Lucknow Super Giantsvs Rajasthan Royals Highlights: ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో రాజస్థాన్ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని లక్నో చేధించలేకపోయింది. కేవలం 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో రాజస్థాన్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్నో ఆటగాళ్లలో దీపక్ హుడా 59 పరుగులు, మార్కస్ స్టొయినిస్ 27 పరుగులు, కృనాల్ పాండ్య 25 పరుగులు మినహాయించి పెద్దగా ఎవ్వరూ రాణించలేదు. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2, ఒబెడ్ మెక్‌కాయ్ 2, ప్రసిద్ద్ కృష్ణ 2, యుజ్వేంద్ర చాహల్ 1, అశ్విన్ 1 వికెట్ సాధించారు. ఈ విజయంతో రాజస్థాన్ (16, +0.304) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. రన్‌రేట్ తగ్గడంతో లఖ్‌నవూ (16, +0.262) మూడో స్థానానికి పడిపోయింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కి దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ల 6 నష్టానికి 178 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 41, దేవదుత్ పడిక్కల్ 39, సంజూ శాంసన్ 32, రియాన్ పరాగ్ 17, నీషమ్ 14, అశ్విన్ 10, ట్రెంట్ బౌల్ట్ 17 పరుగులు చేశారు. జోస్ బట్లర్ (2) విఫలమయ్యాడు. లఖ్‌నవూ బౌలర్లలో రవి బిష్ణోయ్ 2.. అవేశ్‌ఖాన్, జాసన్ హోల్డర్, ఆయుష్ బదోని తలో వికెట్ తీశారు.
ఇరు జట్ల ప్లేయింగ్ – XI ఎలా ఉందంటే..
రాజస్థాన్ రాయల్స్ :
సంజూ శాంసన్ (కెప్టెన్ /వికెట్ కెప్టెన్), జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్, జేమ్స్ నీషమ్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, ప్రశాంత్ కృష్ణ, ఒబెడ్ మెక్‌కాయ్
లక్నో సూపర్ జెయింట్స్ :
కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, దుష్మంత్ చమీరా, జాసన్ హోల్డర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్.
లక్నో జట్టులో కెప్టెన్ రాహుల్, క్వింటన్ డి కాక్ ఎక్కువ పరుగులు చేయాల్సి ఉంది. గత మ్యాచ్‌లో వీరిద్దరూ త్వరగానే పెవిలియన్‌కు చేరుకున్నారు. దీంతో రాయల్స్‌పై మెరుగ్గా ఆడాలని RR మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
రాజస్థాన్‌కు కూడా ఈ మ్యాచ్ కీలకం. ప్లే ఆఫ్ రేసులో నిలవాంటే RR తప్పకుండా విజయం సాధించాల్సి ఉంది.
లక్నో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్నో ఆటగాళ్లలో దీపక్ హుడా 59 పరుగులు, మార్కస్ స్టొయినిస్ 27 పరుగులు, కృనాల్ పాండ్య 25 పరుగులు మినహాయించి పెద్దగా ఎవ్వరూ రాణించలేదు. దీంతో లక్ష్యం దగ్గరి వరకు వచ్చి చివరలో చతికిలపడింది. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2, ఒబెడ్ మెక్‌కాయ్ 2, ప్రసిద్ద్ కృష్ణ 2, యుజ్వేంద్ర చాహల్ 1, అశ్విన్ 1 వికెట్ సాధించారు.
లక్నో ఎనిమిదో వికెట్ కోల్పోయింది. మార్కస్ స్టొయినిస్ 27 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో 19.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.
లక్నో ఏడో వికెట్ కోల్పోయింది. దుష్‌మంత్ డకౌట్ అయ్యాడు. దీంతో17 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 18 బంతుల్లో 59 పరుగులు కావాలి.
లక్నో ఆరో వికెట్ కోల్పోయింది. జాసన్ హోల్డర్ ఒక్క పరుగుకే ఔటయ్యాడు. దీంతో 16.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 18 బంతుల్లో 59 పరుగులు కావాలి.
లక్నో ఐదో వికెట్ కోల్పోయింది. దీపక్ హుడా 59 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో 16 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 24 బంతుల్లో 64 పరుగులు చేయాల్సి ఉంది.
15 ఓవర్లలో లక్నో 4 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. క్రీజులో మార్కస్ 4 పరుగులు, దీపక్ హుడా 51 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 30 బంతుల్లో 72 పరుగులు కావాలి. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2, ప్రసిద్ద్ కృష్ణ 1, అశ్విన్ 1 వికెట్ సాధించారు.
దీపక్ హుడా హాఫ్ సెంచరీ సాధించాడు. 33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేశాడు. దీంతో లక్నో 4 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 31 బంతుల్లో 73 పరుగులు చేయాల్సి ఉంది.
