అది నా అదృష్టం: మార్టిన్ గుప్తిల్

| Edited By: Srinu

Jul 12, 2019 | 8:43 PM

ప్రపంచకప్ తొలి సెమీఫైనల్‌లో టీమిండియా ఓటమి భారత క్రీడాభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఆ మ్యాచ్‌లో ధోనీని న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గుప్తిల్ రనౌట్ చేయడం.. ఆ తర్వాత మ్యాచ్ పూర్తిగా చేజారిపోవడం అంతా చకచకా జరిగిపోయాయి. అయితే ఆ రనౌట్‌పై చర్చోపచర్చలు ఇంకా సాగుతున్నాయి. ధోనీ అవుట్ అవ్వకుండా ఉంటే మ్యాచ్ మరోలా ఉండేదని ఒకరంటే.. అసలా బంతిని నోబాల్‌గా ప్రకటించాల్సిందని మరొకరు ఇలా వాదనలు నడుస్తున్నాయి. ధోని రనౌట్‌ కావడం తన అదృష్టమని గుప్తిల్ […]

అది నా అదృష్టం: మార్టిన్ గుప్తిల్
Follow us on

ప్రపంచకప్ తొలి సెమీఫైనల్‌లో టీమిండియా ఓటమి భారత క్రీడాభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఆ మ్యాచ్‌లో ధోనీని న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గుప్తిల్ రనౌట్ చేయడం.. ఆ తర్వాత మ్యాచ్ పూర్తిగా చేజారిపోవడం అంతా చకచకా జరిగిపోయాయి. అయితే ఆ రనౌట్‌పై చర్చోపచర్చలు ఇంకా సాగుతున్నాయి. ధోనీ అవుట్ అవ్వకుండా ఉంటే మ్యాచ్ మరోలా ఉండేదని ఒకరంటే.. అసలా బంతిని నోబాల్‌గా ప్రకటించాల్సిందని మరొకరు ఇలా వాదనలు నడుస్తున్నాయి.

ధోని రనౌట్‌ కావడం తన అదృష్టమని గుప్తిల్ అన్నాడు. భారత్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్లో గుప్టిల్‌ తన అద్భుత ఫీల్డింగ్‌తో ధోనిని పెవిలియన్‌ను చేర్చిన విషయం తెలిసిందే. విజయానికి 12 బంతుల్లో భారత్ 36 పరుగులు చేయాల్సిన స్థితిలో ధోని ఓ భారీ సిక్స్‌ కొట్టి విజయంపై అశలను రేకెత్తించాడు. ఆ తర్వాతి బంతిని వదిలేసి మూడో బంతికి రెండు పరుగులు తీసే క్రమంలో గుప్తిల్ డైరెక్ట్‌ త్రోకు ధోనీ రన్నవుటయ్యాడు. ఈ ఔట్‌తోనే ప్రపంచకప్‌లో భారత్‌ పోరాటం ముగిసింది. అయితే బ్యాటింగ్‌తో ఆకట్టుకోని గుప్తిల్ ఈ ఒక్క రనౌట్‌తో హీరో అయ్యాడు.