Steffan Nero: గతంలో వన్డేల్లో డబుల్ సెంచరీ అంటేనే గగనం. అయితే క్రికెట్‌లో ఏదీ అసాధ్యం కాదంటూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ద్విశతకం బాదేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్రపుటలకెక్కాడు. ఆ తర్వాత పలువురు క్రికెటర్లు 200 పరుగుల మైలురాయిని అందుకున్నారు. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అయితే ఏకంగా మూడుసార్లు ఈ రేర్ ఫీట్‌ను అందుకున్నాడు. వన్డేల్లో అతని అత్యధిక స్కోరు 264 పరుగులు కావడం విశేషం. అయితే, ఇప్పుడు ఓ క్రికెటర్ ఏకంగా ట్రిపుల్ సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. అది కూడా ఓ అంధ క్రికెటర్. న్యూజిలాండ్‌తో జరుగుతున్న అంధుల వన్డే క్రికెట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టెఫన్ నీరో (Steffan Nero) త్రిబుల్ సెంచరీ బాదేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే కామన్‌వెల్త్ బ్యాంక్ అంధుల సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. స్టెఫన్ నీరో ట్రిపుల్ సెంచరీ పుణ్యమా అని 40 ఓవర్లలో ఏకంగా 542 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టెఫన్ 140 బంతుల్లో 309 రన్స్‌తో అజేయంగా నిలిచాడు. దాదాపు 224.5 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 49 ఫోర్లు, ఒక సిక్సర్ ఉండడం విశేషం.
24 ఏళ్ల రికార్డు బద్దలు..
ఇక 543 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. 272 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా.. 270 పరుగుల భారీ తేడాతో కంగారులు ఘన విజయం సాధించారు. కాగా ఇంతకుముందు అంధుల క్రికెట్ చరిత్రలో పాక్ బ్యాటర్ మసూద్ జాన్ 262 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతను 1998లో ఆ రికార్డ్ ను అందుకున్నాడు. ఇప్పుడు సుమారు 24 ఏళ్ల తర్వాత స్టెఫన్ నీరో ఏకంగా ట్రిపుల్ సెంచరీతోఆ రికార్డ్ బద్దలు కొట్టాడు. ఈ క్రమంలోనే ఆసీస్ తరఫున ఈ ఘనత సాధించిన ఎనిమిదో క్రికెటర్‌గా నీరో నిలిచాడు. గతంలో మాథ్యూ హేడెన్, మైకేల్ క్లార్క్, డేవిడ్ వార్నర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు వివిధ ఫార్మాట్లలో ట్రిపుల్ సెంచరీలు చేశారు.
A TRIPLE century! Steffan Nero finishes 309* (140) in the Australian Blind Cricket Team’s first ODI against New Zealand ??
That’s his third consecutive century at the #ICIS22 after scores of 113 (46) and 101* (47) earlier this week ? https://t.co/MDTiUnAC1S | #ASportForAll pic.twitter.com/cqv9vBEPW3
— Cricket Australia (@CricketAus) June 14, 2022