సయ్యద్ ముస్తాక్ అలీ T20 ట్రోఫీలో 4 ఇన్నింగ్స్‌ల వైఫల్యం తర్వాత, రితురాజ్ గైక్వాడ్ సత్తాచాటాడు. 48 బంతుల్లో 202.08 స్ట్రైక్ రేట్‌తో 97 పరుగులు చేశాడు. అతను కేవలం 3 పరుగుల తేడాతో తన సెంచరీని కోల్పోయాడు. రితురాజ్ ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. సయ్యద్ ముస్తాక్ అలీ T20 ట్రోఫీలో రుతురాజ్ గైక్వాడ్ కేవలం 28 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. మహారాష్ట్ర తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన రితురాజ్ 4 సిక్సర్లు, 4 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో తాను ఫామ్‌లోకి వచ్చినట్లు రుతురాజ్ తెలియజేశాడు. అంతకుముందు ఆడిన 4 ఇన్నింగ్స్‌ల్లో రితురాజ్ 1, 19, 4, 2 పరుగులు మాత్రమే చేశాడు.
48 బంతుల్లో 97 పరుగులతో రితురాజ్ ఇన్నింగ్స్‌తో మహారాష్ట్ర 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సర్వీసెస్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 190 పరుగులు మాత్రమే చేయగలిగింది.
THE RUTURAJ GAIKWAD SHOW…!!!
– 97 (48) with 6 fours and 8 sixes by Captain Ruturaj for Maharashtra in SMAT. A captain’s knock by Rutu.#Pushpa2TheRulereview #Startups4Bharat #SpotifyWrapped2024 #GranHermano2025 pic.twitter.com/TLQ65CRCOC
— TRENDING BHARAT (@VivekPa06904520) December 5, 2024
రుతురాజ్ గైక్వాడ్ దేశవాళీ క్రికెట్‌లో నిరంతరం అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు, అయితే అతనికి టీమ్ ఇండియాలో చోటు దక్కడం లేదు. టీమ్ ఇండియా టీ20 టీమ్‌లో విపరీతమైన పోటి నెలకొంది. రుతురాజ్ గైక్వాడ్ ముందు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, శుభ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్లు రేసులో ఉన్నారు. సయ్యద్ ముస్తాక్ అలీలో అభిషేక్ శర్మ కూడా 28 బంతుల్లో సెంచరీ సాధించాడు. మిగతా వాళ్లలో రాహుల్ త్రిపాఠి(13) విఫలం అయ్యాడు. సిద్ధార్థ్ మాత్రే మెరుపు ఇన్నింగ్స్(19 బంతుల్లో 32) చేశాడు. ధన్‌రాజ్ షిండే(14 బంతుల్లో 32) ధనాధన్ బ్యాటింగ్‌తో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.
Maharashtra captain Ruturaj Gaikwad delivered a stunning performance, scoring 97 runs off just 48 balls in a domestic cricket match. Unfortunately, he missed out on a well-deserved century by just three runs, showcasing his ability to lead from the front with an aggressive and… pic.twitter.com/ZDmYbJHqOS
— chikki (@chikki9057) December 5, 2024