LSG vs RCB IPL 2022 Eliminator Highlights: లక్నోపై బెంగళూరు విజయం.. 14 పరుగుల తేడాతో విక్టరీ..

| Edited By: Narender Vaitla

Updated on: May 26, 2022 | 12:34 AM

LSG vs RCB, IPL 2022 Eliminator:కీలకమైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజ్‌ బెంగళూరు సత్తా చాటింది. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో సమిష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది...

LSG vs RCB IPL 2022 Eliminator Highlights: లక్నోపై బెంగళూరు విజయం.. 14 పరుగుల తేడాతో విక్టరీ..
Lsg Vs Rcb

LSG vs RCB, IPL 2022 Eliminator Highlights: కీలకమైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజ్‌ బెంగళూరు సత్తా చాటింది. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో సమిష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది. లక్నోను ఓడించి క్వాలిఫయర్‌-2కి చేరింది. బెంగళూరు బౌలర్లు కట్టడిగా బౌలింగ్‌ చేయడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 193 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో 14 పరుగుల తేడాతో బెంగళూరు విజయకేతనం ఎగరేసింది. శుక్రవారం రాజస్థాన్‌, బెంగళూరు మధ్య క్వాలిఫయర్-2 జరగనుంది. బెంగళూరు బ్యాటింగ్ విషయానికొస్తే కేఎల్‌ రాహుల్‌ (79), దీపక్‌ హుడా (45) పరుగులతో రాణించారు. అయితే వీరిద్దరు పెవిలియన్‌ బాట పట్టడంతో స్కోర్‌ బోర్డ్‌ ఒక్కసారిగా నెమ్మించింది.

ఇక బెంగళూరు బౌలింగ్‌ విషయానికొస్తే.. మహ్మద్‌ సిరాజ్‌, హేజిల్‌వుడ్, వానిందు హసరంగ, హర్షల్‌ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు బ్యాటర్లు దుమ్మురేపారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు సాధించింది. రాజత్‌ పాటిదార్‌ కేవలం 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జట్టు స్కోరు పెరగడంలో కీలక పాత్ర పోషించాడు. దినేష్‌ కార్తిక్‌ (37), విరాట్‌ కోహ్లీ (25) పరుగులు చేసి జట్టు స్కోర్‌ పెరగడంలో తమవంతు పాత్ర పోషించారు.

లక్నో ప్లేయింగ్-11

లక్నో సూపర్ జెయింట్స్: కెఎల్ రాహుల్ (సి), క్వింటన్ డి కాక్ (వికె), ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, మనన్ వోహ్రా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, దుష్మంత చమీరా, అవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్, రవి బిష్ణోయ్

బెంగళూరు ప్లేయింగ్-11

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమోర్డ్, దినేష్ కార్తీక్ (WK), షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్ మరియు జోష్ హేజిల్‌వుడ్.

Key Events

KL రాహుల్, క్వింటన్ డి కాక్‌పై దృష్టి

లక్నో జట్టు విజయం సాధించాలంటే కెప్టెన్ కేఎల్ రాహుల్, అతని ఓపెనింగ్ భాగస్వామి క్వింటన్ డి కాక్ ఆడటం తప్పనిసరి. అప్పుడే జట్టు బాగా స్కో్రు చేయగలుగుతుంది.

విరాట్ కోహ్లీ ఫామ్‌ కొనసాగిస్తాడా..

ఈ సీజన్ మొత్తంలో విరాట్ కోహ్లి ఫామ్‌లో కనిపించకపోయినా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. నేటి మ్యాచ్‌లోనూ అదే ఫామ్‌ని కొనసాగిస్తే లక్నో కష్టాల్లో పడుతుంది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 26 May 2022 12:20 AM (IST)

    బెంగళూరు ఘన విజయం..

    ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో బెంగళూరు సత్తా చాటింది. లక్నో సూపర్ జెయింట్స్‌పై 14 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. బెంగళూరు బౌలర్లు రాణించడంతో లక్నోను లక్ష్యాన్ని చేధించకుండా అడ్డుకుంది. దీంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 193 పరుగులకు పరిమితం కావాల్సి వచ్చింది.

  • 26 May 2022 12:11 AM (IST)

    కష్టాల్లోకి లక్నో..

    లక్నో సూపర్ జెయింట్స్‌ వరుసగా వికెట్లు కోల్పోతోంది. రాహుల్ అవుట్‌ అయిన కొన్ని క్షణాలకే కృనల్‌ పాండ్యా డకవుట్ రూపంలో వెనుదిరిగాడు. లక్నో స్కోర్‌ 19 ఓవర్లు ముగిసే సమయానికి లక్నో స్కోర్ 184 వద్ద కొనసాగుతోంది.

  • 25 May 2022 11:58 PM (IST)

    మరో వికెట్ కోల్పోయిన లక్నో..

    లక్నో సూపర్ జెయింట్స్‌ 4వ వికెట్‌ను కోల్పోయింది. హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో రాజత్‌ పాటిదార్‌కు క్యాచ్‌ ఇచ్చిన మార్కస్ స్టోయినిస్ పెవిలియన్‌ బాట పట్టాడు. ప్రస్తుతం లక్నో గెలవాలంటే 15 బంతుల్లో 35 పరుగులు చేయాల్సి ఉంటుంది.

  • 25 May 2022 11:55 PM (IST)

    ఓటమి దిశగా లక్నో.. ఇంకా ఎన్ని పరుగులు చేయాలంటే..

    లక్నో సూపర్ జెయింట్స్‌ ఓటమి దిశగా అడుగులు వేస్తోంది. రాహుల్ దూకుడుగా ఆడుతోన్నా లక్ష్యాన్ని చేధించే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం లక్నో 18 బంతుల్లో విజయానికి ఇంకా 35 పరుగులు చేయాల్సి ఉంది.

  • 25 May 2022 11:38 PM (IST)

    మరో వికెట్ డౌన్‌..

    లక్నో సూపర్ జెయింట్స్‌ మరో వికెట్‌ కోల్పోయింది. కేవలం 26 బంతుల్లో 45 పరుగులు చేసిన దూకుడు మీదున్న దీపక్‌ హుడా పెవిలియన్‌ బాట పట్టాడు. హసరంగా బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. దీంతో లక్నో 137 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది.

  • 25 May 2022 11:24 PM (IST)

    100 పరుగుల మార్క్‌ను చేరుకున్న లక్నో..

    లక్నో సూపర్‌ జెయింట్స్‌ 100 పరుగుల మార్క్‌ను చేరుకుంది. రాహుల్‌ దూకుడుగా ఆడుతుండడంతో జట్టు స్కోర్‌ పెరుగుతోంది. అయితే లక్నో విజయానికి ఇంకా 104 పరుగులు కావాల్సి ఉంది. కేవలం 44 బంతులు మాత్రమే చేతిలో ఉన్నాయి.

  • 25 May 2022 11:13 PM (IST)

    10 ఓవర్లకు స్కోర్‌ ఎంతంటే..

    10 ఓవర్లు ముగిసే సమయానికి లక్నో రెండు వికెట్ల నష్టానికి 89 పరుగుల వద్ద కొనసాగుతోంది. క్రీజులో రాహుల్‌ (37), దీపక్‌ హుడా (19) పరుగులతో కొనసాగుతున్నారు. లక్నో విజయం సాధించాలంటే 59 బంతుల్లో 115 పరుగులు చేయాల్సి ఉంది.

  • 25 May 2022 11:05 PM (IST)

    దూకుడు పెంచిన రాహుల్‌..

    208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ స్కోర్‌ నెమ్మదిగా సాగుతోంది. వరుసగా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును రాహుల్‌ ఆదుకునే పనిలో పడ్డాడు. ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసే సమయానికి 84 పరుగుల వద్ద కొనసాగుతోంది. క్రీజులో రాహుల్‌ (34), దీపక్‌ హుడా (17) పరుగులతో కొనసాగుతున్నారు.

  • 25 May 2022 10:42 PM (IST)

    రెండో వికెట్‌ డౌన్‌..

    లక్నో రెండో వికెట్‌ కోల్పోయింది. 19 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద మనన్‌ వోహ్రా పెవిలియన్‌ బాటపట్టాడు. షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో హేజల్‌ వుడ్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు.

  • 25 May 2022 10:23 PM (IST)

    ఫస్ట్‌ ఓవర్‌లోనే వికెట్‌ డౌన్‌..

    లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. క్వింటన్‌ డికాక్‌ అవుట్‌ అయ్యాడు. సిరాజ్‌ బౌలింగ్‌లో ఫాఫ్ డు ప్లెసిస్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు.

  • 25 May 2022 10:02 PM (IST)

    లక్నో ముందు భారీ లక్ష్యం..

    కీలక మ్యాచ్‌లో బెంగళూరు రాణించారు. రజత్ పాటిదార్ విధ్వంసకర బ్యాటింగ్‌తో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 207 పరుగులు సాధించింది. ప్రస్తుతం లక్నో గెలవాలంటే 208 పరుగులు చేయాల్సి ఉంది. పాటిదార్‌ కేవలం 54 బంతుల్లో 112 పరుగులతో అజేయంగా నిలిలిచాడు. మరి బెంగళూరు ఇచ్చిన ఈ భారీ లక్ష్యాన్ని లక్నో చేధిస్తుందో లేదో చూడాలి.

