Kolkata Knight Riders vs Lucknow Super Giants: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్‌లో 68వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన కోల్‌కతా బౌలింగ్ ఎంచుకుంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు 177 పరుగుల టార్గెట్ నిలిచింది. నికోలస్ పూరన్, ఆయుష్ బదోని మధ్య అర్ధ సెంచరీ భాగస్వామ్యంతో లక్నో జట్టు పోరాడే స్కోర్‌ను సాధించింది.
25 పరుగుల వద్ద ఆయుష్ బదోని ఔటయ్యాడు. క్వింటన్ డి కాక్ 28 పరుగుల వద్ద పెవిలియన్ చేరగా.. కరణ్ శర్మ 3 పరుగుల వద్ద, ప్రేరక్ మన్కడ్ 26 పరుగుల వద్ద, మార్కస్ స్టోయినిస్ సున్నా వద్ద ఔటయ్యారు.
వైభవ్ అరోరా, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్ తలో 2 వికెట్లు తీశారు.
లక్నో సూపర్ జెయింట్స్(ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), కరణ్ శర్మ, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా(కెప్టెన్), ఆయుష్ బదోని, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..