
Prabhsimran Singh Record: ఐపీఎల్ 18వ సీజన్‌లో చాలా మంది యువ ఆటగాళ్ళు తమ అద్భుతమైన ప్రదర్శనలతో అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నారు. ఈ ఆటగాళ్ల జాబితాలో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కూడా చేరాడు. ఈ టోర్నమెంట్‌లో మరోసారి పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. ఐపీఎల్ (IPL) 2025లో భాగంగా 44వ మ్యాచ్‌లో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై అద్భుతంగా బ్యాటింగ్ చేసి 83 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ సహాయంతో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ తన పేరు మీద భారీ రికార్డును నమోదు చేసుకున్నాడు.
ఈ యువ కుడిచేతి వాటం ప్లేయర్ ఇప్పుడు ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరపున 1000 పరుగులు చేసిన పదవ ఆటగాడిగా నిలిచాడు. ప్రభ్‌సిమ్రాన్ తన 43వ ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను సాధించాడు. అతను కేఎల్ రాహుల్ , మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, గ్లెన్ మాక్స్వెల్ వంటి ప్రత్యేక ఆటగాళ్ల జాబితాలో చేరాడు.
ప్రభ్‌సిమ్రాన్ 2019 నుంచి పంజాబ్ జట్టులో భాగంగా ఉన్నాడు. అతను ఇప్పటివరకు 43 మ్యాచ్‌లు ఆడి 24.37 సగటుతో 1048 పరుగులు చేశాడు. ప్రభ్‌సిమ్రాన్ 151 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో ఈ పరుగులు చేశాడు. ప్రభ్‌సిమ్రాన్ IPLలో 1 సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు చేశాడు.
2,548 – KL రాహుల్ (55 ఇన్నింగ్స్)
2,477 – షాన్ మార్ష్ (69 ఇన్నింగ్స్‌లు)
1,850 – డేవిడ్ మిల్లర్ (77 ఇన్నింగ్స్‌లు)
1,513 – మయాంక్ అగర్వాల్ (59 ఇన్నింగ్స్‌లు)
1,339 – క్రిస్ గేల్ (41 ఇన్నింగ్స్‌లు)
1,335 – గ్లెన్ మాక్స్‌వెల్ (67 ఇన్నింగ్స్‌లు)
1,115 – వృద్ధిమాన్ సాహా (49 ఇన్నింగ్స్)
1,073 – మన్దీప్ సింగ్ (58 ఇన్నింగ్స్)
1,009 – కుమార్ సంగక్కర (34 ఇన్నింగ్స్‌లు)
1,048 – ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (43 ఇన్నింగ్స్‌లు).
ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేశారు. ఈ మ్యాచ్ కేవలం 21 ఓవర్లకే పరిమితం అయింది. అంతకుముందు, ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ క్లిష్టమైన పిచ్‌పై 201 పరుగులు చేయగలిగింది. అనంతరం కేకేఆర్ ఛేజింగ్ సమయంలో వర్షం కురవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..