KKR vs SRH Highlights IPL 2022 :KKR vs SRH Live Score, IPL 2022 : కోల్‌కతా చేతిలో కంగుతిన్న సన్‌రైజర్స్‌.. ప్లే ఆఫ్‌ అవకాశాలు గల్లంతు!

| Edited By: Anil kumar poka

Jun 07, 2022 | 3:44 PM

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Highlights in Telugu: డూ ఆర్‌ డై మ్యాచ్‌లో కోల్‌కతా అదరగొట్టింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను 54 పరుగుల తేడాతో మట్టికరిపించి ప్లే ఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఆండ్రీ రస్సెల్ కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

KKR vs SRH Highlights IPL 2022 :KKR vs  SRH Live Score, IPL 2022 : కోల్‌కతా చేతిలో కంగుతిన్న సన్‌రైజర్స్‌.. ప్లే ఆఫ్‌ అవకాశాలు గల్లంతు!
Kkr Vs Srh Live Score

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Live Score in Telugu:  ఐపీఎల్‌లో 2022లో భాగంగా మరికొద్ది సేపట్లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య ఆసక్తికర మ్యాచ్‌ (KKR vs SRH ) జరగనుంది. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఈ ఇంట్రెస్టింగ్‌ పోరుకు వేదిక కానుంది. ప్లే ఆఫ్‌ రేసులో నిలవాంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ అత్యంత కీలకం. ఓడిపోతే మాత్రం ఇరుజట్లకు ద్వారాలు మూసుకుపోయినట్లే. ప్రస్తుతం ఈ రెండు జట్లూ 10 పాయింట్లతో ఉన్నాయి. ఇక ఐపీఎల్‌లో ఇరు జట్ల మధ్య మొత్తం 22 మ్యాచ్‌లు జరగ్గా, కోల్‌కతా 14 మ్యాచ్‌లు గెలుపొందగా, సన్‌రైజర్స్ ఎనిమిది మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య ఇది రెండో మ్యాచ్. ఏప్రిల్ 15న జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై సన్‌రైజర్స్ విజయం సాధించింది. ఈక్రమంలో హైదరాబాద్‌పై విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవాలని శ్రేయస్‌ సేన భావిస్తోంది.

ఇరుజట్ల ప్లేయింగ్-XI ఎలా ఉందంటే..

సన్‌రైజర్స్ హైదరాబాద్:

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐదాన్ మార్క్‌రామ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, మార్కో యాన్సన్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్.

కోల్‌కతా నైట్ రైడర్స్: 

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), ఉమేష్ యాదవ్, టిమ్ సౌతీ మరియు వరుణ్ చక్రవర్తి

Key Events

సుందర్, నటరాజన్ తిరిగి వచ్చారు..

హైదరాబాద్ జట్టులో మూడు మార్పులు చేసింది. వాషింగ్టన్ సుదర్, టి.నటరాజన్ తిరిగి జట్టులోకి వచ్చారు. మార్కో జేన్సన్ కూడా తిరిగి వచ్చాడు.

కోల్‌కతా జట్టులో మార్పులు..

ఈ మ్యాచ్‌లో కోల్‌కతా రెండు మార్పులు చేసింది. గాయపడిన పాట్ కమిన్స్ స్థానంలో ఉమేష్ యాదవ్, షెల్డన్ జాక్సన్ స్థానంలో సామ్ బిల్లింగ్స్ చోటు కల్పించింది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 19 May 2022 07:12 PM (IST)

    ఆర్సీబీకి ఈ మ్యాచ్ కీలకం

    RCB ఏడు మ్యాచ్‌లు గెలిచి ఆరింటిలో ఓడిపోయింది.  14 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. అయితే, RCB నికర రన్ రేట్ మైనస్ 0.323. గుజరాత్‌పై గెలిస్తే 16 పాయింట్లకు చేరుకుంటుంది.

  • 14 May 2022 11:20 PM (IST)

    హైదరాబాద్‌ ఖాతాలో మరో ఓటమి..

    హైదరాబాద్‌ మళ్లీ ఓడింది. శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ప్లే ఆఫ్‌ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. కోల్‌కతా జట్టులో ఆండ్రీ రస్సెల్‌ ఆల్‌రౌండ్‌ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు. 49 పరుగులు చేయడంతో పాటు మూడు వికెట్లు పడొగొట్టి కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించాడు.


