IPL 2023: ‘పది’ పరీక్షల్లో చీటింగ్.. కట్ చేస్తే.. ఐపీఎల్‌లో రూ. 4 కోట్ల సంపాదన.. ఈ ప్లేయర్ ఎవరంటే?

|

Apr 07, 2023 | 12:22 PM

మనలో సత్తా ఉండాలే గానీ.. అది అంతర్జాతీయ మ్యాచ్‌లైనా, డొమెస్టిక్ మ్యాచ్‌లైనా అద్భుతమైన విజయాలను సాధిస్తాం..

IPL 2023: పది పరీక్షల్లో చీటింగ్.. కట్ చేస్తే.. ఐపీఎల్‌లో రూ. 4 కోట్ల సంపాదన.. ఈ ప్లేయర్ ఎవరంటే?
Lsg
Follow us on

మనలో సత్తా ఉండాలే గానీ.. అది అంతర్జాతీయ మ్యాచ్‌లైనా, డొమెస్టిక్ మ్యాచ్‌లైనా అద్భుతమైన విజయాలను సాధిస్తాం. ఇలాగే ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు ఓ ప్లేయర్. ఇతడు ‘పది’ పరీక్షలను కాపీ కొట్టి పాస్ అయ్యాడు.. కానీ బరిలో మాత్రం విజయాలు సాధిస్తున్నాడు. మరెవరో కాదు.. IPL 2023లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతున్న రవి బిష్ణోయ్. లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ 2023 మినీ వేలానికి ముందుగా బౌలర్ రవి బిష్ణోయ్‌ను తమతోనే అట్టిపెట్టుకుంది. అతడు లక్నో నుంచి ప్రతీ ఏడాది రూ. 4 కోట్లు అందుకుంటున్నాడు.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను పది పరీక్షలు కాపీ కొట్టి పాస్ అయ్యాను. సాధారణంగా అందరూ పరీక్షలకు స్లిప్పులు తీసుకెళ్తారు. కానీ అందుకు విరుద్దంగా నేను ఫ్రెండ్స్ చేసుకునేవాడిని, తెలివితేటలను ఉపయోగించాను. ఎగ్జామ్ టైంలో మన చుట్టుప్రక్కల అందరూ స్నేహితులు ఉంటే.. మనకు కాపీ కొట్టడం చాలా సులభం అవుతుంది’ అని చెప్పాడు.

మరోవైపు క్రికె‌ట్‌పై ఉన్న పిచ్చితో 12వ తరగతి పరీక్షను కూడా వదిలేసి.. రాజస్థాన్ రాయల్స్‌ జట్టు నెట్స్‌లో బౌలింగ్ చేయడానికి వచ్చేశానని రవి బిష్ణోయ్ తెలిపాడు. కాగా, ఈ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతున్న రవి బిష్ణోయ్.. ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు పడగొట్టాడు. ఇక శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్‌లో లక్నోకి ట్రంప్ కార్డ్‌గా మారనున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం..