23 బంతుల్లో 106 పరుగులు.. 6గురి బౌలర్ల ఊచకోత.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన కోహ్లీ టీమ్‌మేట్.. ఎవరో తెలుసా!

|

Dec 14, 2021 | 6:48 PM

దేశీయ యువ ఆటగాళ్లు ప్రస్తుతం జరుగుతోన్న విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతమైన ఫామ్‌తో దుమ్ములేపుతున్నారు. వారిలో కెఎస్ భరత్ ఒకరు.

23 బంతుల్లో 106 పరుగులు.. 6గురి బౌలర్ల ఊచకోత.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన కోహ్లీ టీమ్‌మేట్.. ఎవరో తెలుసా!
Cricket
Follow us on

దేశీయ యువ ఆటగాళ్లు ప్రస్తుతం జరుగుతోన్న విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతమైన ఫామ్‌తో దుమ్ములేపుతున్నారు. వారిలో కెఎస్ భరత్ ఒకరు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సభ్యుడైన భరత్.. ఈ టోర్నీలో ఆంధ్రా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అవసరమైనప్పుడు తన బ్యాట్‌కు పనిచెప్పి అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. రెండు రోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్ జట్టుపై అజేయ సెంచరీ సాధించిన భరత్.. తాజాగా గుజరాత్‌పై చెలరేగిపోయాడు. బౌండరీల రూపంలో కేవలం 23 బంతుల్లోనే సెంచరీ చేశాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 253 పరుగులు చేసింది. మొదట్లో ఆంధ్రా జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే వన్ డౌన్‌లో బరిలోకి దిగిన భరత్(156) మూడో వికెట్‌కు అర్ధసెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్ నుంచి అద్భుతమైన షాట్స్‌తో శ్రీకర్ భరత్ అలరించాడు. ఈ క్రమంలోనే మూడంకెల స్కోర్‌ను సాధించాడు.

కెఎస్ భరత్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ..
138 బంతుల్లో 16 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో శ్రీకర్ భరత్ 156 పరుగులు చేశాడు. అంటే కేవలం 23 బంతుల్లోనే బౌండరీల రూపంలో 106 పరుగులు సాధించాడని చెప్పొచ్చు. విజయ్ హజారే ట్రోఫీలో కెఎస్ భరత్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ. అంతకుముందు, హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 161 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇదిలా ఉంటే.. శ్రీకర్ భరత్ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన కెఎస్ భరత్ 2 సెంచరీలతో 370 పరుగులు చేశాడు.

Also Read:

4 మ్యాచ్‌లు, 3 సెంచరీలు, 435 పరుగులు.. దుమ్మురేపిన ధోని శిష్యుడు.. వన్డేల్లోకి ఎంట్రీ.?

మన కరెన్సీ నోట్లపై నల్లటి గీతలు మీరెప్పుడైనా చూశారా.? అవి ఎందుకో ఆలోచించారా.!

ఈ ఫోటోలోని చిన్నారి ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.. ఎవరో గుర్తుపట్టారా.!

మీరు ఈ పజిల్ సాల్వ్ చేస్తే.. మీకంటే తోపు ఎవ్వరూ లేరు.. ట్రై చేయండి!