
Venkatesh Iyer Hat Trick Half Century: ప్రతి సంవత్సరం లాగే చాలా మంది ఖరీదైన ఆటగాళ్ళు ఐపీఎల్ 2025 సీజన్‌లో మైదానంలోకి అడుగుపెట్టారు. వీళ్లపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే, ఇందులో చాలామంది ఎప్పటిలాగే తీవ్రంగా నిరాశపరిచారు. ఈ లిస్టులో వెంకటేష్ అయ్యర్ కూడా ఉన్నాడు. గత మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన వెంకటేష్ అయ్యర్.. 4వ మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోన్న కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో, రూ.23.75 కోట్ల విలువైన ఆటగాడు వెంకటేష్ అయ్యర్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో విమర్శలకు తెరదించాడు. ఈ బ్యాట్స్‌మెన్ అద్భుతమైన అర్ధ సెంచరీతో కేకేఆర్‌ను 200 పరుగులకు చేర్చాడు.
ఏప్రిల్ 3వ తేదీ గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా, హైదరాబాద్‌తో తలపడుతోంది. గత సీజన్ ఫైనల్ మ్యాచ్ రెండు జట్ల మధ్య జరిగింది. ఆ తర్వాత ఇరుజట్ల మధ్య జరుగుతోన్న మొదటి ఎన్కౌంటర్. ఆ ఫైనల్ లాగే, వెంకటేష్ అయ్యర్ మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి కోల్‌కతా జట్టును మంచి ఫొజిషన్‌లో ఉంచాడు. వెంకటేష్ అయ్యర్ కేవలం 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో సన్‌రైజర్స్‌పై హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు చేసేందుకు దారి తీసింది. గత సీజన్ ప్రారంభంలో, అతను ఫైనల్‌తో సహా వరుసగా రెండు మ్యాచ్‌లలో అర్ధ సెంచరీలు సాధించాడు. సన్‌రైజర్స్‌పై ఇది అతని వరుసగా మూడో హాఫ్ సెంచరీ.
Lighting up Eden Gardens with some fireworks 💥
Sit back and enjoy Rinku Singh and Venkatesh Iyer’s super striking 🍿👏
5⃣0⃣ up for Iyer in the process!
Updates ▶ https://t.co/jahSPzdeys#TATAIPL | #KKRvSRH | @KKRiders pic.twitter.com/AAAqnOsRy8
— IndianPremierLeague (@IPL) April 3, 2025
ఈ సీజన్‌లో వెంకటేష్ చాలా చెత్త ఆరంభాన్ని పొందాడు. మెగా వేలంలో కోల్‌కతా అతనిని రూ.23.75 కోట్లు చెల్లించి అందరినీ ఆశ్చర్యపరిచేలా చేసింది. ఇటువంటి పరిస్థితిలో వెంకటేష్ అయ్యర్‌పై అందరి కళ్లు నిలిచాయి. ఐపీఎల్ 2025లో మొదటి మూడు మ్యాచ్‌లలో అతను విఫలమయ్యాడు. దీని కారణంగా, అతనిపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో కీలక మ్యాచ్‌లో రాణించి, సత్తా చాటాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..