IPL Media Rights: ఐపీఎల్.. ప్రపంచంలోనే అతిపెద్ద క్యాష్ రిచ్ లీగ్‌గా పేరొందిన ఈ మెగా క్రికెట్ టోర్నీ డిజిటల్ మీడియా హక్కులను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన( Reliance Industries) వయాకామ్18 నెట్‌వర్క్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. వచ్చే ఐదేళ్ల పాటు (2023 నుండి 2027 వరకు) ఈ ఒప్పందం కొనసాగనుంది. ఈ సందర్భంగా మాట్లాడిన రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ నీతా అంబానీ (Nita Ambani) ఐపీఎల్ కవరేజిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘క్రీడలు మమ్మల్ని అలరిస్తాయి. స్ఫూర్తిని నింపుతాయి. మనందరినీ ఏకం చేస్తాయి. భారతదేశ క్రీడల్లో క్రికెట్, ముఖ్యంగా IPL ప్రజల్లో విశేషాదరణ పొందాయి. అందుకే ఈ సూపర్ లీగ్‌తో అనుబంధాన్ని పెంచుకుంటున్నందుకు మాకు గర్వంది. మనదేశం లేదా ప్రపంచంలో ఎక్కడున్నా సరే.. క్రికెట్ ప్రేమికులకు ఐపీఎల్ అనుభవాన్ని ఇవ్వడమే మా ఏకైక లక్ష్యం. ప్రస్తుతం డిజిటల్ విప్లవం కొనసాగుతున్న మన దేశంలో ప్రతి గడపకూ ఐపీఎల్ టోర్నమెంట్ చేరుతుంది’ అని నీతా అంబానీ తెలిపారు.
క్రికెట్ బ్రాడ్ కాస్టింగ్‌లో..
కాగా ఐపీఎల్ మీడియా హక్కుల ప్యాకేజీ బి (డిజిటల్ మీడియా రైట్స్) కోసం వయాకామ్ 18 విజయవంతంగా రూ. 20,500 కోట్లకు బిడ్ చేసింది. ఒక్కో మ్యాచ్‌కు రూ.50 కోట్ల చొప్పున మొత్తం 410 మ్యాచ్‌లకు చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే 5 సంవత్సరాల పాటు ఈ ఒప్పందం కొనసాగుతుంది. కాగా IPL డిజిటల్ మీడియా హక్కులను కొనుగోలు చేయడంతో.. వయాకామ్18 ఇప్పుడు క్రికెట్ బ్రాడ్ కాస్టింగ్‌లోకి కూడా ప్రవేశించింది. అన్నట్లు ఈ ప్రఖ్యాత నెట్‌వర్క్ రూ. 3,273 కోట్ల బిడ్‌తో ‘ప్యాకేజీ సి’ని కూడా కొనుగోలు చేసింది. ఐపీఎల్ మ్యాచ్‌లతో పాటు ఫిఫా వరల్డ్ కప్ ఖతార్- 2022, NBAలతో పాటు ATP, BWP వంటి ప్రఖ్యాత స్పోర్ట్స్ ఈవెంట్‌లను కూడా ఇక్కడ వీక్షించవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..