కోహ్లీ..నువ్వు గ్రేట్ బ్రదర్- స్మిత్
లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యక్తిత్వాన్ని ఆస్ట్రేలియా ఫ్లేయర్ స్టీవ్‌స్మిత్ మెచ్చుకున్నాడు. ఈనెల 9న భారత్ వర్సెస్ ఆసీస్ మ్యాచ్‌లో టీమిండియా అభిమానులు స్మిత్‌ను ఉద్దేశించి ‘ఛీటర్’..ఛీటర్’ అంటూ గేలి చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్బంగా కోహ్లీ..భారత అభిమానులపై అసహనం వ్యక్తం చేశాడు. అతడిని ఎంకరేజ్ చెయ్యమని సైగ చేశాడు. దీంతో అభిమానులు స్మిత్‌ను వెక్కిరించడం మానేశారు. తర్వాత కొద్దిసేపటికే స్మిత్, కోహ్లీ కరచాలనం చేస్తూ స్టేడియాన్ని వీడారు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మీడియా […]
లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యక్తిత్వాన్ని ఆస్ట్రేలియా ఫ్లేయర్ స్టీవ్‌స్మిత్ మెచ్చుకున్నాడు. ఈనెల 9న భారత్ వర్సెస్ ఆసీస్ మ్యాచ్‌లో టీమిండియా అభిమానులు స్మిత్‌ను ఉద్దేశించి ‘ఛీటర్’..ఛీటర్’ అంటూ గేలి చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్బంగా కోహ్లీ..భారత అభిమానులపై అసహనం వ్యక్తం చేశాడు. అతడిని ఎంకరేజ్ చెయ్యమని సైగ చేశాడు. దీంతో అభిమానులు స్మిత్‌ను వెక్కిరించడం మానేశారు. తర్వాత కొద్దిసేపటికే స్మిత్, కోహ్లీ కరచాలనం చేస్తూ స్టేడియాన్ని వీడారు.
మ్యాచ్ అనంతరం కోహ్లీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీమిండియా అభిమానుల తరఫున ఆసీస్ బ్యాట్స్‌మన్‌కు క్షమాపణలు చెప్పాడు. ఈ విషయంపై స్పందించిన ఆసీస్ బ్యాట్స్‌మన్ సోమవారం ఆ దేశ మీడియాతో మాట్లాడుతూ కోహ్లీ వ్యక్తిత్వాన్ని మెచ్చుకున్నాడు.
‘ఆ సమయంలో కోహ్లీ ప్రదర్శించిన తీరు అద్భుతం.. నిజం చెప్పాలంటే అభిమానులు ఏమనుకున్నా నేను పట్టించుకోను. ఆ విషయాన్ని నేను పూర్తిగా మర్చిపోతున్నా’ అని స్మిత్ పేర్కొన్నాడు. బాల్ టాంపరింగ్ తర్వాత ఏడాది పాటు ఆటకు దూరమైన స్మిత్ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆడేందుకు నేరుగా ప్రపంచకపలో అడుగుపెట్టాడు.