  • 25 May 2022 09:44 PM (IST)

    సెంచరీ చేసిన రజత్ పాటిదార్

    రజత్‌ పాటిదార్‌ సెంచరీ సాధించాడు. 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. దీంతో బెంగుళూరు 17.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.

  • 25 May 2022 09:30 PM (IST)

    15 ఓవర్లకి బెంగుళూరు 123/4

    బెంగుళూరు 15 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజులో రజత్‌ పాటిదార్‌ 66 పరుగులు, దినేష్‌ కార్తీక్‌ 5 పరుగులతో ఆడుతున్నారు. లక్నో బౌలర్లలో మొహ్సిన్ ఖాన్ ఒక వికెట్‌, ఆవేశ్‌ ఖాన్‌కి ఒక వికెట్‌, కృనాల్‌ పాండ్య ఒక వికెట్‌, రవి బిషోని ఒక వికెట్‌ దక్కింది.

  • 25 May 2022 09:20 PM (IST)

    నాలుగో వికెట్‌ కోల్పోయిన బెంగుళూరు

    బెంగుళూరు నాలుగో వికెట్‌ కోల్పోయింది. మహిపాల్‌ 14 పరుగుల వద్ద ఔట్‌ అయ్యాడు. దీంతో బెంగుళూరు 13.1 ఓవరల్లో నాలుగు వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది.

  • 25 May 2022 09:10 PM (IST)

    100 పరుగులు దాటిన బెంగుళూరు

    బెంగుళూరు 11 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో రజత్‌ పాటిదార్‌ 57 పరుగులు, మహిపాల్‌ 8 పరుగులతో ఆడుతున్నారు. లక్నో బౌలర్లలో మొహ్సిన్ ఖాన్ ఒక వికెట్‌, ఆవేశ్‌ ఖాన్‌కి ఒక వికెట్‌, కృనాల్‌ పాండ్య ఒక వికెట్‌ దక్కింది.

  • 25 May 2022 09:03 PM (IST)

    మూడో వికెట్‌ కోల్పోయిన బెంగుళూరు

    బెంగుళూరు మూడో వికెట్‌ కోల్పోయింది. గ్లెన్‌ మాక్స్‌వెల్ 9 పరుగుల వద్ద ఔట్‌ అయ్యాడు. దీంతో బెంగుళూరు 10.3 ఓవరల్లో మూడు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది.

  • 25 May 2022 09:01 PM (IST)

    హాఫ్ సెంచరీ చేసిన రజత్ పాటిదార్

    రజత్‌ పాటిదార్‌ హాఫ్ సెంచరీ చేశాడు. 28 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. దీంతో బెంగుళూరు 10.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది.

  • 25 May 2022 08:59 PM (IST)

    10 ఓవర్లకి బెంగుళూరు 84/2

    బెంగుళూరు 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. క్రీజులో రజత్‌ పాటిదార్‌ 49 పరుగులు, గ్లెన్‌ మాక్స్‌వెల్ 8 పరుగులతో ఆడుతున్నారు. లక్నో బౌలర్లలో మొహ్సిన్ ఖాన్ ఒక వికెట్‌, ఆవేశ్‌ ఖాన్‌కి ఒక వికెట్‌ దక్కింది.

  • 25 May 2022 08:54 PM (IST)

    రెండో వికెట్‌ కోల్పోయిన బెంగుళూరు

    బెంగుళూరు రెండో వికెట్‌ కోల్పోయింది. విరాట్‌కోహ్లీ 25 పరుగుల వద్ద ఔట్‌ అయ్యాడు. దీంతో 8.4 ఓవర్లలో బెంగుళూరు రెండు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది.

  • 25 May 2022 08:38 PM (IST)

    50 పరుగులు దాటిన బెంగుళూరు

    బెంగుళూరు 5.5 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 52 పరుగులు చేసింది. క్రీజులో విరాట్‌ కోహ్లీ 18 పరుగులు, రజత్ పాటిదార్ 33 పరుగులతో ఆడుతున్నారు. లక్నో బౌలర్లలో మొహ్సిన్ ఖాన్ ఒక వికెట్‌ దక్కింది.

  • 25 May 2022 08:35 PM (IST)

    5 ఓవర్లకి బెంగుళూరు 32/1

    5 ఓవర్లకి బెంగుళూరు ఒక వికెట్‌నష్టానికి 32 పరుగులు చేసింది. క్రీజులో విరాట్‌ కోహ్లీ 17 పరుగులు, రజత్ పాటిదార్ 14 పరుగులతో ఆడుతున్నారు. లక్నో బౌలర్లలో మొహ్సిన్ ఖాన్ ఒక వికెట్‌ దక్కింది.

