Mithali Raj: మిథాలీరాజ్‌కు దాసోహమంటోన్న రికార్డులు.. తాజాగా అరుదైన ఫీట్

టెస్ట్‌ టు వన్డే.. ఆ ఫార్మాట్‌.. ఈ ఫార్మాట్‌ అని కాదు.. ఆడిన ప్రతి ఫార్మాట్‌లోనూ పరుగుల వరదే.. రికార్డుల మోతే.. మన మిథాలీ ముందు పాత రికార్డులు పటాపంచలవుతున్నాయి.

Mithali Raj: మిథాలీరాజ్‌కు దాసోహమంటోన్న రికార్డులు.. తాజాగా అరుదైన ఫీట్
Mithali Raj
Follow us

|

Updated on: Sep 22, 2021 | 5:31 PM

టెస్ట్‌ టు వన్డే.. ఆ ఫార్మాట్‌.. ఈ ఫార్మాట్‌ అని కాదు.. ఆడిన ప్రతి ఫార్మాట్‌లోనూ పరుగుల వరదే.. రికార్డుల మోతే.. మన మిథాలీ ముందు పాత రికార్డులు పటాపంచలవుతున్నాయి. మన హైదరాబాదీ ఆట ముందు తేలిపోతున్నాయి.. భారత జాతీయ క్రీడ హాకీ.. పేరుకు హాకీ అయినప్పటికీ ఇక్కడి జనాలకు క్రికెట్‌ అంటేనే ప్రాణం.. క్రికెట్‌ను మతం కన్నా ఎక్కువగా ఆరాధిస్తారు. అభిమానిస్తారు. సరిగ్గా అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే జాతీయ మహిళా క్రికెట్‌ జట్టు రాణిస్తోంది. తాజాగా టీమిండియా కెప్టెన్‌ మిథాలీరాజ్‌ సాధించిన అరుదైన ఫీట్‌ అభిమానుల్ని ఖుషీ చేస్తోంది.

మహిళా క్రికెట్ సచిన్ టెండుల్కర్ అని పిలుచుకునే మిథాలీరాజ్ లేటు వయసులో కూడా రికార్డుల మోత మోగిస్తోంది. వన్డేల్లో వరుసగా ఐదో అర్ద సెంచరీతో పాటు.. కెరీర్‌లో 20 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఏకైక క్రికెటర్‌గా నిలిచింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌గా నిలిచారు మిథాలీరాజ్. మహిళా క్రికెట్‌లో ఎదురులేని మహారాణి మన మిథాలీ. 38 ఏళ్ల వయసులోనూ బ్యాటింగ్ విభాగంలో మొత్తం 762 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది మిథాలీ. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలవడం మిథాలీకిది రెండోసారి. 2010లో తొలిసారిగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. క్రికెటర్లకు సంబంధించి ప్రతి మంగళవారం ర్యాంకులను ప్రకటిస్తోంది ఐసీసీ. దక్షిణాఫ్రికా క్రికెటర్ లిజెల్ లీ 761 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచింది.

రాజస్థాన్‌లో జన్మించినప్పటికీ హైదరాబాద్‌లో స్థిరపడింది మిథాలీరాజ్ కుటుంబం. ఇప్పటివరకు మొత్తం 218 వన్డేల్లో 7367 పరుగులు చేసింది మిథాలీ. 1999 నుంచి భారత జట్టులో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తాను ఆడిన తన తొలి వన్డేలో ఐర్లాండ్‌పై 114 పరుగులు చేసి సత్తా చాటారు ఈ క్రికెటర్. 22 ఏళ్లకు పైగా ప్రపంచ వన్డే క్రికెట్‌లో కొనసాగుతున్న తొలి క్రికెటర్ మిథాలీ.

ఇక.. మరో బ్యాట్స్‌మెన్‌ స్మృతి మంధాన 701 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. బౌలింగ్ విభాగంలో 694 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచిన నిలిచారు జులన్ గోస్వామి. బౌలింగ్ విభాగంలో 617 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచారు మరో బౌలర్ పూనమ్ యాదవ్.  ఆల్ రౌండర్లలో 331 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది దీప్తి శర్మ.

Also  Read:  సన్​రైజర్స్​ ఆటగాడికి కరోనా పాజిటివ్.. సాయంత్రం ఢిల్లీతో మ్యాచ్​‌ గురించి తాజా అప్‌డేట్ ఇదే

 అమ్మ ఎగ్​ దోశ తినేందుకు డబ్బులివ్వలేదని.. ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

Latest Articles