
టెస్ట్ క్రికెట్‌లో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ, అజాజ్ పటేల్ పది వికెట్ల ఘనత సాధించి ప్రపంచ రికార్డులు నెలకొల్పారు. అయితే ఆ తర్వాతి మ్యాచ్‌లలోనే వారిద్దరూ తమ జట్లలో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రపంచ రికార్డులు సృష్టించినా జట్టులో స్థానం దక్కకపోవడంతో వీరు అన్ లక్కీ ప్లేయర్స్‌గా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.! టెస్ట్ క్రికెట్ చరిత్రలో ప్రపంచ రికార్డులు నెలకొల్పినప్పటికీ, భారత ఆటగాడు కరుణ్ నాయర్, న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ తమ జట్లలో స్థానాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారు.
ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో
దీంతో వారిద్దరినీ క్రికెట్ చరిత్రలోనే అత్యంత అన్‌లక్కీ ప్లేయర్స్‌గా నిలిపింది. కరుణ్ నాయర్ 2016లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అద్భుతమైన ట్రిపుల్ సెంచరీని సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచినప్పటికీ, ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు తుది జట్టులో చోటు కోల్పోయి బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఆ తర్వాత దాదాపుగా ఏడేళ్లు లేదా ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి రీ-ఎంట్రీ ఇచ్చాడు. అలాగే, న్యూజిలాండ్‌కు చెందిన స్పిన్నర్ అజాజ్ పటేల్ 2021లో ముంబైలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియాపై ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసి అరుదైన రికార్డును నెలకొల్పాడు.
జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే తర్వాత ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా అతడు చరిత్ర సృష్టించాడు. అయితే, ఈ చారిత్రక ప్రదర్శన తర్వాత అజాజ్ పటేల్ న్యూజిలాండ్ తరఫున ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. ప్రపంచ రికార్డులు సాధించిన తర్వాత కూడా తమ జట్లలో కొనసాగలేకపోవడం కరుణ్ నాయర్, అజాజ్ పటేల్ కెరీర్‌లో అన్ లక్కీ ప్లేయర్స్‌గా మిగిలిపోయారు.
ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..