
Most Expensive World Cup: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం సర్వం సిద్ధమైంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న ఈ ఐసీసీ మెగా ఈవెంట్ కోసం అన్ని జట్లు సిద్ధమయ్యాయి. అయితే, ఇప్పటి వరకు జరిగిన టీ20 ప్రపంచకప్స్ లో మోస్ట్ ఎక్స్ పెన్సివ్ ఏదో ఓసారి చూద్దాం. 2007లో మొదలైన ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఇప్పటి వరకు 9 ఎడిషన్స్ పూర్తి చేసుకుంది. 10 వ ఎడిషన్ ఫిబ్రవరి 7 నుంచి మొదలుకానుంది. ఈ క్రమంలో యూఎస్ఏ, వెస్టిండీస్‌లో జరిగిన 2024 టీ20 ప్రపంచ కప్ అత్యధిక ప్రైజ్ మనీ రికార్డ్ తో సంచలనం సృష్టించింది.
2024లో జరిగిన టీ20 ప్రపంచ కప్ కోసం ఐసీసీ రికార్డు స్థాయిలో $11.25 మిలియన్ల బహుమతిని అందించిన సంగతి తెలిసిందే. దీంతో ఐసీసీ టీ20 ప్రపంచకప్ హిస్టరీలో 2024 అత్యంత ఖరీమైన ప్రపంచకప్‌గా స్థానం దక్కించుకుంది. ఈ మేరకు ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అలార్డిస్ మాట్లాడుతూ.. “ ఈ ఈవెంట్ అనేక విధాలుగా చారిత్రాత్మకమైనది. కాబట్టి ఆటగాళ్లకు ఇచ్చే బహుమతి డబ్బు దానిని ప్రతిబింబించడం సముచితం” అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే, టోర్నమెంట్ మొదటి రౌండ్‌లో 40 మ్యాచ్‌లతో ప్రారంభమైంది. ఆ తరువాత సూపర్ 8లు జరిగాయి.
తొలి విజేత టీమిండియా నుంచి వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీని సంవత్సరాలుగా నిరంతరం ఐసీసీ పెంచుతూ వస్తోంది. 2007 నుంచి గత తొమ్మిది ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ విజేతలు ఎంత గెలిచారో ఓసారి చూద్దాం..
2024లో యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌లో రోహిత్ సేన సారథ్యలోకి భారత జట్టు టైటిల్‌ను గెలచుకుని $2.45 మిలియన్లు (సుమారు రూ. 20.42 కోట్లు) బహుమతిని దక్కించుకుంది.
2022లో ఆస్ట్రేలియాలో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్ జట్టు టైటిల్‌ను గెలుచుకోని $1.6 మిలియన్ల బహుమతిని అందుకుంది.
| సంవత్సరం | విజేత (Winner) | ప్రైజ్ మనీ (భారత కరెన్సీలో సుమారుగా) | రన్నరప్ (Runner-up) |
| 2007 | భారత్ | రూ. 2.00 కోట్లు | పాకిస్థాన్ |
| 2009 | పాకిస్థాన్ | రూ. 2.90 కోట్లు | శ్రీలంక |
| 2010 | ఇంగ్లాండ్ | రూ. 3.40 కోట్లు | ఆస్ట్రేలియా |
| 2012 | వెస్టిండీస్ | రూ. 5.40 కోట్లు | శ్రీలంక |
| 2014 | శ్రీలంక | రూ. 6.60 కోట్లు | భారత్ |
| 2016 | వెస్టిండీస్ | రూ. 10.60 కోట్లు | ఇంగ్లాండ్ |
| 2021 | ఆస్ట్రేలియా | రూ. 12.00 కోట్లు | న్యూజిలాండ్ |
| 2022 | ఇంగ్లాండ్ | రూ. 13.00 కోట్లు | పాకిస్థాన్ |
| 2024 | భారత్ | రూ. 20.42 కోట్లు | దక్షిణాఫ్రికా |
2007లో టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి, ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన టోర్నమెంట్ లో ఒకటిగా మారింది. ఇది టీ20 క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రజాదరణ పొందిందో చూపిస్తుంది.
2026లో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ క్రికెట్ అభిమానులకు ఫుల్ మజాను ఇవ్వనుంది. 2024లో విజేత జట్టుకు $2.45 మిలియన్లు (సుమారు రూ. 20.42 కోట్లు) సొంతం చేసుకోగా, 2026లో ఛాంపియన్‌గా నిలిచే జట్టు ఏకంగా $3 మిలియన్ల (సుమారు రూ. 27.48 కోట్లు) నగదును దక్కించుకోనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..