Rohit Sharma In IPL Records: పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ 27 బంతుల్లో 44 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. దీంతో పాటు కెమెరూన్ గ్రీన్‌తో కలిసి రోహిత్ శర్మ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వాస్తవానికి, ముంబై ఇండియన్స్‌కు ముందుగానే తొలి దెబ్బ తగిలింది. రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్ కు వచ్చిన ఇషాన్ కిషన్ త్వరగా పెవిలియన్ బాట పట్టినా.. ఆ తర్వాత రోహిత్ శర్మ, కెమరూన్ గ్రీన్ జట్టును కష్టాల్లోంచి గట్టెక్కించారు. కానీ, చివరి ఓవర్లో తడబడి ఓటమిపాలైంది.
రోహిత్ శర్మ చాలా ప్రత్యేకమైన జాబితాలో తన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఐపీఎల్‌లో రోహిత్ శర్మ 250 సిక్సర్లు పూర్తి చేశాడు. ఐపీఎల్ చరిత్రలో 250 సిక్సర్లు బాదిన మూడో ఆటగాడు రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ శర్మ కంటే ముందు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ మాత్రమే ఈ ఘనత సాధించారు. ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ 357 సిక్సర్లు కొట్టాడు. కాగా ఏబీ డివిలియర్స్ తన ఐపీఎల్ కెరీర్‌లో 251 సిక్సర్లు కొట్టాడు. ఇది కాకుండా మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, కీరన్ పొలార్డ్, డేవిడ్ వార్నర్ వంటి ఆటగాళ్లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..