T20 Cricket: నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్‌గా సునీల్ నరైన్.. జులై 14 నుంచే టీ20 సందడి..

MLC 2023: మేజర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ జూలై 14 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్ లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ వర్సెస్ టెక్సాస్ సూపర్ కింగ్స్ మధ్య జరుగుతుంది.

T20 Cricket: నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్‌గా సునీల్ నరైన్.. జులై 14 నుంచే టీ20 సందడి..
Sunil Narine

Updated on: Jul 10, 2023 | 7:26 PM

MLC 2023: USAలో జులై 14 నుంచి ప్రారంభం కానున్న కొత్త T20 లీగ్ మేజర్ లీగ్ క్రికెట్ 2023 లో లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ (LA KR)కు సునీల్ నరైన్ సారథ్యం వహించనున్నాడు. దీని ద్వారా విండీస్ స్పిన్ ఆల్ రౌండర్ లీగ్ క్రికెట్ లో కెప్టెన్ గా అరంగేట్రం చేయనున్నాడు.

నేను నైట్ రైడర్స్ ఫ్రాంచైజీలోని అన్ని జట్లకు ప్రాతినిధ్యం వహించాలనుకున్నాను. మేం అమెరికాకు రాకముందు కూడా దీనిపై సుదీర్ఘంగా చర్చించాం. ఇప్పుడు కెప్టెన్‌గా జట్టును నడిపించడం ఆనందంగా ఉంది. ఈ జట్టులో చాలా మంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారంటూ చెప్పుకొచ్చాడు. జట్టును విజయవంతంగా నడిపించగలడన్న నమ్మకం ఉందంటూ సునీల్ నరైన్ తెలిపాడు.

అలాగే, ఫిల్ సిమన్స్ లాస్ ఏంజిల్స్ జట్టు ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్కెట్ కనిపిస్తాడు. అలాగే బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్ జట్టుకు తోడుగా ఉంటాడు. భరత్ అరుణ్ గతంలో టీమిండియా బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు.

ఇవి కూడా చదవండి

వెస్టిండీస్‌కు చెందిన సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా), జాసన్ రాయ్ (ఇంగ్లండ్), లక్కీ ఫెర్గూసన్ (న్యూజిలాండ్), మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్), రిలే రోసో (దక్షిణాఫ్రికా) స్టార్ ప్లేయర్‌లుగా జట్టులో ఉన్నారు.

మేజర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ జులై 14 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్‌లో లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ వర్సెస్ టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి.

లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ జట్టు: సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, ఆడమ్ జంపా, జాసన్ రాయ్, లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, రిలే రోసో, అలీ ఖాన్, అలీ షేక్, భాస్కర్ యాద్రమ్, కార్నె డ్రై, జస్కరన్ మల్హోత్రా, నితీష్ కుమార్, సైఫ్ షాడ్లీ.వాన్ షాల్క్‌విక్, ఉన్ముక్త్ చంద్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..