ఏ క్యాహై భయ్యా.. రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్‌పై సస్పెన్స్.. గిల్ ప్లేస్‌లో ఛార్జ్ తీసుకునేది అతడే.?

India vs England 2nd Test: ఆతిథ్య ఇంగ్లీష్‌ జట్టుతో జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఘోర వైఫల్యాన్ని మూటకట్టుకుంది. చివరి రోజు చేజేతులా మ్యాచ్‌ను ఇంగ్లీష్‌ జట్టుకు సమర్పించింది. ఈ క్రమంలో చివరిదైన ఐదో రోజు ఆటలో చిత్రవిచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు అవేంటో చూద్దాం.

ఏ క్యాహై భయ్యా.. రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్‌పై సస్పెన్స్.. గిల్ ప్లేస్‌లో ఛార్జ్ తీసుకునేది అతడే.?
Ind Vs Eng 2nd Test

Updated on: Jun 25, 2025 | 3:58 PM

Team India: యువ ఆటగాళ్లతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. గెలుపు తథ్యం అనుకున్న మ్యాచ్‌ నుంచి 5 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది. దీంతో కోచ్‌ గంభీర్‌తో పాటు టీమిండియా ఆటగాళ్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలో ప్రస్తుత జట్టులో కాస్త సీనియర్‌ ఆటగాడైన కేఎల్‌ రాహుల్‌ మైదానంలో ప్రవర్తించిన తీరుకి అభిమానులు ఫిదా అయ్యారు. ఎందుకంటే.. గెలిచే మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌ తమ చేతిలోకి తీసుకుంటుంటే రాహుల్‌ చూస్తూ ఉండలేకపోయాడు. దీంతో కెప్లెన్‌ గిల్‌, వైస్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ చేయాల్సిన పనులను రాహుల్‌ తన భుజాలపై వేసుకున్నాడు. అనుభవం లేమి కారమణంలో ఫీల్డింగ్‌ సెట్‌ చేయడంలో గిల్‌, పంత్‌ విఫలమయ్యారనే చెప్పాలి. అందుకే ఈ బాధ్యతలను రాహుల్‌ తీసుకున్నాడు. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ రిటైరైన తర్వాత.. ప్రస్తుత జట్టులో రాహులే కాస్త సీనియర్‌.

రాహుల్ కెప్టెన్ అయితే..

కేఎల్‌ రాహుల్‌కి IPLలో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. దీంతో మ్యాచ్‌ చేజారిపోతుంటే చూస్తూ ఉండలేకపోయాడు. చివరిదైన ఐదో రోజు ఆట మొదటి సెషన్‌ ఎండ్‌లో రాహుల్‌ కెప్టెన్‌ అవతారం ఎత్తాడు. ఫీల్డింగ్‌ను చక్కదిద్దుతూ కనిపించాడు. అలాగే రెండో సెషన్‌ ప్రారంభంలోనూ అతడే ఫీల్డింగ్‌ సెట్‌ చేశాడు. ప్రసిద్ధ్‌కి బంతి ఇచ్చాడు. ఆ ఓవర్లోనే అతడు క్రౌలీని పెవిలియన్‌కి పంపాడు. దీంతో ఓపెనర్ల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరలయ్యాయి. ఇక్కడ కెప్టెన్‌ ఎవరో చూడండి ? గిల్‌ కాదు పంత్‌ కాదు… కొత్త కెప్టెన్‌ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

IPL అనుభవం… రెండో టెస్టుకి రాహులే కెప్టెన్‌?

జట్టులో అనుభవం ఉన్న ఆటగాడు కేఎల్‌ రాహుల్‌. అంతేకాదు అతడికి కెప్టెన్‌గా కూడా అనుభవం ఉండటంతో.. ఇంగ్లాండ్‌తో జరిగే రెండో టెస్టుకి రాహుల్‌కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని అభిమానులు కోరుతున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి