AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LSG vs RCB Score: రాజత్ పాటిదార్‌ విధ్వంసకర బ్యాటింగ్‌.. లక్నో ముందు భారీ విజయ లక్ష్యం..

Lucknow Super Giants vs Royal Challengers Bangalore: ఐపీఎల్‌ 2022 (IPL 2022)లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరుగుతోన్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో బెంగళూరు అద్భుత...

LSG vs RCB Score: రాజత్ పాటిదార్‌ విధ్వంసకర బ్యాటింగ్‌.. లక్నో ముందు భారీ విజయ లక్ష్యం..
Narender Vaitla
|

Updated on: May 25, 2022 | 10:16 PM

Share

Lucknow Super Giants vs Royal Challengers Bangalore: ఐపీఎల్‌ 2022 (IPL 2022)లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరుగుతోన్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో బెంగళూరు అద్భుత ఆటతీరును కనబరించింది. కీలకమైన మ్యాచ్‌లో బెంగళూరు బ్యాట్స్‌మెన్‌ అదరగొట్టారు. బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. రాజత్‌ పాటిదార్‌ కేవలం 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జట్టు స్కోరు పెరగడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇక పాటిదార్‌ తర్వాత దినేష్‌ కార్తిక్‌ (37), విరాట్‌ కోహ్లీ (25) పరుగులు సాధించారు. రవి బిష్ణోయ్‌ వేసిన 16 ఓవర్‌లో పాటిదార్‌ మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో ఒక్కసారిగా స్కోర్‌ను పరుగులు పెట్టించాడు. ఇక లక్నో బౌలింగ్ విషయానికొస్తే మెహ్‌సిన్‌ ఖాన్‌, కృనాల్ పాండ్య, అవేశ్‌ ఖాన్‌, రవి బిష్ణోయ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌ ప్రారంభమయ్యే ముందు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో టాస్‌ వేయడం ఆలస్యమైన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్‌ క్వాలిఫయర్‌-2లో రాజస్థాన్‌తో తలపడుతుంది. ఓడిన జట్టు ఇంటి ముఖం పడుతుంది.

మరిన్ని ఐపీఎల్ కథనాల కోసం క్లిక్ చేయండి..