
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి శుభవార్త చెప్పారు. త్వరలో కుటుంబంలోకి కొత్త అతిథిని స్వాగతించనున్నట్లు ప్రకటించారు. గత ఏడాది జనవరిలో ముంబైలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న ఈ జంట ఇప్పుడు తమ జీవితంలోకి ఒక పండంటి బిడ్డను ఆహ్వానించనున్నారు. ప్రన్తుతం అతియా శెట్టి గర్భంతో ఉంది. త్వరలోనే తాము తల్లిదండ్రులం కానున్నట్లు రాహుల్ దంపతులు సోషల్ మీడియా ద్వారా ఈ శుభవార్తను పంచుకున్నారు. 2025లో పుట్టబోయే బిడ్డపై భగవంతుడి ఆశీస్సులు ఉండాంటూ ఈ పోస్టులో తెలిపారు కేఎల్ రాహుల్- అతియా. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు క్రికెటర్లు, సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కేఎల్ రాహుల్- అతియా శెట్టి దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. KL రాహుల్, బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. జనవరి 23న సునీల్ శెట్టి చేతుల మీదుగా ముంబయిలోని ఫామ్‌హౌస్‌లో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, సచిన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ మరియు పలువురు స్టార్ క్రికెటర్లు, సినీ తారలు ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు.
అతియా శెట్టి పెళ్లికి ముందు కొన్ని సినిమాల్లో నటించింది. అయితే అవి పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో క్రమంగా ఆమె సినిమాలకు దూరమైంది. అతియా శెట్టి చివరిగా 2019లో మోతీచూర్ చక్నాచూర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక రాహుల్ తో పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైందీ అందాల తార. కాగా రాహుల్, అతియా శెట్టి 2023 జనవరి 23న వివాహం చేసుకున్నారు. యాదృచ్ఛికంగా, ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు ముందు రాహుల్ పెళ్లి కూడా జరిగింది. ఇప్పుడు ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు రాహుల్ తన మొదటి బిడ్డ రాక గురించి అభిమానులకు చెప్పాడీ టీమిండియా క్రికెటర్.
రాహుల్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. అక్కడ అతను ఆస్ట్రేలియా A తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రాహుల్ నిరాశపరచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగులకే ఔటయిన రాహుల్ రెండో ఇన్నింగ్స్‌లో 10 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే రాహుల్ ఆస్ట్రేలియాలోనే ఉండి మరికొద్ది రోజుల్లో భారత జట్టులో చేరనున్నాడు. నిజానికి ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు రాహుల్‌ను టీమ్‌ఇండియా ఎంపిక చేసింది. అలాగే నవంబర్ 22న పెర్త్‌లో ప్రారంభమయ్యే తొలి టెస్టులో ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఎందుకంటే కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టులో ఆడడం అనుమానమే. అందుకే రాహుల్ గైర్హాజరీలో జట్టులో చోటు దక్కించుకోవచ్చని చెబుతున్నారు. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల కెప్టెన్ రోహిత్ కూడా ఈ తొలి టెస్టులో ఆడడం లేదు. అంటే రోహిత్ కూడా తన రెండో బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. అందుకే ఈసారి తన భార్య రితికాతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాడని. అందుకు తొలి టెస్టుకు దూరంగా ఉండాలని భావించాడని చెబుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ కల్ిక్ చేయండి.