IPL 2021 DC vs SRH Highlights: ఢిల్లీ సంచలన విజయం.. రాణించిన బ్యాట్స్‌మెన్.. ఎనిమిది వికెట్ల తేడాతో..
Delhi Capitals vs Sunrisers Hyderabad: ఐపీఎల్ 2021 రెండో దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్స్ సంచలన విజయం నమోదు చేశారు. ఇంకా 2.5 ఓవర్లు మిగిలిఉండగానే లక్ష్యాన్ని చేధించారు. సన్‌రైజర్స్‌ను తక్కువ స్కోరుకు..

DC vs SRH, IPL Match Highlights: ఐపీఎల్ 2021 రెండో దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్స్ సంచలన విజయం నమోదు చేశారు. ఇంకా 2.5 ఓవర్లు మిగిలిఉండగానే లక్ష్యాన్ని చేధించారు. సన్‌రైజర్స్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో ఢిల్లీ బౌలర్స్ సక్సెస్ అయితే ఆ స్కోరును సునాయాసంగా చేధించడంలో బ్యాట్స్‌మెన్ విజయవంతమయ్యారు. దీంతో ఎనిమిది వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 135 పరుగుల స్వల్ప టార్గెట్‌ను ఢిల్లీ ముందుంచింది. ఆట మొదట్లో హైదరాబాద్ జట్టు భారీ దెబ్బ తగిలింది. ఆరంభంలోనే మూడో బంతికే డేవిడ్ వార్నర్ పరుగులు తీయకుండానే పెవిలియన్ దారి పట్టాడు. ఎలాంటి పరుగుల చేయకుండానే నోర్జే వేసిన ఫస్ట్ ఓవర్‌లో మూడో బంతికే ఔటయ్యాడు. మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (18) కాస్త దూకుడుగా ఆడేందుకు ఆడేందుకు ప్రయత్నించాడు.. అయితే సాహా దూకుడుకు రబాడ బ్రేకులు వేశాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), మార్కస్ స్టొయినిస్, షిమ్రోన్ హెట్మేయర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, అన్రిచ్ నోర్జే, కగిసో రబాడ, అవేశ్ ఖాన్
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మనీశ్ పాండే, జేసన్ హోల్డర్, అబ్ధుల్ సమద్, కేదార్ జాదవ్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్
LIVE Cricket Score & Updates
-
ఢిల్లీ కెప్టెన్స్ సంచలన విజయం.. 8 వికెట్ల తేడాతో..
ఐపీఎల్ 2021 రెండో దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్స్ సంచలన విజయం నమోదు చేశారు. ఇంకా 2.5 ఓవర్లు మిగిలిఉండగానే లక్ష్యాన్ని చేధించారు. సన్‌రైజర్స్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో ఢిల్లీ బౌలర్స్ సక్సెస్ అయితే ఆ స్కోరును సునాయాసంగా చేధించడంలో బ్యాట్స్‌మెన్ విజయవంతమయ్యారు. దీంతో ఎనిమిది వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది.
-
విజయానికి మూడు పరుగులు..
ఢిల్లీ విజయానికి చేరువలో ఉంది. శ్రేయస్ అయ్యర్, పంత్ మంచి ఆటతీరుతో జట్టు విజయం దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ గెలవడానికి 16 బంతుల్లో 3 పరుగులు చేయాల్సి ఉంది.
-
-
17 ఓవర్లకు ఢిల్లీ స్కోర్ ఎంతంటే..
ఢిల్లీ బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడుతూ జట్టును విజయ తీరాలకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. రిస్క్ షాట్స్‌కు ప్రయత్నించకుండా ఆచితూచి ఆడుతున్నారు. ఈ క్రమంలో క్రీజులో ఉన్న శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ జట్టు స్కోరును క్రమంలో ముందుకు తీసుకెళుతున్నారు. ఇక 17 ఓవర్లు ముగిసే సమయానికి ఢిల్లీ రెండు వికెట్ల నష్టానికి పరుగులు 126 సాధించింది. ప్రస్తుతం క్రీజులో పంత్ (30 ), శ్రేయస్ అయ్యర్ (40) పరుగులతో ఉన్నారు.
-
వంద మార్కును దాటిని ఢిల్లీ జట్టు..
