MS Dhoni: మంచి ఫుడ్ కావాలంటే.. పాకిస్తాన్ వెళ్లండి: అభిమానికి సలహా ఇచ్చిన ధోని.. వైరల్ వీడియో..

MS Dhoni Video: ఎంఎస్ ధోని గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన సంగతి తెలిసిందే. అలాగే, జట్టును ఛాంపియన్‌గా మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి కొత్త సీజన్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ధోనీ ఇంకా రిటైర్మెంట్ తీసుకోలేదు. చెన్నై అభిమానుల ముందు తన చివరి మ్యాచ్ ఆడాలనుకుంటున్నట్లు అతను గత సీజన్‌లో చెప్పుకొచ్చాడు. అయితే ఎంఎస్ ధోని ఐపీఎల్‌లో ఎంతకాలం ఆడతాడనే దానిపై ఏమీ చెప్పలేం.

MS Dhoni: మంచి ఫుడ్ కావాలంటే.. పాకిస్తాన్ వెళ్లండి: అభిమానికి సలహా ఇచ్చిన ధోని.. వైరల్ వీడియో..
Ms Dhoni Video

Edited By:

Updated on: Jan 02, 2024 | 4:49 PM

MS Dhoni Viral Video: టీమిండియా (Indian Cricket Team) మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni)కి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఎంఎస్ ధోనీని ఆటగాడిగా, మనిషిగా కూడా అందరూ ఇష్టపడుతుంటారు. ఎంఎస్ ధోనీకి సంబంధించిన ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే అతను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడు. అతని పోస్ట్‌లు, వీడియోలు చాలా తక్కువగా కనిపిస్తాయి. అయితే, అతని వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఎంఎస్ ధోని అభిమానులను పాకిస్తాన్ వెళ్లమని సలహా ఇస్తున్నాడు.

ఎంఎస్ ధోని గురించి మాట్లాడితే, అతను తన కెరీర్ తొలినాళ్లలో పాకిస్థాన్‌లో పర్యటించాడు. ఆ సమయంలో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. తన పొడవాటి హెయిర్‌స్టైల్, భారీ సిక్సర్‌లతో, ఎంఎస్ ధోని అప్పట్లో భారతదేశ క్రికెట్ ప్రేమికులను మాత్రమే కాకుండా పాకిస్తాన్ క్రికెట్ ప్రేమికులను కూడా తన అభిమానులుగా మార్చుకున్నాడు.

వైరలవుతోన్న వీడియో..

తాజాగా వైరలవుతోన్న ధోనీ వీడియోలో, అతను పాకిస్తాన్ వెళ్లాలని ఒక అభిమానితో చెబుతున్నట్లు చూడొచ్చు. అయితే, ఈ వీడియో ధోని ఎప్పుడు, ఎవరితో మాట్లాడుతున్నాడనే విషయాలపై ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు. ధోనీ మాట్లాడుతూ.. మీరు అద్భుతమైన ఆహారాన్ని ఆస్వాదించాలనుకుంటే, ఒకసారి పాకిస్తాన్‌ను సందర్శించండి అంటూ చెబుతున్నాడు.

ఎంఎస్ ధోని గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన సంగతి తెలిసిందే. అలాగే, జట్టును ఛాంపియన్‌గా మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి కొత్త సీజన్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ధోనీ ఇంకా రిటైర్మెంట్ తీసుకోలేదు. చెన్నై అభిమానుల ముందు తన చివరి మ్యాచ్ ఆడాలనుకుంటున్నట్లు అతను గత సీజన్‌లో చెప్పుకొచ్చాడు. అయితే ఎంఎస్ ధోని ఐపీఎల్‌లో ఎంతకాలం ఆడతాడనే దానిపై ఏమీ చెప్పలేం. మళ్లీ రంగంలోకి దిగాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..