ఇలా చేయడం దారుణమని కామెంట్స్ చేశారు. అభిమానుల ఆగ్రహాన్ని తట్టుకోలేకపోయిన ట్విట్టర్ ట్విట్టర్ వెనక్కు తగ్గింది. వెంటనే బ్లూ టిక్‌ని అప్‌డేట్ చేసింది.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. ఐపీఎల్ సీజన్ 14 వాయిదా పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనకు దొరికిన సమయాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. కుటుంబ సభ్యులతో, స్నేహితులు, బంధువులతో సరదాగా గడిపేస్తున్నాడు. తన వ్యక్తిగత జీవితాన్ని ఆనందిస్తున్నాడు. ధోని సోషల్ మీడియాకు ఉన్నా.. అతని భార్య సాక్షి సింగ్ మాత్రం ఎప్పటికప్పుడు ధోనీ అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా సాక్షి సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మహీ నయా లుక్ ఫోటోలు, స్నేహితులతో సరదాగా గడుపుతున్న పోటోలను చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

Ms

Bigg Boss Telugu 5: భారీ రెమ్యునరేషన్‌‌‌‌తో ‘బిగ్ బాస్’5లోకి ఎంటర్ అవ్వనున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్..?

Meil: పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం పనులను వేగవంతం చేసిన మేఘా

Sonu Sood : సోనుసూద్ ట్రావెల్ బిజినెస్..! ఇక వారికి ఎలాంటి సమస్య ఉండదు.. తెలుసుకోండి