AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్.. గాయపడిన మరో స్టార్ ప్లేయర్..!

IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 16వ సీజన్ ప్రారంభానికి ముందు, ప్లేయర్ల గాయాలు అనేక ఫ్రాంచైజీలకు తలనొప్పిగా మారింది. సీజన్ ప్రారంభం కాకముందే పలువురు కీలక ఆటగాళ్లు టోర్నీ నుంచి వైదొలిగారు.

IPL 2023: కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్.. గాయపడిన మరో స్టార్ ప్లేయర్..!
Kkr
Venkata Chari
|

Updated on: Mar 24, 2023 | 6:55 AM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 16వ సీజన్ ప్రారంభానికి ముందు, ప్లేయర్ల గాయాలు అనేక ఫ్రాంచైజీలకు తలనొప్పిగా మారింది. సీజన్ ప్రారంభం కాకముందే పలువురు కీలక ఆటగాళ్లు టోర్నీ నుంచి వైదొలిగారు. ఇప్పుడు టోర్నీ ప్రారంభానికి రోజులు దగ్గర పడుతుండడంతో దేశవాళీ ఆటగాళ్లతో పాటు పలువురు విదేశీ ఆటగాళ్లు గాయపడుతుండడం ఫ్రాంచైజీలకు కష్టాన్ని పెంచింది. కొద్ది రోజుల క్రితం కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా మొత్తం ఐపీఎల్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం.. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ గాయపడడం జట్టు ఆందోళనను మరింత పెంచింది.

వాస్తవానికి, ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో నాలుగో టెస్టులో శ్రేయాస్ అయ్యర్ గాయపడ్డాడు. అందుకే, నాలుగో టెస్టు తొలి రోజు ఫీల్డింగ్‌కు దిగిన అయ్యర్.. జట్టు తరపున బ్యాటింగ్ చేసేందుకు కూడా మైదానానికి రాలేదు. నిజానికి వెన్నునొప్పి కారణంగా నాగ్‌పూర్‌లో జరిగిన ఈ సిరీస్‌లో తొలి టెస్టులో కూడా శ్రేయాస్ అయ్యర్ ఆడలేదు. ఇప్పుడు అతను ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాడని, శస్త్రచికిత్స చేయించుకోనున్నాడని వార్తలు వచ్చాయి.

లాకీ ఫెర్గూసన్ గాయపడ్డాడు..

సీజన్ ఆరంభానికి ముందే కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అందుబాటులో లేకపోవడంతో షాక్‌కు గురైన కోల్‌కతా నైట్ రైడర్స్.. ఇప్పుడు ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ గాయపడడం మరింత ఆందోళనకు గురి చేసింది. స్నాయువు సమస్యతో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేకు ఫెర్గూసన్ దూరమయ్యాడు. ప్రస్తుతం గాయంతో బాధపడుతున్న ఫెర్గూసన్ ఐపీఎల్ ప్రారంభానికి ముందే కోలుకోకపోతే జట్టు ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవటం ఖాయం.

ఇవి కూడా చదవండి

14 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు..

గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడిన ఫెర్గూసన్‌ను మినీ వేలంలో KKR తీసుకుంది. అలాగే KKR ఫెర్గూసన్‌పై ఎక్కువగా ఆధారపడి ఉంది. ఎందుకంటే గత ఎడిషన్‌లో పాట్ కమిన్స్, టిమ్ సౌథీలు పవర్‌ప్లేలో వికెట్లు తీయడానికి ఇబ్బంది పడ్డారు. అందువల్ల పవర్‌ప్లేలో వికెట్‌ టేకర్‌గా మారిన ఫెర్గూసన్‌ అందుబాటులో లేకపోవడం కేకేఆర్‌ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడిన ఫెర్గూసన్ 14 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..