MS Dhoni Video: బైక్ స్టార్ట్ చేసేందుకు నానా ఇబ్బందులు పడ్డ ధోనీ.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..
Viral Video: ధోనీ ఇటీవల దుబాయ్‌లో కనిపించాడు. ఆయన భార్య సాక్షి ధోని ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి ఒక ఫోటోను పంచుకుంది.

MS Dhoni Trending Video: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైరయ్యాడు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండడు. అయితే, ధోని ఎప్పుడూ లైమ్‌లైట్‌లో ఉండాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు. ఇందుకోసం ధోనీకి సంబంధించిన ఏవైనా ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంటారు. ఈ క్రమంలో ధోనీకి సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందులో అతను తన బైక్‌ను స్టార్ట్ చేయడానికి కష్టపడుతున్నట్లు చూడొచ్చు.
ధోనికి మోటార్ బైక్స్ అంటే చాలా ఇష్టం. అతని వద్ద ఎన్నో రకాల మోటార్ బైకులు ఉన్నాయి. దేశానికి ప్రాతినిధ్యం వహించినప్పటి నుంచి ధోనీకి దేశంపై ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. ధోనీ బైక్ నడుపుతూ తన బైక్‌ను స్వయంగా క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఫొటోల్లో మనం చూశాం. ఇంతలో, ధోని పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో అతను బైక్ స్టార్ట్ చేయడానికి కిక్ చేస్తూ.. కష్టపడుతున్నాడు. కానీ, అది స్టార్ట్ కాలేదు. అతను చాలా ప్రయత్నించాడు. చివరకు బైక్ స్టార్ట్ చేస్తాడు. అయితే, ధోనీ బైక్‌ని స్టార్ట్ చేయకుండానే ముందుకు తీసుకెళ్తున్నట్లు చూడొచ్చు.




ఎంఎస్ ధోనీ వైరల్ వీడియో..
Dhoni struggling to start his bike ? pic.twitter.com/9ICKRNXMmA
— MAHIYANK ™ (@Mahiyank_78) December 28, 2022
ధోనీ ఇటీవల దుబాయ్‌లో కనిపించాడు. ఆయన భార్య సాక్షి ధోని ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి ఒక ఫోటోను పంచుకుంది. అందులో ధోని ఒక పార్టీలో కనిపించాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ధోనీతో పాటు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కూడా కనిపించాడు. పంత్ ఇటీవల బంగ్లాదేశ్ టూర్‌లో టెస్ట్ సిరీస్‌లో ఆడిన సంగతి తెలిసిందే.
41 ఏళ్ల ధోనీ ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాబోయే ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీని ధరించి కనిపించనున్నాడు. మునుపటి ఎడిషన్‌లో అతని జట్టు నిరాశపరిచింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ సీజన్‌లో మెరుగ్గా రాణించాలనుకుంటున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
