IPL 2024: 20వ ఓవర్‌లో అత్యధిక సిక్స్‌లు.. ఫినిషర్‌ రోల్‌కే రోల్ మోడల్ మనోడే.. టాప్ 10 లిస్ట్ ఇదే?

|

Apr 14, 2024 | 1:21 PM

Sixes In 20th Over: క్రికెట్‌లో రన్ ఛేజింగ్ గొప్ప కళ. ఇందులో అత్యంత కష్టతరమైన పని ఫినిషర్. ఎందుకంటే అన్ని రకాల పరిస్థితుల్లో మ్యాచ్‌ని ఎలా ముగించాలో తప్పక తెలియాలి. ఇందులో ఆరితేరినవాడు ఎంఎస్ ధోని (MS Dhoni). ఎందుకంటే ఈ జార్ఖండ్ డైనమేట్ చివరి వరకు ఉండి భారత్‌ (Team India)కు లెక్కలేనన్ని మ్యాచ్‌లను గెలిపించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ (IPL)లో కూడా, చివరి ఓవర్‌లో ధోనీ తన జట్టుకు చాలా మ్యాచ్‌లను గెలిపించాడు.

IPL 2024: 20వ ఓవర్‌లో అత్యధిక సిక్స్‌లు.. ఫినిషర్‌ రోల్‌కే రోల్ మోడల్ మనోడే.. టాప్ 10 లిస్ట్ ఇదే?
Sixes In 20th Over
Follow us on

Sixes In 20th Over: క్రికెట్‌లో రన్ ఛేజింగ్ గొప్ప కళ. ఇందులో అత్యంత కష్టతరమైన పని ఫినిషర్. ఎందుకంటే అన్ని రకాల పరిస్థితుల్లో మ్యాచ్‌ని ఎలా ముగించాలో తప్పక తెలియాలి. ఇందులో ఆరితేరినవాడు ఎంఎస్ ధోని (MS Dhoni). ఎందుకంటే ఈ జార్ఖండ్ డైనమేట్ చివరి వరకు ఉండి భారత్‌ (Team India)కు లెక్కలేనన్ని మ్యాచ్‌లను గెలిపించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ (IPL)లో కూడా, చివరి ఓవర్‌లో ధోనీ తన జట్టుకు చాలా మ్యాచ్‌లను గెలిపించాడు. ఈ కారణంగా, విజయవంతమైన పరుగుల వేటలో 20వ ఓవర్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

ఐపీఎల్ చరిత్రలో విజయవంతమైన పరుగుల వేటలో 20వ ఓవర్‌లో ఎంఎస్ ధోని అత్యధికంగా 13 సిక్సర్లు కొట్టాడు. ఈ విషయంలో మరే ఇతర బ్యాట్స్‌మెన్ కూడా అతనికి దగ్గరగా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో రెండో స్థానంలో ఉన్న కీరన్ పొలార్డ్ కేవలం 7 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. డేవిడ్ మిల్లర్ కూడా 7 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. కాగా, రవీంద్ర జడేజా ఇప్పటి వరకు 6 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ పేరు కూడా ఉంది. విజయవంతమైన పరుగుల వేటలో ఇప్పటివరకు హిట్‌మ్యాన్ 20వ ఓవర్లో 5 సిక్సర్లు కొట్టాడు. రింకూ సింగ్, డ్వేన్ బ్రావోలు కూడా తలో 5 సిక్సర్లు కొట్టారు.

ఇవి కూడా చదవండి

షిమ్రాన్ హెట్మెయర్ 2 సిక్సర్లు బాది రాజస్థాన్ రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఇప్పుడు ఈ జాబితాలోకి షిమ్రాన్ హెట్మెయర్ పేరు కూడా చేరింది. IPL 2024లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో, అతను చివరి ఓవర్‌లో 2 సిక్సర్లు కొట్టి రాజస్థాన్ రాయల్స్‌ను విజయపథంలో నడిపించాడు. ఇప్పుడు అతని విజయవంతమైన పరుగుల వేటలో చివరి ఓవర్లో మొత్తం 4 సిక్సర్లు చేరాయి. రాహుల్ తెవాటియా కూడా 4 సిక్సర్లు కొట్టాడు.

IPL 2024 27వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. షిమ్రోన్ హెట్‌మెయర్‌ తన విపరీతమైన ఇన్నింగ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..