టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముంబైకు చెందిన ప్రముఖ యువ క్రికెటర్ ముషీర్ ఖాన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతను శనివారం (సెప్టెంబర్ 28) తన తండ్రి నౌషన్ ఖాన్‌తో కలిసి తన కారలో అజంగఢ్ నుండి లక్నోకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో ముషీర్ ఖాన్‌కు దెబ్బలు బాగా తగిలాయి. దీంతో వెంటనే అతనిని లక్నోలోని మేదాంత ఆస్పత్రిలో చేర్పించారు. ముషీర్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి గురించి తాజాగా మేదాంత హాస్పిటల్ హెల్స్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ యంగ్ క్రికెటర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి, వచ్చే నెలలో జరగనున్న ఇరానీ కప్ మ్యాచ్ కోసం లక్నోకు వెళుతుండగా ముషీర్ ఖాన్ ప్రమాదానికి గురయ్యాడు. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టుకు ఆడుతున్న ముషీర్ ఖాన్ రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుతో ఆడాల్సి ఉంది. ఇప్పటికే ప్రమాదానికి గురైన ముషీర్ ఈ మ్యాచ్ నుంచి తప్పుకోవడమే కాకుండా నెలల తరబడి క్రికెట్ కు దూరం కానున్నాడని సమాచారం. లక్నోలోని మేదాంత హాస్పిటల్ ముషీర్ ఖాన్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది, అందులో ‘క్రికెటర్ ముషీర్ ఖాన్‌ను పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేలో రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆర్థోపెడిక్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ ధర్మేంద్ర సింగ్ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది’ అని హెల్త బులెటిన్ లో తెలిపారు వైద్యులు.
ఇక ముంబై క్రికెట్ అసోసియేషన్ అంటే MCA ముషీర్ ఖాన్ చికిత్స గురించి ఒక ప్రకటన విడుదల చేసింది, BCCI, MCA వైద్య బృందాలు ముషీర్ ఖాన్ ఆరోగ్యం గురించి అన్ని విషయాలు తెలుసుకుంటున్నాయి. అతనికి అన్ని విధాలా సహాయం అందించడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. కోలుకున్న తర్వాత తదుపరి చికిత్స కోసం ముంబైకి తీసుకొస్తాం’ అని ఎంసీఏ తెలిపింది.
ముషీర్ ఖాన్ హెల్త్ బులెటిన్..
मुशीर खान के एक्सीडेंट पर अस्पताल ने जारी किया पहला बयान pic.twitter.com/qW409HjDh6
— Ashutosh Singh (@ashupratap18) September 28, 2024
కాగా ఇరానీ కప్ కోసం ముషీర్ ఖాన్ అజంగఢ్‌లోని తన ఇంటికి వచ్చారు. ఆ తర్వాత మ్యాచ్ ఆడేందుకు లక్నో వెళ్లాడు. ప్రమాద సమయంలో అతని తండ్రి నౌషాద్ ఖాన్ కూడా కారులో ఉన్నాడు. ఈ ప్రమాదంలో ఆయనకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫీలో అరంగేట్రం చేసిన ముషీర్ ఖాన్ తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. ఈ తరుణంలో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న ముషీర్ ఖాన్ గాయపడటం ముంబై జట్టుకు పెద్ద ఎదురు దెబ్బేనని భావించవచ్చు.
As per #BCCI #MusheerKhan is stable, conscious and well-oriented. He’ll be flown to Mumbai for further assistance once fit to travel . Hae will likely take 6 months for recovery. A video of his accidental car is circulating in media and it seems a bad accident.
Kane Williamson pic.twitter.com/bA1TxfJXvV— Er Amit Chaudhary (@kambojamit47) September 28, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..