పసికూనపై జాలిచూపని మోర్గాన్… ఏకంగా 17 సిక్సులు!

ఐసీసీ ప్రపంచకప్ 2019లో భాగంగా ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా ఆఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. అఫ్గానిస్థాన్ బౌలర్లకు తన బ్యాటింగ్‌తో చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో 17 సిక్సులు బాది వన్డేల చరిత్రలో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా నిలిచాడు. 71 బంతుల్లో 17 సిక్సులు, 4 ఫోర్లతో 148 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర వహించాడు. గతంలో ఈ రికార్డు సౌతాఫ్రికా […]

పసికూనపై జాలిచూపని మోర్గాన్... ఏకంగా 17 సిక్సులు!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 18, 2019 | 9:35 PM

ఐసీసీ ప్రపంచకప్ 2019లో భాగంగా ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా ఆఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. అఫ్గానిస్థాన్ బౌలర్లకు తన బ్యాటింగ్‌తో చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో 17 సిక్సులు బాది వన్డేల చరిత్రలో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా నిలిచాడు. 71 బంతుల్లో 17 సిక్సులు, 4 ఫోర్లతో 148 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర వహించాడు. గతంలో ఈ రికార్డు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ పేరిట ఉండేది. వెస్టిండీస్‌తో మ్యచ్‌లో 16 సిక్సులు కొట్టి 149 పరుగులు సాధించాడు. ఆ తర్వాత క్రిస్ గేల్ 2015 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై 16 సిక్సులు బాది తన కెరీర్‌లో ఉత్తమ స్కోర్ 215 పరుగలు సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో మోర్గాన్ 17 సిక్సులు బాది ఈ రికార్డును తిరగరాశాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఓపెనర్ జానీ బెయిర్ స్టో శుభారంభం అందించాడు. 99 బంతుల్లో 90 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో మోర్గన్, జో రూట్‌ల జోడీ అండగా నిలిచింది. మూడో వికెట్‌కి వీరిద్దరు 189 పరుగులు జోడించారు. దీంతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది. అఫ్గాన్ బౌలింగ్‌లో దవ్లత్ జార్దన్, గుల్బదిన్ నైబ్ లకు చెరో మూడు వికెట్లు లభించాయి.