IPL 2023: ఐపీఎల్ 2023 షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రాబోయే సీజన్ కోసం జట్లు ఇప్పటికే తమ సన్నాహాలను ప్రారంభించాయి. 16వ సీజన్‌లో పది జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది. ఇందు కోసం అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. కోచింగ్ స్టాఫ్‌తో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆటగాళ్లు కూడా సన్నాహాలు ప్రారంభించారు. ఇంతలో జట్టు ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్ విజయం సాధించడానికి చెప్పిన మూడు మంత్రాలు వైరల్‌గా మారాయి. ఈ వీడియోను ఫ్రాంచైజీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.
IPL 2023 కోసం KKR వారి ప్రధాన కోచ్‌గా చంద్రకాంత్ పండిట్‌ని నియమించిన సంగతి తెలిసిందే. అతని కంటే ముందు, బ్రెండన్ మెకల్లమ్ జట్టుకు కోచ్‌గా ఉండేవాడు. అయితే గత సంవత్సరం అతనిని ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్‌గా నియమించింది. ఈ కారణంగా, పండిట్ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్న కేకేఆర్.. అతనికి ఈ బాధ్యతలను అప్పగించింది. ఇదిలావుండగా, 16వ సీజన్‌కు సన్నాహకంగా ప్రాక్టీస్ చేయడానికి KKR జట్టులోని కొంతమంది ఆటగాళ్లు వారి సొంత మైదానంలో సమావేశమయ్యారు. ఈ సమయంలో, ఒక వ్యక్తి కోచ్ చందును శిక్షణలో భాగంగా మా ఆటగాళ్లకు ఏవైనా చిట్కాలు చెప్తారా? అంటూ ఓ ప్రశ్న అడిగారు. అందుకు సమాధానంగా ఆయన మూడు విషయాలు చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా మూడు విషయాలు ఉన్నాయి. అవేంటంటే సంప్రదాయం, ప్రతిష్ట, క్రమశిక్షణ అంటూ ఆన్సర్ చేశాడు. కేకేఆర్ కోచ్ చందు అమితాబ్ బచ్చన్ ‘మొహబ్బతే’ సినిమాలోని డైలాగ్స్‌ను చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా రెండుసార్లు టైటిల్ గెలుచుకుంది. 16వ సీజన్‌లో జట్టు కమాండ్ మరోసారి శ్రేయాస్ అయ్యర్ చేతుల్లోకి వెళ్లనుంది. ఐపీఎల్ 2022లో ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. రాబోయే సీజన్‌లో, శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్‌తో ఢీకొంటుంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ ఏప్రిల్ 1న మొహాలీలో జరగనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..