MI vs PBKS highlights : రాణించిన మయాంక్, ధావన్.. 12 పరుగుల తేడాతో పంజాబ్ విజయం
Mumbai Indians vs Punjab Kings: ఐపీఎల్ 2022లో భాగంగా పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్ 2022లో భాగంగా పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. మయాంక్, ధావన్ శుభారంభం అందించారు. నిలకడగా ఆడుతూనే ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగారు. ముఖ్యంగా మయాంక్ తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించాడు. కేవలం 32 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్స్‌ల సహాయంతో 52 పరుగులు చేశాడు. ధావన్ ( 50 బంతుల్లో 70) కూడా ధాటిగా ఆడాడు. 199 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది.
Key Events
ముంబై ఇండియన్స్ జట్టు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది.
పంజాబ్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. మూడో విజయం కోసం ఎదురుచూస్తోంది.
LIVE Cricket Score & Updates
-
పంజాబ్ గెలుపు
ఐపీఎల్ 2022లో భాగంగా పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. 199 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది.
-
8వ వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్
ముంబై ఇండియన్స్ 8వ వికెట్ కోల్పోయింది. బుమ్రా ఔటయ్యాడు.
-
-
ఏడో వికెట్ కోల్పోయిన ముంబై
ముంబై ఇండియన్స్ ఏడో వికెట్ కోల్పోయింది.
-
ఆరో వికెట్ కోల్పోయిన ముంబై
ముంబై ఇండియన్స్ ఆరో వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన సూర్యాకుమార్ యాదవ్ రబడ బౌలింగ్ భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు.
-
ఐదో వికెట్ కోల్పోయిన ముంబై
ముంబై ఇండియన్స్ ఐదో వికెట్ కోల్పోయింది. పోలార్డ్ రనౌటయ్యాడు.
-
-
నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై
ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 36 పరుగులు చేసిన తిలక్ వర్మ రనౌట్ అయ్యాడు.
-
మూడో వికెట్ కోల్పోయిన ముంబై
ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 25 బంతుల్లో 49(4 ఫోర్లు, 5 సిక్స్‌లు ) పరుగులు చేసిన బ్రేవిస్‌ను ఓడియన్ స్మిత్ పెవిలియన్ చేర్చాడు.
-
ముంబై రెండో వికెట్ డౌన్.. పెవిలియన్ చేరిన ఇషాన్ కిషన్..
రోహిత్ సేన రెండో వికెట్ కోల్పోయింది. వైభవ్ అరోరా బౌలింగ్‌లో భారీషాట్ కు యత్నించి ఇషాన్ కిషన్ (3) నిష్ర్కమించాడు. ప్రస్తుతం ముంబై స్కోరు 4.2 ఓవర్లు ముగిసే సరికి 31/2.
-
మొదటి వికెట్ కోల్పోయిన ముంబై.. రోహిత్‌ను బోల్తా కొట్టించిన రబాడా..
ముంబై ఇండియన్స్ మొదటి వికెట్ కోల్పోయింది. క్రీజులో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించిన హిట్‌మ్యాన్ రోహిత్ (28) రబాడా బౌలింగ్‌లో వైభవ్ అరోరాకు చిక్కాడు. దీంతో డెవాల్డ్ బ్రేవిస్ క్రీజులోకి వచ్చాడు.
-
ధాటిగా ఆడుతోన్న రోహిత్.. ముంబై స్కోరెంతంటే..
199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై బ్యాటర్లు ధాటిగా ఆడుతున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ (13 బంతుల్లో 23) వేగంగా ఆడుతుండగా ఇషాన్ కిషన్ (3) నిలకడగా ఆడుతున్నాడు. 3.1 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోరు 25/0
-
చివర్లో జితేశ్ మెరుపులు.. పంజాబ్ భారీ స్కోరు..
పంజాబ్ ఇన్నింగ్స్ ఆఖర్లో జితేశ్ (15 బంతుల్లో 30) మెరుపులు మెరిపించాడు. దీంతో 20 ఓవర్లలో 198 పరుగులు చేసింది మయాంక్ సేన.