ఢిల్లీ జట్టు విజయం దిశగా అడుగులు వేస్తోంది. శ్రేయస్ అయ్యర్, పంత్ ఆచిచూతి ఆడుతుండడంతో జట్టు స్కోరు పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ స్కోరు వంద దాటేసింది. 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి జట్టు స్కోరు వంద దాటింది. ఇక 15.3వ బంతికి భువనేశ్వర్ విసిరిన బంతిని పంత్ బౌండరీని దాటించాడు. ప్రస్తుతం ఢిల్లీ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 107 పరుగుల వద్ద ఉంది.
-
13 ఓవర్లకు ఢిల్లీ స్కోర్ ఎంతంటే..
సన్ రైజర్స్ ఇచ్చిన 135 పరుగుల లక్ష్యంతో దిగిన ఢిల్లీ విజయం దిశగా పయనిస్తోంది. శిఖర్ ధావన్ అవుట్ కావడం జట్టు స్కోరుపై ప్రభావం పడుతుందని భావించినా శ్రేయస్ అయ్యర్ ఆ లోటును తీర్చే పనిలో పడ్డాడు. దీంతో జట్టు స్కోరు పెరుగుతోంది. ఇక ఢిల్లీ 13 ఓవర్లు ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 96 పరుగులు సాధించింది. ప్రస్తుతం అయ్యర్ (36), పంత్ (07) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఢిల్లీ గెలుపొందాలంటే 36 బంతుల్లో 39 పరుగులు చేయాల్సి ఉంది.
-
-
ఫైర్ మీదున్న అయ్యర్..
శిఖర్ లేని లోటును తీర్చే పనిలో పడ్డాడు శ్రేయస్ అయ్యర్ చాన్స్ దొరికినప్పుడల్లా భారీ షాట్స్ కొడుతూ జట్టును విజయానికి చేరువ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే 13.3, 13.4 రెండు బంతుల్లో రెండు ఫోర్లను బాదాడు. దీంతో అయ్యర్ 32 బంతుల్లో 36 పరుగులు సాధించాడు.
-
బౌండరీతో ఆరంభం..
శిఖర్ ధావన్ వెనుదిరిగి తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ బౌండరీతోనే తన పరుగుల ఖాతాను ప్రారంభించాడు. మూడో బంతికే స్ట్రయిట్ డ్రైవ్‌లో భారీ షాట్‌తో నాలుగు పరుగులు సాధించాడు. ప్రస్తుతం 12 ఓవర్ల సమయానికి ఢిల్లీ రెండు వికెట్లు నష్టపోయి 80 పరుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం అయ్యర్ (22), పంత్ (05) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఢిల్లీ గెలుపునకు 48 బంతుల్లో 55 పరుగుల చేయాల్సి ఉంది.
-
జస్ట్ మిస్.. హాఫ్ సెంచరీ చేయకుండానే వెనుదిరిగిన శిఖర్.
దూకుడుగా ఆడుతూ జట్టు స్కోరును పెంచుతూ పోతున్న శిఖర్ ధావన్ 42 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 10వ ఓవర్ 5 బంతికి రషీద్ ఖాన్ విసిరిన బంతికి భారీ షాట్ ఆడడానికి ప్రయత్నించిన శిఖర్ బౌండరీ లైన్ వద్ద అబ్ధుల్ సమద్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.
Match 33. 9.5: S Sharma to S Dhawan, 4 runs, 69/1 https://t.co/o12E14UyvO #DCvSRH #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) September 22, 2021
-
దుమ్ము రేపుతోన్న శిఖర్ ధావన్.. వరుసగా రెండు ఫోర్లు..
శిఖర్ ధావన్ దాటిగా ఆడుతున్నాడు. సన్‌రైజర్స్ బౌలర్స్‌ను ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే పదో ఓవర్‌లో 4,5 బంతుల్లో రెండు వరుస ఫోర్లను సాధించాడు. దీంతో శిఖర్ వ్యక్తిగత స్కోర్ 41 పరుగులకు చేరింది. జట్టు స్కోరు ప్రస్తుతం ఒక వికెట్ కోల్పోయి 70 పరుగుల వద్ద ఉంది.
-
శ్రేయస్ సూపర్ సిక్స్..
