AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: పంత్‌ ఎంట్రీతో రెండు చేతులెత్తి దండం పెట్టిన కేఎల్ రాహుల్.. గంభీర్ ఏం చేశాడో తెలుసా?

Rishabh Pant vs KL Rahul: ఈ మ్యాచ్‌లో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 359/3 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది. శుభమన్ గిల్, రిషబ్ పంత్ రెండో రోజు ఆటను కొనసాగించనున్నారు. ఈ ఇద్దరి ప్రదర్శనపైనే మ్యాచ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

Video: పంత్‌ ఎంట్రీతో రెండు చేతులెత్తి దండం పెట్టిన కేఎల్ రాహుల్.. గంభీర్ ఏం చేశాడో తెలుసా?
Kl Rahul Rishabh Pant Video
Venkata Chari
|

Updated on: Jun 21, 2025 | 12:07 PM

Share

England vs India, 1st Test: భారత్, ఇంగ్లాండ్‌ల మధ్య లీడ్స్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసిన తర్వాత భారత డ్రెస్సింగ్ రూమ్‌లో చోటు చేసుకున్న ఒక దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి నాటౌట్‌గా నిలిచిన రిషబ్ పంత్, శుభమన్ గిల్‌లకు జట్టు సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సమయంలో, సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ముందు చేతులు జోడించి, వినయంగా తల వంచి నమస్కరించడం అందరి దృష్టినీ ఆకర్షించింది.

లీడ్స్ టెస్ట్ మొదటి రోజు ఆటలో భారత యువ కెప్టెన్ శుభమన్ గిల్ (127 నాటౌట్), వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ (65 నాటౌట్) అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును పటిష్ట స్థితిలో నిలబెట్టారు. ముఖ్యంగా, పంత్ తన దూకుడుతో పాటు పరిణతితో కూడిన ఆటను ప్రదర్శించాడు. అతను క్రీజులోకి వచ్చిన తర్వాత ఆట గతిని మార్చి, ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు.

ఇవి కూడా చదవండి

తొలిరోజు ఆట ముగిసిన తర్వాత శుభమన్ గిల్, రిషబ్ పంత్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి తిరిగి వస్తుండగా, సహచర ఆటగాళ్లు వారిని ఉత్సాహంగా అభినందించారు. ఈ క్రమంలో, కేఎల్ రాహుల్, డ్రెస్సింగ్ రూమ్ ప్రవేశ ద్వారం వద్ద నిలబడి, పంత్‌కు చేతులు జోడించి, తలవంచి గౌరవం చూపించాడు. పంత్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్‌కు ఇది కేఎల్ రాహుల్ ప్రశంసగా భావిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతూ, అభిమానులను ఆకట్టుకుంటోంది. కేఎల్ రాహుల్ చేసిన ఈ వినయపూర్వకమైన చర్యపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది జట్టులో ఆటగాళ్ల మధ్య ఉన్న సత్సంబంధాలకు నిదర్శనమని కొందరు అభిప్రాయపడుతున్నారు.

చివరి ఓవర్‌లో అద్భుతాలు..

చివరి సెషన్‌లో పంత్ వచ్చి ఆట ఊపును మార్చాడు. వేగంగా పరుగులు చేశాడు. పంత్ 91 బంతుల్లో 65 పరుగులు చేశాడు. అందులో రెండు సిక్సర్లు, ఏడు ఫోర్లు ఉన్నాయి. రాహుల్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతను 78 బంతుల్లో 42 పరుగులు చేసి మొదటి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 359/3 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది. శుభమన్ గిల్, రిషబ్ పంత్ రెండో రోజు ఆటను కొనసాగించనున్నారు. ఈ ఇద్దరి ప్రదర్శనపైనే మ్యాచ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..