-
ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్..
మయాంక్ సేన ఐదో వికెట్ కోల్పోయింది. బాసిల్ థంపి బౌలింగ్‌లో షారుక్ (15) బౌల్డయ్యాడు.
-
పంజాబ్ నాలుగో వికెట్‌డౌన్..
పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. బాసిల్ థంపి బౌలింగ్‌లో శిఖర్ ధావన్ (70) నిష్ర్కమించాడు. ప్రస్తుతం పంజాబ్ స్కోరు 17.2 ఓవర్లకు 161/4. జితేశ్ శర్మ (13), షారుక్ ఖాన్ (0) క్రీజులో ఉన్నారు.
-
బుమ్రా యార్కర్‌కు లివింగ్ స్టోన్ బలి..
ముంబై బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతమైన యార్కర్ పంజాబ్ డ్యాషింగ్ బ్యాటర్ లివింగ్ స్టోన్ (2) క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో 130 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. క్రీజులో ధావన్ (52), జితేశ్ (0) ఉన్నారు. ప్రస్తుతం పంజాబ్ స్కోరు 14.4 ఓవర్లకు 131/3.
-
రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్.. బెయిర్ స్టో ఔట్..
పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న జాని బెయిర్ స్టో (12) జైదేవ్ ఉనాద్కత్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరుకున్నాడు. శిఖర్ ధావన్ (51) ధాటిగా ఆడుతున్నాడు. లివింగ్ స్టోన్ క్రీజులోకి వచ్చాడు.
-
అదరగొట్టిన ధావన్.. అర్ధ సెంచరీ పూర్తి..
శిఖర్ ధావన్ 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి తోడుగా జాని బెయిర్ స్టో (12) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం పంజాబ్ స్కోరు 13.4 ఓవర్లు ముగిసే సరికి 127/1.
-
మొదటి వికెట్ కోల్పోయిన పంజాబ్
పంజాబ్ కింగ్స్ మొదటి వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్‌ను మురగన్ అశ్విన్ ఔట్ చేశాడు.
-
హాఫ్ సెంచరీ చేసిన మయాంక్ అగర్వాల్
పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీ చేశాడు. 31 బంతుల్లో 52(6 ఫోర్లు, 2 సిక్స్‌లు)పరుగులు చేశాడు.
-
50 పరుగులు దాటిన పంజాబ్ స్కోరు..
పంజాబ్ ధాటిగా బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ ( 18 బంతుల్లో 33), శిఖర్ ధావన్ (13) వేగంగా ఆడుతున్నారు. ప్రస్తుతం పంజాబ్ స్కోరు 5 ఓవర్లు ముగిసే సరికి 53/0.
-
ధాటిగా ఆడుతోన్న పంజాబ్ బ్యాటర్లు..
పంజాబ్ బ్యాటర్లు ధాటిగా ఆడుతున్నారు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (14) 3 ఫోర్లు కొట్టగా, శిఖర్ ధావన్ (10) సిక్సర్ కొట్టాడు. ప్రస్తుతం పంజాబ్ స్కోరు 3.3 ఓవర్లు ముగిసే సరికి 33/0.
-
బరిలోకి దిగన శిఖర్, మయాంక్..
పంజాబ్ జట్టు బ్యాటింగ్ ప్రారంభమైంది. ఓపెనర్ శిఖర్ ధావన్, కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్ ను ప్రారంభించనున్నారు. కాగా ముంబై జట్టులో బాసిల్ ధంపి మొదటి ఓవర్ వేయనున్నాడు.
-
ఒక మార్పుతో బరిలోకి ముంబై..
ముంబై తుది జట్టులో ఒక మార్పు జరిగింది. రమణ్‌దీప్ సింగ్ స్థానంలో టైమల్ మిల్స్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు పంజాబ్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే బరిలోకి దింపింది.
-
టాస్ గెలిచిన ముంబై..
పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పంజాబ్ మొదట బ్యాటింగ్‌కు దిగనుంది.
Published On - Apr 13,2022 6:55 PM