Video: లైవ్ మ్యాచ్‌లో రింకూపై కుల్దీప్ షడన్ ఎటాక్.. చెంపలు చెళ్లుమనింపించిన చైనామన్.. కట్‌చేస్తే

Kuldeep Yadav Slaps Rinku Singh: రింకు సింగ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 36 పరుగులు చేశాడు. మిడిల్ ఓవర్లలో కుల్దీప్ దాడిని తగ్గించడంలో రింకూ తన జట్టుకు సహాయం చేశాడు. 11వ ఓవర్లో కుల్దీప్ బౌలింగ్‌లో రింకు ఫోర్ కొట్టాడు. ఇక15వ ఓవర్లో కుల్దీప్ దారుణంగా ఓడిపోయాడు. రింకు అతని బౌలింగ్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి, చైనామన్‌ బౌలింగ్‌లో 17 పరుగులు రాబట్టాడు.

Video: లైవ్ మ్యాచ్‌లో రింకూపై కుల్దీప్ షడన్ ఎటాక్.. చెంపలు చెళ్లుమనింపించిన చైనామన్.. కట్‌చేస్తే
Kuldeep Yadav Slaps Rinku Singh

Updated on: Apr 30, 2025 | 11:22 AM

Kuldeep Yadav Slaps Rinku Singh: కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ మైదానం మధ్యలో రింకు సింగ్‌ను రెండుసార్లు చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఐపీఎల్ 2025 (IPL 2025) లో 48 వ మ్యాచ్ ఢిల్లీ వర్సెస్ కోల్‌కతా మధ్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 14 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించింది. ఈ మ్యాచ్ తర్వాత, కోల్‌కతాకు చెందిన రింకు, ఢిల్లీకి చెందిన కుల్దీప్ మైదానంలో మాట్లాడుకుంటూ కనిపించారు. ఇంతలో భారత స్టార్ కుల్దీప్ అకస్మాత్తుగా రింకును చెంపదెబ్బ కొట్టాడు. దీంతో రింకూ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ తర్వాత కోపంగా కనిపించాడు. వీరిద్దరి వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

మొదట ఇద్దరూ నవ్వుతూ కనిపించారు. ఈ క్రమంలో కుల్దీప్ రింకూ సింగ్‌ను తొలి చెంపదెబ్బ కొట్టాడు. ఆ తర్వాత కుల్దీప్ మాటలు విన్న రింకు స్పందన అకస్మాత్తుగా మారిపోయింది. రింకూ ముఖం నుంచి చిరునవ్వు మాయమైంది. కొన్ని సెకన్ల తర్వాత, కుల్దీప్ మళ్ళీ రింకు చెంపపై కొట్టాడు. ఆ తర్వాత అతను కుల్దీప్‌తో ఏదో తీవ్రమైన విషయం గురించి మాట్లాడుతున్నట్లు కనిపించాడు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ అంత సీరియస్‌గా లేకపోయినా, ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, చాలా మందికి ఐపీఎల్ మొదటి సీజన్‌ను గుర్తుకు వచ్చేలా చేసింది. 2008లో హర్భజన్ సింగ్ మైదానంలో కోపంతో శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

రింకు, కుల్దీప్ ప్రదర్శన..

అంతకుముందు, రింకు సింగ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 36 పరుగులు చేశాడు. మిడిల్ ఓవర్లలో కుల్దీప్ దాడిని తగ్గించడంలో రింకూ తన జట్టుకు సహాయం చేశాడు. 11వ ఓవర్లో కుల్దీప్ బౌలింగ్‌లో రింకు ఫోర్ కొట్టాడు. ఇక15వ ఓవర్లో కుల్దీప్ దారుణంగా ఓడిపోయాడు. రింకు అతని బౌలింగ్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి, చైనామన్‌ బౌలింగ్‌లో 17 పరుగులు రాబట్టాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ స్లాగ్ ఓవర్లలో కుల్దీప్‌ను దాడికి తీసుకురావడంలో రిస్క్ తీసుకోలేదు. అతను మూడు ఓవర్లలో 27 పరుగులు ఇచ్చాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 9 వికెట్లకు 204 పరుగులు చేయగా, ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు మాత్రమే చేయగలిగింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..