LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో.. ఏ జట్టు గెలిచినా ప్లే ఆఫ్స్‌కు ఖర్చీప్ వేసినట్లే.. రికార్డులు ఇవే..

|

May 05, 2024 | 10:25 AM

Lucknow Super Giants vs Kolkata Knight Riders, 54th Match: ఈ సీజన్‌లో లక్నో జట్టు అద్భుత ప్రదర్శన చేసి 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించి మూడో స్థానంలో ఉంది. మరోవైపు, కోల్‌కతా నైట్ రైడర్స్ రెండవ స్థానంలో ఉంది. కోల్‌కతా తమ చివరి మ్యాచ్‌లో ఆ జట్టు లక్ష్యాన్ని కాపాడుకుంటూ ముంబై ఇండియన్స్‌ను అద్భుతంగా ఓడించింది. KKR 10 మ్యాచ్‌లలో 7 విజయాలతో 14 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది.

LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో.. ఏ జట్టు గెలిచినా ప్లే ఆఫ్స్‌కు ఖర్చీప్ వేసినట్లే.. రికార్డులు ఇవే..
Lsg Vs Kkr Preview
Follow us on

LSG vs KKR: ఐపీఎల్ 2024 (IPL 2024) సీజన్‌లో 54వ మ్యాచ్ ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో జరగనుంది. గత మ్యాచ్‌లో కోల్‌కతాతో జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి లక్నో జట్టు సిద్ధంగా ఉంది. అదే సమయంలో ముంబైని స్వదేశంలో ఓడించిన KKR జట్టు ఇప్పుడు ప్లేఆఫ్‌కు చేరుకోవాలని కోరుకుంటుంది. IPL 2024 సీజన్‌లో ఇప్పటివరకు కేకేఆర్ జట్టు పదికి ఏడు విజయాలు నమోదు చేసింది. రాహుల్ సారథ్యంలోని లక్నో జట్టు 10 మ్యాచ్‌ల్లో 6 గెలిచి మూడో స్థానంలో ఉంది.

ఈ సీజన్‌లో లక్నో జట్టు అద్భుత ప్రదర్శన చేసి 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించి మూడో స్థానంలో ఉంది. మరోవైపు, కోల్‌కతా నైట్ రైడర్స్ రెండవ స్థానంలో ఉంది. కోల్‌కతా తమ చివరి మ్యాచ్‌లో ఆ జట్టు లక్ష్యాన్ని కాపాడుకుంటూ ముంబై ఇండియన్స్‌ను అద్భుతంగా ఓడించింది. KKR 10 మ్యాచ్‌లలో 7 విజయాలతో 14 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది.

కేకేఆర్‌పై లక్నోదే పైచేయి..

మొత్తంమీద, లక్నో సూపర్ జెయింట్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (2022-24) మధ్య మొత్తం 4 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో కోల్‌కతాపై లక్నోకు ఏకపక్ష రికార్డు ఉంది. లక్నో మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, కోల్‌కతా ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. కోల్‌కతా ఈ సీజన్‌లో లక్నోపై తొలి విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

ఇరుజట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ 11..

కోల్‌కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్ (కీపర్), సునీల్ నరైన్, శ్రేయాస్ అయ్యర్ (కీపర్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.

లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్, కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్.

ఇరుజట్లు:

లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్, యశ్ మిత్ ఠాకూర్, ఎ. , మార్క్ వుడ్, మయాంక్ యాదవ్ మరియు మొహ్సిన్ ఖాన్, శివమ్ మావి, ఎం సిద్దార్థ్, డేవిడ్ విల్లీ, అష్టన్ టర్నర్, అర్షిన్ కులకర్ణి, అర్షద్ ఖాన్.

కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, రహమానుల్లా గుర్బాజ్, జాసన్ రాయ్, అనుకుల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, మనీష్ పాండే, మిచెల్ స్టార్క్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, కేఎస్ భరత్, వెంకటేష్ అయ్యర్, కేఎస్ భరత్, చేతన్ సకరియా, చేతన్ సకయ్య శర్మ, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, గుస్ అట్కిన్సన్, వైభవ్ అరోరా మరియు వరుణ్ చక్రవర్తి, షకీబ్ హుస్సేన్, రమణదీప్ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..