Surya Kumar: రాజస్థాన్ రాయల్స్‌పై తమ చివరి గేమ్‌లో విజయం సాధించిన తర్వాత ముంబై ఇండియన్స్ (MI) శిబిరంలో ఆశలు చిగురించాయి. లీగ్ దశలో వారి తదుపరి, చివరి ఆటకు ముందు ఎంఐ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ప్రాక్టీస్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇందులో ఈ ముంబై యువ ప్లేయర్ స్కై సూపర్‌ఫాస్ట్ షార్ట్ డెలివరీకి అప్పర్‌కట్ ఆడాడు. ఈ క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. “మ్యాజిక్ ఇన్ ది స్కై” అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది. ఎంఐ అభిమానులు సూర్య కుమార్ ఆడిన షాట్‌ను ప్రశంసించగా, మిడిల్-ఆర్డర్ స్టార్ సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరగబోయే మ్యాచ్‌లో ఫాంలోకి రావాలని కోరుకుంటున్నారు.
“ఆకాశమే పరిమితి” అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా, కొంతమంది సూర్యకుమార్ నైపుణ్యాలను హార్దిక్ పాండ్య, ఏబీ డివిలియర్స్‌తో పోల్చుతూ కామెంట్లు చేశారు.
“సూర్య భాయ్, మీరు ఎంత ఫ్లెక్స్‌బుల్‌గా ఉన్నారో?” అంటూ మరికొంతమంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అలాగే “తదుపరి మ్యాచ్‌లో ఫామ్‌ని పొందాలని ఆశపడుతున్నాం” అని ఇంకొకరు కామెంట్ చేశారు.
గత రెండు ఐపీఎల్ సీజన్లలో 400 ప్లస్ పరుగులతో అదరగొట్టిన ఈ ముంబై యువ ఆటగాడు, ఈ ఏడాది మాత్రం నిరాశపరిచాడు. 13 మ్యాచ్‌ల్లో 18.07 సగటుతో 235 పరుగులు చేశాడు.
ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే ప్లేఆఫ్ చేరుకున్నాయి. ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య 4 వ స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. ముంబై క్వాలిఫై కావాలంటే, అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సిన సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ గ్రూప్ దశలో తమ చివరి ఆటను ఓడిపోవడంతో ముంబై టీంకు ఆశలు చిగురించాయి.
కోల్‌కతా నైట్ రైడర్స్ టీం ఈరోజు డబుల్ హెడర్స్‌లో భాగంగా రెండో మ్యాచులో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. అలాగే అక్టోబర్ 8 న ముంబై ఇండియన్స్ టీం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతుంది.
Also Read: IPL 2021 CSK vs PBKS Live Score: జట్టు స్కోరును పెంచే పనిలో పడ్డ డుప్లెసిస్.. హాఫ్ సెంచరీ పూర్తి.
IPL 2021 CSK vs PBKS Live Streaming: దుబాయ్ వేదికగా రసవత్తర పోరు.. కత్తులు దూస్తున్న కింగ్స్..