వరల్డ్‌కప్‌లో బోణీ కొట్టిన ఆస్ట్రేలియా.. శ్రీలంకపై అద్భుత విజయం.. స్కోర్ల వివరాలు..

ఎట్టకేలకు ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. లక్నో వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుని.. ప్రపంచకప్‌లో తన పాయింట్ల ఖాతాను తెరిచింది. మిచిల్ మార్ష్(52), జోష్ ఇంగ్లిస్(58) అర్ధ సెంచరీలతో రాణించారు. అలాగే మర్నాస్ లబూషేన్(40) మిడిలార్డర్‌లో ఎప్పటిలానే యాంకర్ రోల్ ప్లే చేయగా.. చివర్లో మ్యాక్స్‌వెల్(29) మెరుపులు కంగారూలకు విజయాన్ని కట్టబెట్టాయి.

వరల్డ్‌కప్‌లో బోణీ కొట్టిన ఆస్ట్రేలియా.. శ్రీలంకపై అద్భుత విజయం.. స్కోర్ల వివరాలు..
Australia Vs Srilanka

Updated on: Oct 16, 2023 | 9:40 PM

ఎట్టకేలకు ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. లక్నో వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుని.. ప్రపంచకప్‌లో తన పాయింట్ల ఖాతాను తెరిచింది. మిచిల్ మార్ష్(52), జోష్ ఇంగ్లిస్(58) అర్ధ సెంచరీలతో రాణించారు. అలాగే మర్నాస్ లబూషేన్(40) మిడిలార్డర్‌లో ఎప్పటిలానే యాంకర్ రోల్ ప్లే చేయగా.. చివర్లో మ్యాక్స్‌వెల్(29) మెరుపులు కంగారూలకు విజయాన్ని కట్టబెట్టాయి. ఇక శ్రీలంక బౌలర్లలో మధుశంక(3/38) 3 వికెట్లు పడగొట్టగా.. వేల్లలగే(1/53) ఒక వికెట్ తీశాడు.

210 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు ఓపెనర్లు మార్ష్, వార్నర్ మొదటి రెండు ఓవర్లు చక్కటి శుభారంభాన్ని ఇచ్చారు. అయితే మూడో ఓవర్‌లో మధుశంక మెయిడిన్ రెండు వికెట్లు పడగొట్టి.. ఆసీస్‌కు కోలుకోలేని దెబ్బ తీశాడు. కానీ టూ డౌన్‌లో వచ్చిన లబూషేన్(40) ఎప్పటిలానే ఒక ఎండ్‌లో క్రీజులో నిలదొక్కుకుని.. మార్ష్‌(52)తో పాటు అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే ఈలోపు మార్ష్ రనౌట్‌గా పెవిలియన్ చేరడంతో.. ఆ తర్వాత వచ్చిన ఇంగ్లీస్(58), లబూషేన్‌తో కలిసి స్కోర్ బోర్డు ముందుకు కదిలించాడు. ఇక చివర్లో వచ్చిన మ్యాక్స్‌వెల్(31), స్టోయినిస్(20) మెరుపులు మెరిపించడంతో 14.4 ఓవర్లు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా లక్ష్యాన్ని చేధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఆడమ్ జంపాకు లభించింది.

అంతకముందు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు 209 పరుగులకే ఆలౌట్ అయింది. నిస్సాంక(61), కుశాల్ పెరెరా(78) అర్ధ సెంచరీలు చేయగా.. అసలంక(25) ఫర్వాలేదనిపించాడు. వీరు మినహా మిగిలిన మిడిలార్డర్ బ్యాటర్లు ఎవ్వరూ కూడా సింగిల్ డిజిట్ దాటలేకపోయారు. ఇక ఆస్ట్రేలియా తన తదుపరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో అక్టోబర్ 20న బెంగళూరులో తలబడుతుంది.

మరిన్ని వరల్డ్ కప్ 2023 వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..