
MS Dhoni’s Batting Number In IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. అన్ని జట్లు మార్పులతో సరికొత్తగా బరిలోకి దిగనున్నాయి. ఈ క్రమంలో ధోని ఫ్యాన్స్‌కు కీలక అప్డేట్ వచ్చింది. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున ఆడిన భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ నుంచి రిటైర్ అయినా.. తన మాజీ ఫ్రాంచైజీపై కీలక అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌కు చేరువగానే ఉంటున్నాడు. రిటైర్మెంట్ తర్వాత పూర్తిగా విశ్లేషకుడిగా మారిన రవిచంద్రన్ అశ్విన్.. రాబోయే సీజన్‌లో ఎంఎస్ ధోని (MS Dhoni) కొత్త స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని తెలిపాడు. కాగా, జార్ఖండ్ క్రికెట్ స్టేట్ అసోసియేషన్‌లో ధోని నెట్స్‌లో ఐపీఎల్ 2026 కోసం ప్రాక్టీస్‌ను తిరిగి ప్రారంభించిన కొద్ది రోజులకే ఈ టీమిండియా మాజీ దిగ్గజం ఫ్యాన్స్‌కు కీలక అప్డేట్ అందించాడు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. “ధోని ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఐపీఎల్ 2026 కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు. అతను ఫిట్‌గా కనిపిస్తున్నాడు. అయితే, ధోని 9వ స్థానంలో ఆడకపోవచ్చు. అలాగే ఇది ధోని చివరి సీజన్ కావొచ్చు. కానీ ఇమ్రాన్ తాహిర్‌ను చూసి ధోని ఉత్సాహంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ధోని 9వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని అనిపించడం లేదు. అతను పవర్‌ప్లేలో 3వ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు రెడీ ఉన్నట్లు తెలుస్తోంది. ధోని ప్రాక్టీస్ ప్రారంభించిన విధానం చూస్తుంటే 3వ స్థానంలో బ్యాటింగ్ చేయవచ్చు” అని తెలిపాడు.
IND vs NZ: టీమిండియాకు బిగ్ షాక్.. మిగిలిన 3 మ్యాచ్‌ల నుంచి తెలుగబ్బాయ్ ఔట్.. ఎవరొచ్చారంటే?
భారత క్రికెట్ హిస్టరీలోనే ధోని ఎంతో స్పెషల్ బ్యాటర్. బ్యాటింగ్ ఆర్డర్‌లోని దాదాపు అన్ని స్థానాల్లో బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉంటాడు. అయితే, ధోని ఫినిషర్‌గా తన పాత్రను సుస్థిరం చేసుకోవడంలో విజయం సాధించాడు. ఆ స్థానంలో ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా మారిపోయాడు. 3వ స్థానంలో ధోని తన ఐపీఎల్ కెరీర్‌లో 8 సార్లు మాత్రమే బ్యాటింగ్ చేశాడు. ఇందులో 124.84 స్ట్రైక్-రేట్‌తో 196 పరుగులు చేశాడు.
IND vs PAK: భారత్, పాక్ మ్యాచ్‌పై సందిగ్ధం.. బహిష్కరిస్తామంటూ పీసీబీ బెదిరింపులు..?
“ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ ఓ పవర్‌హౌస్‌ను తలపిస్తోంది. రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దుబే, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ ఇలా ఒక్కొక్కరు పవర్ ఫుల్ బ్యాటర్లు నిండి ఉన్నారు. ఇలాంటి బ్యాటింగ్ లైన్‌ను అడ్డుకోవడం ప్రత్యర్థి జట్లకు నిజంగా కష్టంగా ఉంటుంది” అని అశ్విన్ ప్రకటించాడు.