Naveen Ul Haq: నీ ఓవరాక్షన్‌ను తట్టుకోలేకున్నాం.. ఆసియా కప్‌లో దబిడి దిబిడే.. కోహ్లీ ఎనిమీకి వార్నింగ్‌

నవీన్‌ ఉల్‌ హక్.. విరాట్‌ కోహ్లీతో గొడవ ముందుకు వరకు ఇతనెవరో కూడా చాలామందికి తెలియదు. అయితే ఎప్పుడైతే విరాట్‌తో గొడవ పెట్టుకున్నాడే నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఆఫ్గాన్‌కు చెందిన ఈ బౌలర్‌ ప్రస్తుత సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే

Naveen Ul Haq: నీ ఓవరాక్షన్‌ను తట్టుకోలేకున్నాం.. ఆసియా కప్‌లో దబిడి దిబిడే.. కోహ్లీ ఎనిమీకి వార్నింగ్‌
Lsg Vs Mi

Updated on: May 25, 2023 | 10:47 AM

నవీన్‌ ఉల్‌ హక్.. విరాట్‌ కోహ్లీతో గొడవ ముందుకు వరకు ఇతనెవరో కూడా చాలామందికి తెలియదు. అయితే ఎప్పుడైతే విరాట్‌తో గొడవ పెట్టుకున్నాడే నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఆఫ్గాన్‌కు చెందిన ఈ బౌలర్‌ ప్రస్తుత సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆట కంటే తన ఓవర్‌ యాక్షన్‌తోనే అందరి నోళ్లల్లో నానుతున్నాడు. తాజాగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో మరోసారి నవీన్‌ ఉల్‌ హక్‌ పేరు బాగా మార్మోగిపోయింది. ఈ మ్యాచ్‌లో మెరుగ్గా బౌలింగ్‌ చేసిన నవీన్‌ మొత్తం 4 వికెట్లు పడగొట్టారు. అంతా బాగానే ఉంది కానీ.. వికెట్‌ పడినప్పుడల్లా అతను చేసుకునే సెలబ్రేషన్స్‌ చాలామందికి విసుగు తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా టీమిండియా ఫ్యాన్స్‌కు అతను ఏ మాత్రం నచ్చడం లేదు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వికెట్‌ తీయగానే రెండు చెవులు మూసుకుంటూ నవీన్ ఉల్‌ హక్‌ ఇచ్చిన ఎక్స్‌ ప్రెషన్‌ చాలామందికి కోపం తెప్పించింది. తన రెండు చేతులను చెవుల దగ్గర పెట్టి వినిపించడం లేదు అన్నట్లుగా నవీన్‌ ఉల్ హక్ సైగలు చేశాడు.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత మరో రెండు వికెట్లు తీసిన సందర్భంలోనూ ఇదే తరహా ఎక్స్‌ప్రెషన్‌ ఇవ్వడం కనిపించింది. ఇది చూసిన టీమిండయా అభిమానులు.. కోహ్లితో కదా నీ వైరం.. మధ్యలో మా రోహిత్‌ ఏం చేశాడు, ‘నీ ఓవరాక్షన్‌ను తట్టుకోలేకున్నాం. రాబోయే ఆసియా కప్‌లో నీకు దబిడి దిబిడే ‘ అంటూ నవీన్‌ కు గట్టిగా వార్నింగ్‌ ఇస్తున్నారు. కాగా లక్నో వర్సెస్‌ ముంబై మ్యాచ్‌ అనంతరం కూడా నవీన్‌ను ట్రోల్‌ చేసేలా ముంబై ప్లేయర్లు షేర్‌ చేసిన ఒక పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. స్వీట్‌ మ్యాంగోస్‌ను ముందు పెట్టుకుని మాకేం వినపడట్లేదు. కనపడట్లేదు అన్న తరహాలో పోజులిచ్చారు. దీంతో ఒక్కసారిగా స్వీట్‌ మ్యాంగోస్‌ పదం ట్రెండింగ్‌లోకి వచ్చింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..