MS Dhoni : అహ్మదాబాద్‌లో థలా సందడి.. భారీ భద్రత మధ్య ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఎంఎస్ ధోనీ

MS Dhoni : అహ్మదాబాద్ నగరం ఇప్పుడు క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోతోంది. టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్న తరుణంలో, భారత మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ అక్కడ ల్యాండ్ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

MS Dhoni : అహ్మదాబాద్‌లో థలా సందడి.. భారీ భద్రత మధ్య ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఎంఎస్ ధోనీ
Dhoni

Updated on: Mar 08, 2026 | 11:48 AM

MS Dhoni : అహ్మదాబాద్ నగరం ఇప్పుడు క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోతోంది. టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్న తరుణంలో, భారత మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ అక్కడ ల్యాండ్ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆదివారం ఉదయం భారీ భద్రత మధ్య అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ధోనీని చూడటానికి అభిమానులు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడంతో, టీమ్ ఇండియా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. థాలా వచ్చాడు.. ఇక ట్రోఫీ కన్ఫర్మ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ధోనీ కేవలం ఫైనల్ మ్యాచ్‌కే కాదు, అంతకుముందు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్‌కూ హాజరయ్యారు. ఆ సమయంలో రోహిత్ శర్మతో ధోనీ ముచ్చటించిన వీడియోలు, ఫోటోలు ట్రెండ్ అయ్యాయి. 2011 ప్రపంచకప్ అందించిన అదే మైదానంలో ధోనీ మెరవడంతో ఫ్యాన్స్ పులకించిపోయారు. ఇప్పుడు అహ్మదాబాద్‌లో జరగబోయే కీలకమైన ఫైనల్ పోరులో కూడా ధోనీ గ్యాలరీలో ఉండి మన ఆటగాళ్లను ఉత్సాహపరచనున్నారు. ఈ వేదికపైనే ధోనీ సారధ్యంలోని సిఎస్కే ఐపీఎల్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే.. ఆ సెంటిమెంట్ ఇక్కడ కూడా వర్కవుట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

నెటిజన్ల భిన్న స్పందనలు

ధోనీ రాకపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. కొందరు “థాలా ఫర్ ఏ రీజన్.. కప్పు మనదే” అని సంబరపడుతుంటే, మరికొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. “ఇంత సెక్యూరిటీ అవసరమా?” అని కొందరు, “లైవ్ టెలికాస్ట్ లో సడన్ గా చూపిస్తే బాగుండేది, ముందే తెలిస్తే ఆ థ్రిల్ ఉండదు” అని మరికొందరు పెదవి విరుస్తున్నారు. మరికొందరు అయితే “ధోనీకి స్పాన్సర్లు లేక ఇలా స్టేడియాల చుట్టూ తిరుగుతున్నాడా?” అని సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా, ధోనీ క్రేజ్ మాత్రం అణువంత కూడా తగ్గలేదని ఎయిర్‌పోర్ట్ వద్ద జరిగిన సందడే నిదర్శనం.

ఐపీఎల్ 2026 కోసం సిద్ధం

వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ధోనీ తన తదుపరి లక్ష్యంపై దృష్టి పెట్టనున్నారు. మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026లో ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడబోతున్నారు. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ధోనీ తన మార్కు చూపించనున్నారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో సంజూ శాంసన్ కూడా సీఎస్‌కేలో చేరడం టీమ్ బలాన్ని పెంచింది. మరి ఈ రోజు జరగబోయే వరల్డ్ కప్ ఫైనల్ లో ధోనీ సమక్షంలో మన కుర్రాళ్ళు కప్పు గెలిచి చరిత్ర సృష్టిస్తారో లేదో చూడాలి.

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us