శ్రేయస్ కూడా దూకుడు పెంచుతున్నాడు. ఈ క్రమంలోనే ఆరో ఓవర్‌లో రషీద్ ఖాన్ విసిరిన బంతిని తనదైన శైలిలో బౌండరీ దాటించేశాడు. ప్రస్తుతం జట్టుస్కోరు 60/1 గా ఉంది. ఢిల్లీ గెలుపునకు ఇంకా 74 పరుగులు అవసరం ఉన్నాయి.
Match 33. 8.4: R Khan to S Iyer, 6 runs, 59/1 https://t.co/o12E14UyvO #DCvSRH #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) September 22, 2021
-
50 మార్కు దాటేసిన ఢిల్లీ..
135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ మొదట్లోనే తొలి వికెట్‌ను కోల్పోయింది. అయితే తర్వాత క్రీజులో ఉన్న శిఖర్ దావన్, శ్రేయస్ అయ్యర్ జట్టు స్కోరును పెంచే పనిలో పడ్డారు. ఆచితూచి ఆడుతూ జట్టు స్కోరును పెంచుతున్నారు. ఈ క్రమంలోనే ఆరు ఓవర్లకు ఢిల్లీ 50 పరుగుల మార్కును దాటేసింది. ఆరు ఓవర్లు ముగిసే సమయానికి జట్టు స్కోరు 51/1గా ఉంది. శ్రేయస్ అయ్యర్ (08), శిఖర్ ధావన్ (32) క్రీజులో ఉన్నారు. ఢిల్లీ గెలుపొందాలంటే 72 బంతుల్లో 84 పరుగులు చేయాల్సి ఉంది.
Shikhar D on the charge! ? ?
5⃣0⃣ up for @DelhiCapitals in the chase! ? ? #VIVOIPL #DCvSRH
Follow the match ? https://t.co/15qsacH4y4 pic.twitter.com/wfSRNxGRzN
— IndianPremierLeague (@IPL) September 22, 2021
-
స్మాల్ టార్గెట్‌ను త్వరగా..
స్మాల్ టార్గెట్‌ను త్వరగా పూర్తి చేయాలనే తొందర్లో ఉంది ఢిల్లీ క్యాపిటల్స్. తొలి ఓవర్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు పృథ్వీ షా (3), శిఖర్ ధావన్ (1) క్రీజులో ఉన్నారు. ఖలీల్ అహ్మద్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి.
-
రషీద్ ఖాన్ ఔట్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ రనౌట్ అయ్యాడు. అవేశ్ ఖాన్ వేసిన 19.4 బంతికి పరుగు తీయడానికి ప్రయత్నించి ఔటయ్యాడు. 19.6 బంతికి సందీప్ శర్మ కూడా ఇదే విధంగా ఔటయ్యాడు.
-
భువనేశ్వర్ కుమార్ బౌండరీ
భువనేశ్వర్ కుమార్ దూకుడుగా ఆటను మొదలు పెట్టాడు. బ్యాట్‌కు పని చెప్పాడు.. బౌండరీతో తీశాడు.
-
హైదరాబాద్ 7వ వికెట్ పడింది
సన్‌రైజర్స్ హైదరాబాద్ 7వ వికెట్ కోల్పోయింది. అబ్దుల్ సమద్ ఔట్ అయ్యాడు. రబాడ వేసిన 18.1 బంతిని బౌండరీకి తరలించిన అతడు.. తర్వాతి బంంతికి కీపర్‌కి చిక్కాడు. భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించినా అది సరిగ్గా బ్యాట్‌కు తగలకపోవడంతో క్యాచ్ ఔటయ్ాయడు. 19 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ 121/7 స్కోరుతో నిలిచింది. ఈ ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్ సహా 14 పరుగులు వచ్చాయి.
-
రషీద్ ఖాన్ సిక్సర్..
మరో నాలుగు ఓవర్లుండగా టేలెండర్లు దూకుడుగా ఆడుతున్నారు. 16 ఓవర్లు పూర్తయ్యే సరికి సన్ రైజర్స్ హైదరాబాద్ 97/6 స్కోరుతో ముందుకు వెళ్తోంది. అబ్దుల్ సమద్ (16), రషీద్ ఖాన్ (6) క్రీజులో ఉన్నారు. అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్లో ఓ ఫోర్ సహా ఏడు పరుగులు వచ్చాయి.
