
IPL 2025 KKR vs PBKS: ఐపీఎల్ 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ (KKR vs PBKS) మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఏప్రిల్ 26, శనివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఆతిథ్య నైట్ రైడర్స్‌పై భారీ స్కోరు నమోదు చేసింది. కానీ, కోల్‌కతా ఇన్నింగ్స్ ప్రారంభమైన వెంటనే వర్షం మొదలైంది. దాదాపు గంటన్నర పాటు వేచి చూసిన అంపైర్లు.. చివరికి మ్యాచ్‌ను రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సీజన్‌లో మ్యాచ్ రద్దు కావడం ఇదే తొలిసారి.
ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో, ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ తరపున తొలి సీజన్ ఆడుతున్న ప్రియాంష్ ఆర్య (69 పరుగులు) తుఫాన్ బ్యాటింగ్‌తో మరోసారి శుభారంభం అందించాడు. పవర్‌ప్లేలో ప్రియాంష్, ప్రభ్‌సిమ్రాన్ జట్టుకు అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని అందించారు. ప్రియాంష్ కేవలం 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఈ సీజన్‌లో ఇది రెండోసారి 50 పరుగుల మార్కును దాటాడు.
మరోవైపు, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కూడా అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రియాంష్ అవుట్ అయ్యే సమయానికి 11.5 ఓవర్లలో ఇద్దరి మధ్య 120 పరుగుల భాగస్వామ్యం ఉంది. ఆ తర్వాత, ప్రభ్‌సిమ్రాన్ 83 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరి బ్యాటింగ్ ఆధారంగా పంజాబ్ 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది.
Match 4⃣4⃣ between @KKRiders and @PunjabKingsIPL has been called off due to rain 🌧️
Both teams share a point each! #TATAIPL | #KKRvPBKS pic.twitter.com/mEX2eETWgh
— IndianPremierLeague (@IPL) April 26, 2025
చేధనలో కోల్‌కతా ఇన్నింగ్స్ మొదటి ఓవర్ తర్వాత అకస్మాత్తుగా వర్షం పడటం ప్రారంభమైంది. వర్షం ఒక్కసారి మొదలై, ఎంతకీ ఆగలేదు. చివరికి, రాత్రి 11 గంటల ప్రాంతంలో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో రెండు జట్లు పాయింట్లను పంచుకోవాల్సి వచ్చింది.
మ్యాచ్ రద్దు కావడంతో పంజాబ్ కింగ్స్ జట్టు ఖాతాలో ఓ పాయింట్ చేరింది. మొత్తంగా 11 పాయింట్లతో ఐదవ స్థానం నుంచి నాల్గవ స్థానానికి ఎగబాకింది. కానీ, కోల్‌కతా ఇప్పటికీ 7 పాయింట్లతో 7వ స్థానంలోనే ఉంది. ప్లేఆఫ్ రేసులో ఇప్పటికే వెనుకబడి ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్, ఇప్పుడు ఏ విధంగానైనా మిగిలిన 5 మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సి ఉంటుంది. అప్పుడే కోల్‌కతా జట్టు ప్లేఆఫ్‌కు చేరుకోగలదు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..