  • 25 May 2022 08:16 PM (IST)

    మొదటి వికెట్‌ కోల్పోయిన బెంగుళూరు

    బెంగుళూరు మొదటి వికెట్‌ కోల్పోయింది. పాప్‌ డుప్లెసిస్‌ డకౌట్‌ అయ్యాడు. దీంతో బెంగుళూరు 0.5 ఓవరల్లో ఒక వికెట్‌ నష్టానికి 4 పరుగులు చేసింది.

  • 25 May 2022 08:10 PM (IST)

    బ్యాటింగ్‌ ప్రారంభించిన రాయల్‌ చాలెంజ్‌ బెంగుళూరు

    బెంగుళూరు బ్యాటింగ్‌ ప్రారంభించింది. క్రీజులోకి ఓపెనర్లుగా విరాట్‌ కోహ్లీ, పాప్‌ డుప్లెసిస్‌ వచ్చారు.

  • 25 May 2022 08:08 PM (IST)

    బెంగళూరు ప్లేయింగ్-11

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమోర్డ్, దినేష్ కార్తీక్ (WK), షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్ మరియు జోష్ హేజిల్‌వుడ్.

  • 25 May 2022 08:07 PM (IST)

    లక్నో ప్లేయింగ్-11

    లక్నో సూపర్ జెయింట్స్: కెఎల్ రాహుల్ (సి), క్వింటన్ డి కాక్ (వికె), ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, మనన్ వోహ్రా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, దుష్మంత చమీరా, అవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్, రవి బిష్ణోయ్

  • 25 May 2022 08:00 PM (IST)

    టాస్ గెలిచిన లక్నో

    లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. లక్నోలో రెండు మార్పులు చేశారు. కృష్ణప్ప గౌతమ్, జాసన్ హోల్డర్ ఔట్ కాగా, క్రునాల్ పాండ్యా, దుష్మంత చమీర జట్టులోకి వచ్చారు. బెంగళూరులో మార్పు వచ్చింది. మహ్మద్ సిరాజ్ తిరిగి వచ్చాడు.

  • 25 May 2022 07:54 PM (IST)

    టాస్ ఎప్పుడు జరుగుతుంది?

    వర్షం ఆగింది. మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. రాత్రి 7:55 గంటలకు టాస్ ప్రారంభమవుతుందని రాత్రి 8:10 గంటలకు తొలి ఇన్నింగ్స్ ప్రారంభమవుతుంది.

  • 25 May 2022 07:42 PM (IST)

    వర్షం ఆగిపోయంది.. మరికొద్ది సేపట్లో మ్యాచ్‌ ప్రారంభమయ్యే అవకాశం

    క్రిక్‌బజ్ వెబ్‌సైట్ ప్రకారం.. వర్షం ఆగిపోయింది. మ్యాచ్‌పై అధికారికంగా చర్చలు జరుగుతున్నాయి. కవర్లు తొలగిస్తున్నారు. మరికొద్దిసేపటిలో టాస్‌ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  • 25 May 2022 07:39 PM (IST)

    వర్షం పడితే మ్యాచ్‌ పరిస్థితులు ఇలా ఉన్నాయి..

    ఎలిమినేషన్‌ మ్యాచ్‌ జరగకుంటే ఈ విధంగా డిక్లేర్ చేస్తారు. రాత్రి 9:40 గంటల లోపు మ్యాచ్‌ ప్రారంభమైతే ఒక్క ఓవర్ తగ్గకుండా ఆట ప్రారంభమవుతుంది. ఒకవేళ రాత్రి 11:56 తర్వాత ప్రారంభమైతే 5 ఓవర్ల మ్యాచ్‌ జరుగుతుంది. 12:50 లోపు కూడా మ్యాచ్‌ జరగకుంటే సూపర్‌ ఓవర్‌ వేసి మ్యాచ్‌ నిర్ణయిస్తారు. అది కూడా జరగకకుండా మ్యాచ్‌ రద్దయితే పాయింట్స్‌ , రన్‌రేట్‌ని బట్టి విజేతని నిర్ణయిస్తారు.

  • 25 May 2022 07:06 PM (IST)

    టాస్‌ ఆలస్యం

    వాతావరణం సరిగ్గా లేని కారణంగా టాస్‌ ఆలస్యం కానుంది. బలమైన గాలులు వీస్తున్నాయి. గ్రౌండ్ స్టాఫ్ కవర్లతో సిద్ధంగా ఉన్నారు. వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉంది.

  • 25 May 2022 06:58 PM (IST)

    సెంచరీకి ఒక అడుగు దూరంలో హసరంగ

Published On - May 25,2022 6:49 PM

Follow us
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..