KKR vs RCB: 9 ఫోర్లు, 3 సిక్సులు.. 240 స్ట్రైక్‌రేట్‌తో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. లార్డ్ శార్దుల్ దెబ్బకు.. షాక్‌లో కోహ్లీ టీం..

కోల్‌కతా ఆటగాళ్లు శార్దూల్ ఠాకూర్, రింకూ సింగ్ ధాటిగా ఆడడంతో.. కోల్‌కతా భారీ స్కోర్ నమోదు చేసింది. కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్లకు 204 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో కర్ణ్ శర్మ, డేవిడ్ విల్లీ 2-2 వికెట్లు తీశారు.

KKR vs RCB: 9 ఫోర్లు, 3 సిక్సులు.. 240 స్ట్రైక్‌రేట్‌తో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. లార్డ్ శార్దుల్ దెబ్బకు.. షాక్‌లో కోహ్లీ టీం..
Shardul Thakur
Follow us
Venkata Chari

|

Updated on: Apr 06, 2023 | 9:30 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య మ్యాచ్ జరుగుతోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కోల్‌కతా ఆటగాళ్లు శార్దూల్ ఠాకూర్, రింకూ సింగ్ ధాటిగా ఆడడంతో.. కోల్‌కతా భారీ స్కోర్ నమోదు చేసింది. కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్లకు 204 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో కర్ణ్ శర్మ, డేవిడ్ విల్లీ 2-2 వికెట్లు తీశారు.

శార్దూల్ 20 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. గుర్బాజ్ కూడా తన అర్ధ సెంచరీని సాధించి, కర్ణ్ శర్మకు బలి అయ్యాడు. ఆ తర్వాతి బంతికి ఆండ్రీ రస్సెల్ క్యాచ్ అవుట్ అయ్యాడు. నితీష్ రాణా ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు. నాలుగో ఓవర్‌లో వరుసగా 2 బంతుల్లో వెంకటేష్ అయ్యర్, మన్‌దీప్ సింగ్‌లను డేవిడ్ విల్లీ అవుట్ చేశాడు. వెంకటేష్ 3 పరుగులు చేయగా, మన్దీప్ ఖాతా కూడా తెరవలేకపోయాడు.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్-2023లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ..

శార్దూల్ ఠాకూర్ 20 బంతుల్లోనే పూర్తి చేశాడు. ఆండ్రీ రస్సెల్ సున్నాకి అవుటైన తర్వాత శార్దూల్ బ్యాటింగ్‌కు వచ్చాడు. మైకేల్ బ్రేస్‌వెల్ వేసిన ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన శార్దుల్.. 17వ ఓవర్‌లో యాభైని పూర్తి చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇది ఉమ్మడి ఫాస్టెస్ట్ ఫిఫ్టీగా నమోదైంది. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ జోస్ బట్లర్‌ను సమం చేశాడు. హైదరాబాద్‌పై బట్లర్ కేవలం 20 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు.

గుర్బాజ్ 38 బంతుల్లో ఫిఫ్టీ..

గుర్బాజ్ పవర్‌ప్లేలో భారీ షాట్లు ఆడాడు. ఆ తర్వాత తొలి వికెట్‌ పతనం తర్వాత ఇన్నింగ్స్‌ను చేతబట్టి అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 44 బంతుల్లో 57 పరుగులు చేసి క్యాచ్ ఔట్ అయ్యాడు.

రెండు జట్ల ప్లేయింగ్-11..

కోల్‌కతా నైట్ రైడర్స్: నితీష్ రాణా (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), రింకు సింగ్, మన్‌దీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, సుయాష్ అరోరా.

ఇంపాక్ట్ ప్లేయర్స్: అనుకుల్ రాయ్, మన్‌దీప్ సింగ్, జగదీషన్, డేవిడ్ వైస్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్) , విరాట్ కోహ్లీ, మైకేల్ బ్రేస్‌వెల్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, మహ్మద్ సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాష్ దీప్.

ఇంపాక్ట్ ప్లేయర్స్: అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, సుయాష్ ప్రభుదేశాయ్.