MS Dhoni, : ఎంఎస్ ధోని కెరీర్‌లోనే ఓ తుఫాన్ ఇన్నింగ్స్ సంబంధించిన ఈ కథ 18 ఏళ్లనాటిది. 2005లో జైపూర్ మైదానంలోకి అడుగుపెట్టి ధోనీ పెను తుఫాను సృష్టించిన సంగతి తెలిసిందే. 50 ఓవర్ల క్రికెట్‌లో శ్రీలంకతో భారత్ ఆడిన మ్యాచ్ ఇది. భారత్‌పై శ్రీలంక బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తూ.. భయపెట్టారు. తొలి ఐదు బంతుల్లోనే వారి ప్రభావం కనిపించింది. భారత ఓపెనింగ్ జోడీ సచిన్, సెహ్వాగ్‌లను తొలి ఓవర్‌లోనే అడ్డుకట్ట వేశారు. కానీ, సెహ్వాగ్ వికెట్ తీసిన సంబరాల్లో మునిగిన శ్రీలంక జట్టుకు.. అసలు సమ్యస అప్పుడే మొదలైంది.
సెహ్వాగ్ వికెట్ తీసిన తర్వాత శ్రీలంక ఆటగాళ్ల ముఖాల్లో కనిపించిన చిరునవ్వు ఎంతో సేపు నిలవలేదు. ఎందుకంటే 3వ స్థానంలో ఆడేందుకు వచ్చిన ధోనీ వారిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. పిచ్ స్థితిని గ్రహించి నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఆ తర్వాత గేర్ మార్చి బౌలర్ ఎవరనేది చూడకుండా ఉతికారేశాడు.
1⃣8⃣3⃣* Runs
1⃣4⃣5⃣ Balls
1⃣5⃣ Fours
1⃣0⃣ Sixes#OnThisDay in 2005, @msdhoni went berserk against Sri Lanka to notch up his highest ODI score. 🔥 👏 💪 👍 #TeamIndiaWatch that sensational innings 🎥 🔽 pic.twitter.com/FgMEhzmXet
— BCCI (@BCCI) October 31, 2021
31 అక్టోబర్ 2005న భారత్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోనీ దెబ్బ రుచి చూడని బౌలర్ లేడు. మైదానం మధ్యలో నిలబడి సెంచరీ చేయడమే కాకుండా తన వన్డే కెరీర్‌లోనే అతిపెద్ద స్కోర్‌ను నమోదు చేసి, తుఫాను సృష్టించాడు. ఆ రోజు ధోని 145 బంతులు ఎదుర్కొని 10 సిక్సర్లు, 15 ఫోర్లతో అజేయంగా 183 పరుగులు చేశాడు.
శ్రీలంక నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో ధోనీ తన డేంజరస్ ఇన్నింగ్స్‌కు స్క్రిప్ట్‌ను రాసుకున్నాడు. దాని ప్రతిధ్వని 18 ఏళ్ల తర్వాత కూడా కొనసాగుతుంది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. శ్రీలంక తరపున కూడా కుమార సంగక్కర 138 పరుగుల భారీ ఇన్నింగ్స్‌ను సాధించాడు.
కానీ, శ్రీలంక వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ చేసిన సెంచరీకి స్పందించిన భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అంటే ఎంఎస్ ధోనీ. సెంచరీ చేసి చివరి వరకు నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతని అజేయంగా 183 పరుగులతో ఆకట్టుకున్నాడు. 18 సంవత్సరాల క్రితం ఆడిన మ్యాచ్‌లో టీమిండియా ధోనీ ఇన్నింగ్స్ కారణంగా 6 వికెట్లు, 23 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..