  • 14 May 2022 11:10 PM (IST)

    ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన హైదరాబాద్‌..

    సన్‌రైజర్స్‌ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. సౌథీ బౌలింగ్‌లో శశాంక్‌ సింగ్‌ (11) ఔటయ్యాడు. ఆ జట్టు విజయానికి ఇంకా 9 బంతుల్లో 63 పరుగులు అవసరం.

  • 14 May 2022 11:04 PM (IST)

    ఓటమి దిశగా హైదరాబాద్‌..

    హైదరాబాద్‌ పరాజయం దిశగా సాగుతోంది. 178 పరుగుల లక్ష్య సాధనలో ఆ జట్టు 107 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు విజయానికి ఇంకా 17 బంతుల్లో 71 పరుగులు అవసరం.

  • 14 May 2022 10:48 PM (IST)

    ఐదో వికెట్‌ డౌన్..

    హైదరాబాద్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్లో మర్‌క్రమ్‌ (32) ఔటయ్యాడు. ప్రస్తుతం సన్‌రైజర్స్‌ స్కోరు 14.4 ఓవర్లలో 99/5.

  • 14 May 2022 10:48 PM (IST)

    సన్‌రైజర్స్‌కు మరో షాక్‌.. పెవిలియన్‌ చేరిన పూరన్‌..

    హైదరాబాద్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఆదుకుంటాడనుకున్న నికోలస్‌ పూరన్‌ (2) సునీల్‌ నరైన్‌ బౌలింగ్లో అతనికే క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 76 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. కాగా హైదరాబాద్‌ విజయానికి 37 బంతుల్లో 88 రన్స్‌ అవసరం. క్రీజులో మర్‌క్రమ్‌ (25), సుందర్‌ (1) ఉన్నారు.

  • 14 May 2022 10:34 PM (IST)

    మూడో వికెట్‌ కోల్పోయిన హైదరాబాద్

    హైదరాబాద్ మూడో వికెట్‌ కోల్పోయింది. అభిషేక్ శర్మ 43 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో హైదరాబాద్ 11.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 50 బంతుల్లో 106 పరుగులు చేయాల్సి ఉంది.

  • 14 May 2022 10:27 PM (IST)

    10 ఓవర్లకి సన్‌రైజర్స్‌ హైదరాబాద్ 66/2

    హైదరాబాద్ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ 41 పరుగులు, మార్క్రమ్‌ 6 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 60 బంతుల్లో 112 పరుగులు చేయాల్సి ఉంది.

  • 14 May 2022 10:19 PM (IST)

    రెండో వికెట్‌ కోల్పోయిన హైదరాబాద్

    హైదరాబాద్ రెండో వికెట్‌ కోల్పోయింది. రాహుల్‌ త్రిపాఠి 9 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో హైదరాబాద్ 8.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 70 బంతుల్లో 124 పరుగులు చేయాల్సి ఉంది.

  • 14 May 2022 10:16 PM (IST)

    50 పరుగులు దాటిన హైదరాబాద్‌

    సన్‌రైజర్స్‌ 7 ఓవర్లలో 1 వికెట్‌ నష్టానికి 50 పరుగులు దాటింది. క్రీజులో రాహుల్‌ త్రిపాఠి 8 పరుగులు, అభిషేక్ శర్మ 35 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 72 బంతుల్లో 124 పరుగులు చేయాల్సి ఉంది.

  • 14 May 2022 10:04 PM (IST)

    మొదటి వికెట్‌ కోల్పోయిన హైదరాబాద్‌..

    కెప్టెన్ విలియమ్సన్‌ (9) మళ్లీ నిరాశపర్చాడు. రస్సెల్‌ ఔలింగ్‌లో క్లీన్‌బౌల్డై పెవిలియన్‌కు చేరుకున్నాడు. 5.2 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ స్కోరు 30/1.

  • 14 May 2022 09:54 PM (IST)

    హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ ఆరంభం..

    హైదరాబాద్‌ ఇన్నింగ్స్ ఆరంభమైంది. విలియమ్సన్‌ (6), అభిషేక్‌ శర్మ (16) నిలకడగా ఆడుతున్నారు. 3.3 ఓవర్లు ముగిసే సరికి SRH స్కోరు 23/0.

  • 14 May 2022 09:28 PM (IST)

    రస్సెల్‌ మెరుపులు..

    ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రస్సెల్‌ మళ్లీ అదరగొట్టాడు. 28 బంతుల్లో 49 పరుగులు చేసి కోల్‌కతాకు 177 పరుగుల భారీ స్కోరు అందించాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి.

  • 14 May 2022 09:17 PM (IST)

    కోల్‌కతా ఆరో వికెట్‌ డౌన్‌..

    కోల్‌కతా ఆరో వికెట్‌ కోల్పోయింది. భువనేశ్వర్‌ బౌలింగ్‌లో సామ్ బిల్లింగ్స్ (34) పెవిలియన్‌కు చేరుకున్నాడు.19 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా స్కోరు 157/6. క్రీజులో ఆండ్రీ రస్సెల్‌ (30) ఉన్నాడు.

  • 14 May 2022 09:08 PM (IST)

    ఆచితూచి ఆడుతోన్న కేకేఆర్‌ బ్యాటర్లు..

    కేకేఆర్‌ బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. సామ్‌ బిల్లింగ్స్ (27), ఆండ్రీ రస్సెల్‌ (27) వేగంగా పరుగులు చేస్తున్నారు. 17.3 ఓవర్లు ముగిసే సరికి 144/5.

  • 14 May 2022 08:35 PM (IST)

    వరుసగా వికెట్లు కోల్పోతున్న కోల్‌కతా..

    కోల్‌కతా మరో వికెట్‌ కోల్పోయింది. నటరాజన్‌ బౌలింగ్‌లో రింకూసింగ్‌ (5) ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 11.3 ఓవర్లు ముగిసే సరికి 94/5.

  • 14 May 2022 08:29 PM (IST)

    నాలుగో వికెట్‌ డౌన్‌.. పెవిలియన్‌ చేరిన కెప్టెన్‌..

    కోల్‌కతా నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ (15) పెవిలియన్‌కు చేరుకున్నాడు. 11 ఓవర్ల ముగిసే సరికి ఆ జట్టు స్కోరు 89/4.

  • 14 May 2022 08:14 PM (IST)

    వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన కోల్‌కతా..

    కోల్‌కతా వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. ధాటిగా ఆడుతోన్న నితీశ్‌ రాణా (26), రహానే (28) వెంటవెంటనే ఔటయ్యారు. ఈ రెండు వికెట్లు ఉమ్రాన్‌ ఖాతాలోకే చేరడం విశేషం. 8 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా స్కోరు 72/3.

  • 14 May 2022 07:58 PM (IST)

    50 దాటిన కోల్‌కతా స్కోరు..

    కోల్‌కతా బ్యాటర్లు ధాటిగా ఆడుతున్నారు. నితీష్‌ రాణా (13 బంతుల్లో 24) , రహానే (16 బంతుల్లో 19) వేగంగా పరుగులు సాధిస్తున్నారు. పవర్‌ ప్లే ముగిసే సరికి కేకేఆర్‌ స్కోరు 55/1

  • 14 May 2022 07:41 PM (IST)

    మొదటి వికెట్‌ కోల్పోయిన కోల్‌కతా..

    వెంకటేశ్‌ అయ్యర్‌ (7) మళ్లీ నిరాశపర్చాడు. మార్కో జాన్సెన్‌ బౌలింగ్‌లో వికెట్లకు అడ్డంగా ఆడి బౌల్డయ్యాడు. 2 ఓవర్లకు కేకేఆర్‌ స్కోరు 17/1.

  • 14 May 2022 07:33 PM (IST)

    ఇన్నింగ్స్‌ ప్రారంభించిన రహానే, అయ్యర్‌..

    కోల్‌కతా ఇన్నింగ్స్‌ను అజింక్యా రహానే, వెంకటేశ్‌ అయ్యర్‌ ప్రారంభించారు. హైదరాబాద్‌ తరఫున భువనేశ్వర్‌ కుమార్‌ మొదటి ఓవర్‌ అందుకున్నాడు.

  • 14 May 2022 07:26 PM (IST)

    టాస్‌ గెలిచిన కోల్‌కతా..

    హైదరాబాద్‌ తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా కెప్టెన్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. పిచ్‌పై పచ్చిక ఉంది కాబట్టి బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని పిచ్‌ క్యూరేటర్‌ చెబుతున్నాడు.

Follow us on