లక్నో 14.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. క్రీజులో మార్కస్ 3 పరుగులు, దీపక్ హుడా 48 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 34 బంతుల్లో 76 పరుగులు కావాలి. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2, ప్రసిద్ద్ కృష్ణ 1, అశ్విన్ 1 వికెట్ సాధించారు.
లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్య 25 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో 13.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 41 బంతుల్లో 85 పరుగులు చేయాల్సి ఉంది.
కృనాల్ పాండ్య 21 పరుగులు, దీపక్ హుడా 32 పరుగులతో నాలుగో వికెట్‌కి 33 బంతుల్లో 50 పరుగులు జోడించారు. విజయానికి ఇంకా 54 బంతుల్లో 100 పరుగులు కావాలి.
10 ఓవర్లలో లక్నో 3 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది. క్రీజులో కృనాల్ పాండ్య 20 పరుగులు, దీపక్ హుడా 20 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 60 బంతుల్లో 113 పరుగులు కావాలి. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2, ప్రసిద్ద్ కృష్ణ 1 వికెట్ సాధించారు.
లక్నో 8 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. క్రీజులో కృనాల్ పాండ్య 15 పరుగులు, దీపక్ హుడా 11 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 72 బంతుల్లో 129 పరుగులు కావాలి.
డి కాక్ అవుట్ అయిన వెంటనే లక్నో మరో వికెట్ కోల్పోయింది. ఆయుష్ బడోని అవుట్ అయ్యాడు. బౌల్ట్ బౌలింగ్ బీఎమ్‌డబ్ల్యూ రూపంలో వెను దిరిగాడు.
లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్‌ను కోల్పోయింది. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో జేమ్స్ నీషమ్‌కు క్యాచ్ ఇచ్చిన క్వింటన్ డి కాక్ పెవిలియన్ బాట పట్టాడు.
రాజస్థాన్ రాయల్స్ ఇచ్చిన 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం స్కోర్ బోర్డ్ రెండు ఓవర్లు ముగిసే సమయానికి 15 పరుగుల వద్ద కొనసాగుతోంది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ల 6 నష్టానికి 178 పరుగులు చేసింది. మొదట్లో దూకుడుగా ఆడిన రాజస్థాన్ క్రమేణా వికెట్లను సమర్పించుకుంటూ పోయింది. ఓపెనర్ జైస్వాల్ 41 పరుగులతో రాణించాడు. అయితే ఇక సంజూ శాంసన్ 32, దేవదత్ పడిక్కల్ 39 పరుగులు సాధించారు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. దీంతో స్కోర్ 200 దాటే అవకాశం ఉన్నా రాజస్థాన్ 178 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది.
రియాన్ పరంగ్ అవుట్ అయ్యాడు. 17 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో స్టోయినిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
రాజస్థాన్ రాయల్స్ మరో వికెట్ కోల్పోయింది. 18 బంతుల్లో 39 పరుగులు సాధించిన దేవదత్ పడిక్కల్ రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో కృనల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 29 బంతుల్లో 41 పరుగులు చేసి జట్టు స్కోర్‌ను పరుగులు పెట్టించే ప్రయత్నం చేసిన జైస్వాల్ ఆయుష్ బడోని బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
పది ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్ స్కోర్ రెండు వికెట్ల నష్టానికి 90 పరుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్ (40), దేవదత్ పడిక్కల్ (14) పరుగుల వద్ద కొనసాగుతున్నారు.
స్కోర్ బోర్డ్ దూసుకుపోతుందని అనుకుంటున్న సమయంలోనే రాజస్థాన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. హోల్డర్ బౌలింగ్‌లో సంజూ శాంసన్ హుడాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో శాంసన్ జైస్వాల్‌ల 64 పరుగుల భాగస్వామ్యానికి ఫుల్‌స్టాప్ పడింది.
రాజస్థాన్ స్కోరు 50 రన్స్ దాటింది. యశస్వి జైస్వాల్ (18 బంతుల్లో 34) జోరు చూపిస్తుండగా.. శామ్సన్ (12) నిలకడగా ఆడుతున్నాడు. పవర్ ప్లే ముగిసే సరికి 51/1.
రాజస్థాన్‌కు లక్నో బౌలర్ అవేశ్ ఖాన్ షాక్ ఇచ్చాడు. ఫామ్‌లో ఉన్న బట్లర్ (2)ను బౌల్డ్ చేశాడు. 2.2 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ స్కోరు 11/1.
రాజస్థాన్ ఇన్నింగ్స్ ఆరంభమైంది. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా వచ్చారు. అటు లక్నో తరఫున మోహిసిన్ ఖాన్ మొదటి ఓవర్ అందుకున్నాడు.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ‘మేము మొదట బ్యాటింగ్ చేయబోతున్నాం. ఈ సీజన్‌లో బ్యాటింగే మా బలం’ అని తెలిపాడు.