-
హోల్డర్ క్యాచ్ ఔట్..
టీ బ్రేక్‌కు మందు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరో వికెట్ కోల్పోయింది. జేసన్ హోల్డర్ (10) క్యాచ్ ఔట్ అయ్యాడు.
-
కేదార్ జాదవ్ వికెట్ పడింది..
అసలే కష్టాల్లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో దెబ్బ పడింది. టాప్ ఆర్డర్ ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ దారి పట్టారు. అదే దారిలో ఇప్పుడు కేదార్ జాదవ్ కూడా వెళ్లిపోయాడు. అన్రిచ్ నోర్జే వేసిన 12.6 బంతికి కేదార్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 13 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ 74/5 స్కోరుతో నిలిచింది. ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి.
-
మనీశ్ పాండే కూడా ఔట్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. నాలుగో వికెట్‌ను జారవిడుచుకుంది. టాప్ ఆర్డర్‌లోని మనీశ్ పాండే (17) కూడా ఔట్ అయ్యాడు.
-
కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఔట్..
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో కీలక వికెట్ కోల్పోయింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఔటయ్యాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (18) క్యాచ్ ఔట్ అయ్యాడు. అక్షర్ పటేల్ వేసిన 9ఓవర్‌లో5వ బంతికి కేన్ హెట్మేయర్ చేతికి దొరికిపోయాడు. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి హైదరాబాద్ 61/3 స్కోరుతో నిలిచింది.
-
వృద్ధిమాన్ సాహా ఔట్..
దూకుడుగా ఆటను మొదలు పెట్టిన వృద్ధిమాన్ సాహా నిరాశపరిచాడు. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (18) ఔట్ అయ్యాడు. కగిసో రబాడ వేసిన 4.1 బంతిని సిక్స్‌గా మలిచిన అతడు.. చివరి బంతికి ధావన్ చేతికి చిక్కాడు. ఈ ఓవర్ ముగిసే సరికి హైదరాబాద్ 29/2 స్కోరుతో నిలిచింది.
-
వృద్ధిమాన్ సాహా దూకుడు
వృద్ధిమాన్ సాహా దూకుడు మీదున్నాడు. బౌండరీతో ఆటను మొదలు పెట్టిన సామా.. సిక్సర్‌తో విరవిహారం చేశాడు. ఇన్నింగ్స్‌లో తొలి సిక్సర్ బాదేశాడు. సాహా, విలియమ్సన్ క్రీజులో ఉన్నారు.
-
వృద్ధిమాన్ సాహా తొలి బౌండరీ
ఇన్నింగ్స్‌ను బౌండరీతో మొదలు పెట్టాడు వృద్ధిమాన్ సాహా. విజయంపై హైదరాబాద్ అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాడు.
-
వార్నర్ ఔట్..
ఆరంభంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్‌లో మూడో బంతికే డేవిడ్ వార్నర్ వికెట్ కోల్పోయింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (0) క్యాచ్ ఔట్ అయ్యాడు. అన్రిచ్ నోర్జే రెండో బంతికి అతడు అక్షర్ చేతికి చిక్కాడు. వృద్ధిమాన్ సాహా (0), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (6) క్రీజులో ఉన్నారు. తొలి ఓవర్ ముగిసే సరికి హైదరాబాద్ 6/1 స్కోరుతో నిలిచింది.
-
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు..
డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మనీశ్ పాండే, జేసన్ హోల్డర్, అబ్ధుల్ సమద్, కేదార్ జాదవ్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్
-
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు..
పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), మార్కస్ స్టొయినిస్, షిమ్రోన్ హెట్మేయర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, అన్రిచ్ నోర్జే, కగిసో రబాడ, అవేశ్ ఖాన్
-
బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్..
టాస్ గెలిచిన సన్ రైజర్స్.. బ్యాటింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ప్లే ఆఫ్స్ చేరుకోవాలంటే ప్రతి మ్యాచులో గెలవాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు హైదరాబాద్ ఆడిన ఏడు మ్యాచుల్లో కేవలం ఒక మ్యాచులో గెలిచి.. ఆరింట్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే.
Published On - Sep 22,2021 6:59 PM




