
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 242 పరుగుల టార్గెట్‌ను 4 వికెట్లు కోల్పోయి కేవలం 42.3 ఓవర్లలోనే ఊదిపారేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ను టీమిండియా బౌలర్లు అద్బుతంగా కట్టడి చేశారు. ఆ తర్వాత ఛేజింగ్‌ను ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ చూసుకున్నాడు. శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ మంచి సపోర్ట్ అందించారు. ఓవరాల్‌గా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా వరుసగా రెండో విజయంతో గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచి.. దాదాపు సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. అయితే పాకిస్థాన్‌పై మ్యాచ్ గెలవడం కంటే కూడా విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడా లేదా అని చాలా మంది క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు.
ఎట్టకేలకు విజయానికి 2 పరుగులు, తన సెంచరీకి 4 పరుగులు అవసరమైన దశలో ముందుకొచ్చి, ఎక్స్‌ట్రా కవర్స్‌లోకి సూపర్ షాట్‌తో కోహ్లీ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే.. ఈ సెంచరీ చేయడానికి ముందు, పాకిస్థాన్‌తో మ్యాచ్‌కి ఒక రోజు ముందు విరాట్ కోహ్లీ ఎంత కష్టపడ్డాడో తెలిస్తే అతని సెంచరీ విలువ అర్థం అవుతుంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కి ముందు శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో టీమిండియాకు ప్రాక్టీస్ సెషన్ ఉంది. ఆటగాళ్లంతా ఆ టైమ్‌కే అక్కడి వస్తారు. కానీ, విరాట్ కోహ్లీ మాత్రం.. ఓ ఐదున్నర గంట ముందే కొంతమంది సపోర్టింగ్ స్టాఫ్‌తో అక్కడి చేరుకొని నెట్స్‌లో ఒక్కడే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. 4 గంటలకు టైమ్ ఇస్తే.. 10.30కే వెళ్లిపోయి ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఇప్పటికే కొన్ని వేల పరుగుల, 81 అంతర్జాతీయ సెంచరీలు సాధించినా కూడా కోహ్లీ డెడికేషన్ ఏం రేంజ్‌లో ఉందో ఈ ఒక్క సంఘటనతో అర్థం చేసుకోవచ్చు.
గత కొన్ని మ్యాచ్‌ల్లో తన రేంజ్ బిగ్ స్కోర్ రాలేదనే కసి కూడా కోహ్లీలో ఉంది. అందుకే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఎలాగైనా సరే పెద్ద స్కోర్ చేయాలని, అందుకోసం తన బలహీనతలపై ముందు వర్క్ చేయాలని భావించి.. దాదాపు ఓ 7 గంటల పాటు నెట్స్‌లో చెమలు చిందించాడు. దానికి ఫలితమే పాకిస్థాన్‌పై సెంచరీ, టీమిండియాకు ఈజీ విక్టరీ. గ్రౌండ్‌లో పాక్‌పై కోహ్లీ ఆటను, సెంచరీని అంతా సెలబ్రేట్ చేసుకున్నారు. ఎందుకంటే అది అందరికీ కనిపిస్తుంది. కానీ, దాని కోసం కోహ్లీ పడిన కష్టం మాత్రం అతనికొక్కడికే తెలుసు. అంత కష్టపడతాడు కాబట్టే ఇంత గొప్ప ప్లేయర్ అయ్యాడు. ఊరికే అయిపోతారా ఏంటి గొప్ప గొప్ప ఆటగాళ్లు అంటూ ఈ విషయం తెలిసిన నెటిజన్లు అంటున్నారు. పాక్‌పై సెంచరీతో వన్డేల్లో 51వ, ఓవర్‌గా 82వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు కింగ్ కోహ్లీ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.