IND vs WI : కుల్‌దీప్ మ్యాజిక్..రెండో టెస్ట్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతనే..మరి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎవరంటే ?
భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఢిల్లీలో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తన స్పిన్ మాయాజాలంతో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసిన బౌలర్ కుల్‌దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.

IND vs WI : భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఢిల్లీలో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తన స్పిన్ మాయాజాలంతో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసిన బౌలర్ కుల్‌దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఇక ఈ సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు.
ఢిల్లీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ, స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌ను తన మాయాజాలంతో కట్టడి చేశాడు. కుల్‌దీప్ వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 5 కీలక వికెట్లు (అలీక్ అథనాజే, షై హోప్, తెవిన్ ఇంలాచ్, జస్టిన్ గ్రీవ్స్‌తో సహా) పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా అతను రోస్టన్ చేజ్, తెవిన్ ఇంలాచ్, ఖారీ పియర్‌లను అవుట్ చేసి 3 వికెట్లు తీసుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో 8 వికెట్లు తీసినందుకుగాను కుల్‌దీప్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ఈ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చినందుకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. తొలి టెస్ట్‌లో సెంచరీ (100)తో రాణించిన జడేజా, వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఢిల్లీ టెస్ట్‌లో జడేజాకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ, బౌలింగ్‌లో మాత్రం తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 1 వికెట్ తీసి, తన ప్రభావవంతమైన ప్రదర్శనను కొనసాగించాడు.
రెండో టెస్ట్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి, 5 వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 22 ఫోర్లతో 175 పరుగులు చేసి అద్భుతంగా ఆడాడు. ఆ తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అజేయంగా సెంచరీ సాధించాడు. కెప్టెన్‌గా గిల్‌కు ఇది 5వ టెస్ట్ సెంచరీ. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకే ఆలౌట్ అయింది.
ఫాలోఆన్ ఆడిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో బాగా పోరాడింది. ఓపెనర్లు జాన్ కాంప్‌బెల్ (115 పరుగులు), షై హోప్ (103 పరుగులు) సెంచరీలు సాధించడంతో జట్టు 390 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు గెలవడానికి 121 పరుగుల లక్ష్యం లభించింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేఎల్ రాహుల్ అద్భుతమైన హాఫ్ సెంచరీ (58 నాటౌట్) చేసి, 378 రోజుల తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు తొలి టెస్ట్ సిరీస్ విజయాన్ని అందించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




