
టెస్ట్‌లు ఆటగాళ్లను తీర్చిదిద్దుతాయని సీనియర్ ప్లేయర్స్ అంటుంటారు. సరిగ్గా ఇదే చేసి చూపించాడు ఓ టెస్ట్ బ్యాటర్. తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతోన్న డొమెస్టిక్ వన్డే కప్‌లో మార్కస్ హారిస్ అద్భుత సెంచరీతో అదరగొట్టడమే కాదు.. తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఇటీవల విక్టోరియా, టస్మానియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ జరిగింది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన విక్టోరియా జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది.
వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన మార్కస్ హారిస్(142) చివరి వరకు క్రీజులో నిలబడమే కాదు.. అద్భుతమైన సెంచరీతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు ఓపెనర్ మాథ్యూ షార్ట్(53) అర్ధ సెంచరీతో రాణించాడు. టస్మానియా బౌలర్లలో వెబ్‌స్టర్ 2 వికెట్లు తీయగా.. బర్డ్, మెరిడిత్, రోజర్స్, ఎల్లిస్, ఆండ్రూస్ చెరో వికెట్ పడగొట్టారు.
ఇక లక్ష్యచేదనలో భాగంగా బరిలోకి దిగిన టస్మానియా నిర్ణీత ఓవర్లకు 9 వికెట్ల నష్టపోయి 248 పరుగులు చేసింది. వికెట్ కీపర్ జేక్ దొరన్(104) సెంచరీ చేయగా.. మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ కూడా అతడికి సాయం చేయలేకపోయారు. వికెట్లు వెనువెంటనే పడిపోవటంలో టస్మానియా జట్టు 17 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.