MS Dhoni Video: ఐపీఎల్ 2024 (IPL 2024) సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోని తన పొడవాటి జుట్టుతో విభిన్న శైలిలో కనిపిస్తున్నాడు. అయితే 42 ఏళ్ల వయసులో ఉన్న ధోనీ.. భారీ సిక్సర్లు బాదడంలో మాత్రం ఇంకా వెనకడుగు వేయలేదు. చెన్నై తరపున 20వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టి అభిమానులందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఆ తర్వాత ధోని వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యింది. ఇందులో ధోని ముంబైకి చెందిన ఒక చిన్నారి అభిమానికి ప్రత్యేకమైన బంతిని బహుమతిగా ఇచ్చాడు.
చెన్నై ఇన్నింగ్స్ 20వ ఓవర్ రెండో బంతికి డారిల్ మిచెల్ ఔట్ అయ్యి పెవిలియన్ బాట పట్టగా.. అభిమానుల హోరు మధ్య మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలోకి అడుగుపెట్టాడు. ధోనీ మైదానంలోకి అడుగుపెట్టిన వెంటనే హార్దిక్ వేసిన మూడు, నాలుగు, ఐదో బంతుల్లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. కాగా, చివరి బంతికి రెండు పరుగులు చేశాడు. ఈ విధంగా, ధోనీ 500 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అజేయంగా 20 పరుగులు చేయడంతో, అతను వెంటనే డ్రెస్సింగ్ రూమ్ వైపు పరుగెత్తడం కనిపించింది. ఈ సమయంలో, ధోనీ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లేందుకు మెట్లు ఎక్కుతున్నప్పుడు, ముంబై ఇండియన్స్ జెర్సీని ధరించిన చిన్నారి అభిమానికి అక్కడ పడి ఉన్న బంతిని బహుమతిగా ఇచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అందరి హృదయాలను గెలుచుకుంది.
Classy as always! My Idol✨💛#MSDhoni #CSKvsMI #IPL2024 #Dhoni pic.twitter.com/9M4djSWPHU
— Ishwar (@un_known_hu) April 15, 2024
Goosebumps shots
Finisher for a reason#Dhoni #CSKvMI pic.twitter.com/2JsC2Jgn6Y
— 9210 (MODI KA PARIWAR) (@appu9210) April 14, 2024
మ్యాచ్ గురించి మాట్లాడితే, చివరి ఓవర్లో మహేంద్ర సింగ్ ధోని తుఫాను ఇన్నింగ్స్ కారణంగా, చెన్నై 200 మార్కును దాటింది. 20 ఓవర్లలో ముంబైపై 4 వికెట్లకు 206 పరుగులు చేసింది. అంతకుముందు చెన్నై తరపున కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేయగా, శివమ్ దూబే కూడా 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముంబై తరపున కెప్టెన్ హార్దిక్ పాండ్యా 3 ఓవర్లలో 43 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే ధోని ఆడిన 4 బంతుల్లోనే మూడు సిక్సులతోసహా 20 పరుగులు చేశాడు. ఇదే తేడాతో ముంబై మ్యాచ్‌లో ఓడిపోయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..