ICC T20 Rankings: టీ20 ర్యాకింగ్స్‌ విడుదల చేసిన ఐసీసీ.. టాప్‌-10 బ్యాట్స్‌మెన్లలో కేఎల్ రాహుల్‌కు చోటు..

ఐసీసీ(ICC) బుధవారం టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌ టాప్-10లో భారత్ నుంచి కేఎల్ రాహుల్(KL Rahul) మాత్రమే ఉన్నాడు...

ICC T20 Rankings: టీ20 ర్యాకింగ్స్‌ విడుదల చేసిన ఐసీసీ.. టాప్‌-10 బ్యాట్స్‌మెన్లలో కేఎల్ రాహుల్‌కు చోటు..
Kl Rahul
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Apr 13, 2022 | 5:35 PM

ఐసీసీ(ICC) బుధవారం టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌ టాప్-10లో భారత్ నుంచి కేఎల్ రాహుల్(KL Rahul) మాత్రమే ఉన్నాడు. ఈ ఫార్మాట్‌లో బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-10లో భారతీయులకు చోటు లభించలేదు. ఆల్ రౌండర్ల ర్యాంకింగ్ లోనూ టాప్‌-10 భారత ఆటగాళ్లు ఎవరూ చోటు సంపాదించలేదు. టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ(Rohith Sharma) 8వ స్థానంలో, విరాట్ కోహ్లీ 10వ స్థానంలో ఉన్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ యువ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది టాప్-10లో చోటు దక్కించుకున్నాడు . తాజాగా ఆస్ట్రేలియాతో ఆడిన ఏకైక టీ20 మ్యాచ్ తర్వాత నాలుగు స్థానాలు ఎగబాకి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. అఫ్రిది మూడు ఫార్మాట్లలో టాప్-10లో ఉన్నాడు. టెస్టుల్లో నాలుగో, వన్డేల్లో ఏడో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు జోష్ హేజిల్‌వుడ్ మూడో స్థానంలో నిలిచాడు. ఆదిల్ రషీద్ రెండో స్థానంలో నిలిచాడు. మార్చిలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, మహ్మద్ రిజ్వాన్ ఒక స్థానం దిగజారి మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. అదే సమయంలో సౌతాఫ్రిక ఐడెన్ మార్క్రామ్ రెండవ స్థానంలో ఉన్నాడు.

ఇటీవలే దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్ ముగియగా, ఈ సిరీస్ తర్వాత టెస్టు ర్యాంకింగ్స్‌లో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ సిరీస్‌ను బ్యాట్‌తోనూ, బంతితోనూ షేక్ చేసిన కేశవ్ మహరాజ్‌కు భారీ ప్రయోజనం దక్కింది. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 21వ స్థానానికి చేరుకున్నాడు. అదే సమయంలో ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అడ్వాంటేజ్‌కి వెళ్లి 13వ స్థానానికి చేరుకున్నాడు. రెండు టెస్టు మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. అతడితో పాటు సిరీస్‌ని ఊపేసిన సహచర స్పిన్నర్ సైమన్ హార్మర్ కూడా లాభపడ్డాడు. 26 స్థానాలు ఎగబాకి 54వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

Read Also.. MS Dhoni Retirement: ఆ షాకింగ్ న్యూస్ రాగానే రైనా ఏడ్చేశాడు.. మా పరిస్థితి దారుణం: అక్షర్ పటేల్