AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి లీగ్ ‌రా సామీ.. టీంలోకి ఎంట్రీ అవ్వాలంటే అవి ఉండాల్సిందే.. ఆ వింత కండీషన్‌ ఏంటంటే?

Lanka Premier League 2026: క్రికెట్ మైదానంలో ఆటగాడి ప్రతిభను బట్టి అవకాశాలు రావడం సాధారణం. కానీ, లంక ప్రీమియర్ లీగ్ (LPL) ఆరో సీజన్ కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు అత్యంత వింతైన నిబంధనలను తెరపైకి తెచ్చింది. ఇకపై ఆటగాళ్లు కేవలం బ్యాటు, బంతితో రాణిస్తే సరిపోదు.. సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్లు, అంతర్జాతీయ స్థాయిలో నిర్దిష్టమైన అనుభవం ఉంటేనే ఈ లీగ్‌లో ఆడేందుకు అర్హత లభిస్తుంది.

ఇదెక్కడి లీగ్ ‌రా సామీ.. టీంలోకి ఎంట్రీ అవ్వాలంటే అవి ఉండాల్సిందే.. ఆ వింత కండీషన్‌ ఏంటంటే?
Lanka Premier League 2026
Venkata Chari
|

Updated on: May 09, 2026 | 5:12 PM

Share

Lanka Premier League 2026: సాధారణంగా ఫ్రాంచైజీ క్రికెట్ అంటేనే గ్లామర్, వ్యాపారంతో కూడుకున్న వ్యవహారం. అయితే, లంక ప్రీమియర్ లీగ్ దీనిని మరో స్థాయికి తీసుకెళ్లింది. కొత్త నిబంధనల ప్రకారం, విదేశీ ఆటగాళ్లు ‘స్టార్’ కేటగిరీలో చోటు సంపాదించాలంటే వారికి సామాజిక మాధ్యమ వేదికైన ఇన్‌స్టాగ్రామ్‌లో కనీసం 2.50 లక్షల మంది ఫాలోవర్లు ఉండాలి. ఆటగాళ్ల మార్కెటింగ్ విలువను పెంచడానికి, లీగ్ ప్రజాదరణను ప్రపంచవ్యాప్తంగా చాటడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

కఠినమైన క్రికెట్ నిబంధనలు..

కేవలం సోషల్ మీడియా మాత్రమే కాకుండా, మైదానంలోనూ ఆటగాళ్లకు కఠినమైన అర్హత ప్రమాణాలను విధించారు. అత్యున్నత స్థాయి ‘ఐకాన్’ విభాగంలో చేరాలంటే సదరు విదేశీ ఆటగాడు కనీసం 85 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడి ఉండాలి. దాంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగ్‌లలో కలిపి 100 కంటే ఎక్కువ మ్యాచ్‌ల అనుభవం ఉండాలి. అంతేకాకుండా, గత 18 నెలల కాలంలో కనీసం 30 మ్యాచ్‌లు ఆడి ఉండాలనే నిబంధన కూడా ఉంది. ఇది విదేశీ సీనియర్ ఆటగాళ్లకు పెద్ద సవాలుగా మారనుంది.

ఆటగాళ్ల జీతాల వివరాలు..

ఈ లీగ్‌లో ఎంపికయ్యే ఆటగాళ్లకు భారీగానే పారితోషికం అందనుంది. ఐకాన్, స్టార్ విభాగంలో ఉన్న ఆటగాళ్లకు సుమారు 60 నుంచి 80 వేల అమెరికన్ డాలర్ల వరకు చెల్లించనున్నారు. ప్లాటినం కేటగిరీ ఆటగాళ్లకు 50 వేల డాలర్లు, గోల్డ్ కేటగిరీ వారికి 30 వేల డాలర్లు, క్లాసిక్ విభాగం ఆటగాళ్లకు 20 వేల డాలర్లు ఒక సీజన్ కోసం లభించనున్నాయి. భారీ వేతనాలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, వింత నిబంధనలు ఆటగాళ్లను ఆలోచనలో పడేశాయి.

విమర్శల వెల్లువ..

శ్రీలంక క్రికెట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపై క్రీడా విశ్లేషకులు మండిపడుతున్నారు. ప్రతిభ కంటే సామాజిక మాధ్యమాల్లోని ప్రజాదరణకు ప్రాధాన్యత ఇవ్వడం క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధమని వారు భావిస్తున్నారు. ఇటువంటి నిబంధనల వల్ల నాణ్యమైన ఆటగాళ్లు ఈ లీగ్‌కు దూరమయ్యే ప్రమాదం ఉందని, కేవలం ప్రచారం కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం లీగ్ నాణ్యతను దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో ఈ నిబంధనలు ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తాయో వేచి చూడాలి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
ఇదెక్కడి లీగ్ ‌రా సామీ.. టీంలోకి ఎంట్రీ అవ్వాలంటే అవి ఉండాల్సిందే
ఇదెక్కడి లీగ్ ‌రా సామీ.. టీంలోకి ఎంట్రీ అవ్వాలంటే అవి ఉండాల్సిందే
చెప్పుకోండి చూద్దాం.. ఈ బండ రాళ్ల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా?
చెప్పుకోండి చూద్దాం.. ఈ బండ రాళ్ల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా?
వర్కౌట్ల విషయంలో పీవీ సింధు చెబుతున్న జాగ్రత్తలివే
వర్కౌట్ల విషయంలో పీవీ సింధు చెబుతున్న జాగ్రత్తలివే
తండ్రి కాబోయే పురుషుల్లో వచ్చే ‘డాడ్ బ్రెయిన్’ మార్పులు
తండ్రి కాబోయే పురుషుల్లో వచ్చే ‘డాడ్ బ్రెయిన్’ మార్పులు
పచ్చి పల్లీలు వర్సెస్ వేయించిన పల్లీలు.. ఏవి తినడం బెస్ట్..
పచ్చి పల్లీలు వర్సెస్ వేయించిన పల్లీలు.. ఏవి తినడం బెస్ట్..
అపర ఏకాదశి మే 12నా 13నా? సరైన తేది తెలుసుకోండి.. ఇలా చేస్తే..
అపర ఏకాదశి మే 12నా 13నా? సరైన తేది తెలుసుకోండి.. ఇలా చేస్తే..
సూర్యకు షాక్.. టీమిండియా టీ20 కొత్త సారథిగా ఎవరంటే?
సూర్యకు షాక్.. టీమిండియా టీ20 కొత్త సారథిగా ఎవరంటే?
టీవీకేకు మద్దతు పలికిన వీసీకే.. విజయ్‌కు లైన్ ‌క్లియర్!
టీవీకేకు మద్దతు పలికిన వీసీకే.. విజయ్‌కు లైన్ ‌క్లియర్!
మీరెలా స్టార్స్ అవుతారు..? డబ్బులిచ్చి కొంటున్నారు..
మీరెలా స్టార్స్ అవుతారు..? డబ్బులిచ్చి కొంటున్నారు..
మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా..? లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే..
మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా..? లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే..