AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LSG vs RCB IPL Match Result: కీలక మ్యాచ్‌లో సత్తా చాటిన బెంగళూరు.. లక్నోపై గ్రాండ్‌ విక్టరీ..

LSG vs RCB IPL Match Result: కీలకమైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజ్‌ బెంగళూరు సత్తా చాటింది. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో సమిష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది. లక్నోను ఓడించి...

LSG vs RCB IPL Match Result: కీలక మ్యాచ్‌లో సత్తా చాటిన బెంగళూరు.. లక్నోపై గ్రాండ్‌ విక్టరీ..
Narender Vaitla
|

Updated on: May 26, 2022 | 12:48 AM

Share

LSG vs RCB IPL Match Result: కీలకమైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజ్‌ బెంగళూరు సత్తా చాటింది. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో సమిష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది. లక్నోను ఓడించి క్వాలిఫయర్‌-2కి చేరింది. బెంగళూరు బౌలర్లు కట్టడిగా బౌలింగ్‌ చేయడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 193 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో 14 పరుగుల తేడాతో బెంగళూరు విజయకేతనం ఎగరేసింది. శుక్రవారం రాజస్థాన్‌, బెంగళూరు మధ్య క్వాలిఫయర్-2 జరగనుంది. లక్నో బ్యాటింగ్ విషయానికొస్తే కేఎల్‌ రాహుల్‌ (79), దీపక్‌ హుడా (45) పరుగులతో రాణించారు. అయితే వీరిద్దరు పెవిలియన్‌ బాట పట్టడంతో స్కోర్‌ బోర్డ్‌ ఒక్కసారిగా నెమ్మించింది.

ఇక బెంగళూరు బౌలింగ్‌ విషయానికొస్తే.. మహ్మద్‌ సిరాజ్‌, హేజిల్‌వుడ్, వానిందు హసరంగ, హర్షల్‌ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు బ్యాటర్లు దుమ్మురేపారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు సాధించింది. రాజత్‌ పాటిదార్‌ కేవలం 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జట్టు స్కోరు పెరగడంలో కీలక పాత్ర పోషించాడు. దినేష్‌ కార్తిక్‌ (37), విరాట్‌ కోహ్లీ (25) పరుగులు చేసి జట్టు స్కోర్‌ పెరగడంలో తమవంతు పాత్ర పోషించారు.

మరిన్ని ఐపీఎల్ కథనాల కోసం క్లిక్ చేయండి..

అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
ఉలవల బెనిఫిట్స్ తెలిస్తే ఒక్క రోజూ కూడా మిస్ చెయ్యరు
ఉలవల బెనిఫిట్స్ తెలిస్తే ఒక్క రోజూ కూడా మిస్ చెయ్యరు
మూడో కంటికి తెలియకుండా.. వారు అనుకున్నది సాధిస్తారు..!
మూడో కంటికి తెలియకుండా.. వారు అనుకున్నది సాధిస్తారు..!
చెత్త ఫీల్డింగ్‌తో నవ్వులపాలైన పాకిస్తాన్ ఫ్యూచర్ స్టార్
చెత్త ఫీల్డింగ్‌తో నవ్వులపాలైన పాకిస్తాన్ ఫ్యూచర్ స్టార్
కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! ప్రచారంలో నిజమెంత..?
కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! ప్రచారంలో నిజమెంత..?
పచ్చి గుడ్లు తాగితే ఎక్కువ బలం వస్తుందా..? అపొహలు కాదు అసలు..
పచ్చి గుడ్లు తాగితే ఎక్కువ బలం వస్తుందా..? అపొహలు కాదు అసలు..
ఎన్నో కలలు కన్నాడు.. కానీ తలనొప్పి అతని జీవితానికి శాసనం రాసింది.
ఎన్నో కలలు కన్నాడు.. కానీ తలనొప్పి అతని జీవితానికి శాసనం రాసింది.