MI vs SRH IPL 2021: జోరు మీదున్న ముంబై.. ఈ మ్యాచులోనైనా హైదరాబాద్ ఖాతా తెరిచేనా?

ఐపీఎల్ అంటేనే క్రికెట్ అభిమానులకు పండుగలా ఉంటుంది. అలాంటిది సంవత్సరం తిరగక ముందే రెండు సార్లు...

  • Anil kumar poka
  • Publish Date - 4:59 pm, Sat, 17 April 21
MI vs SRH IPL 2021: జోరు మీదున్న ముంబై.. ఈ మ్యాచులోనైనా హైదరాబాద్ ఖాతా తెరిచేనా?
Mi Vs Srh

ఐపీఎల్ అంటేనే క్రికెట్ అభిమానులకు పండుగలా ఉంటుంది. అలాంటిది సంవత్సరం తిరగక ముందే రెండు సార్లు ఐపీల్ జరుగుతుండడంతో అభిమానుల ఆనందాలకు హద్దులు లేకుండా పోయాయి. ఈ మెగా టోర్నమెంట్‌లో ఇప్పటికే ఎనిమిది మ్యాచులు పూర్తవగా నేడు మ్యాచ్ ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య తొమ్మిదవ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు రెండేసి మ్యాచులు ఆడగా, వాటిలో ముంబై ఒక మ్యాచ్‌లో విజయం సాధిస్తే హైదరాబాద్ జట్టు ఇంకా తన గెలుపు ఖాతా తెరవలేదు. గత మ్యాచులో గెలిచిన ఉత్సాహంతో ఈ మ్యాచులో కూడా గెలవాలని కూతూహల పడుతున్న ముంబైని ఎలాగైనా కట్టడి చేయాలని హైదరాబాద్ భావిస్తుంది. ఈ మ్యాచులో గెలిచి పాయింట్ల పట్టికలో ఖాతా తెరవాలని హైదరాబాద్ జట్టు చూస్తుంది.

అయితే, ఈ మ్యాచులో ఏ జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మాట్లాడుకుంటే ముంబై పేరే వినిపిస్తుంది. ముంబై ప్రతీ విభాగంలో మెరుగ్గా ఉంది. బ్యాటింగ్ విభాగంలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్‌లో ఉండగా మిగతా బ్యాట్స్‌మెన్లు కూడా మంచి ప్రదర్శన చేస్తున్నారు. అటు బౌలింగ్ విభాగంలో కూడా బుమ్రా, బోల్ట్, చాహర్ కూడా అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. అటు హైదరాబాద్ జట్టులో కేవలం వార్నర్, మనీష్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్లు ఆకట్టుకోలేకపోతున్నారు. బౌలింగ్ విభాగం నుంచి మంచి సపోర్ట్ అందుతున్నప్పటికీ బ్యాటింగ్ విభాగం బలంగా లేకపోవడంతో హైదరాబాద్ జట్టు బలహీనంగా కనిపిస్తుంది.

టీం అంచనా:

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(C), క్వింటన్ డికాక్(WK), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, కిరణ్ పోలార్డ్, కృనాల్ పాండ్య, మ్యార్కో జాన్సెన్, రాహుల్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్.

సన్ రైజర్స్ హైదరాబాద్: వృద్ధిమాన్ సాహా(WK), డేవిడ్ వార్నర్(C), మనీష్ పాండే, కేన్ విల్లియంసన్, జానీ బెయిర్ స్టో, అబ్దుల్ షామద్, విజయ్ శంకర్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్.

Read more: Sara Tendulkar: ‘తండ్రి డబ్బును వేస్ట్ చేస్తున్నావ్’ అన్న నెటిజన్‌కు.. సారా టెండూల్కర్ సాలిడ్ కౌంటర్

పాకిస్తాన్ క్రికెటర్లకు గూడ్ న్యూస్ చెప్పిన భారత ప్రభుత్వం.. అభిమానులకు పండగే పండుగ..